xiami
-
'సెల్-బే' లో.. సినీతార ‘వర్షిణి’ సందడి...
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ టాలీవుడ్ నటి, యాంకర్ వర్షిణి గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా సందడి చేశారు. షావోమీ ఆధ్వర్యంలోని సరికొత్త 5జీ హ్యాండ్సెట్ షావోమీ 14 సీవీ మోడల్‌ను నటి వర్షణి గురువారం ఆవిష్కరించారు.ఎప్పటికప్పుడు మారిపోతున్న సాంకేతికత అధునాతన జివన విధానానికి చేరువ చేస్తుందని ఆమె అన్నారు. వినూత్న ఫీచర్స్‌తో రూపొందించిన ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించడం సంతోషమన్నారు. తెలంగాణ కస్టమర్లకు అధునాతన ఉత్పత్తులను అందించడంలో తమ సంస్థ ముందుంటుందని సెల్ బే వ్యవస్థాపకులు, ఎండీ సోమా నాగరాజు పేర్కొన్నారు.ఇండియా డిప్యూటీ హెడ్ కునాల్ అగర్వాల్, ఛానల్ సేల్స్ డైరెక్టర్ మల్లికార్జున రావు, ట్రేడ్ ఛానల్ హెడ్ సాజు రత్నం, జోనల్ హెడ్ సయ్యద్ అన్వర్, నేషనల్ రిటైల్ ఎండీ మొహమ్మద్ ఇఫ్తేకర్ పాల్గొన్నారు.ఇవి చదవండి: బే విండోకు.. డిజైన్ ఎక్స్‌లెన్స్! -
'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్..
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా గురువారం ప్రముఖ యాంకర్, సినీతార వర్షిణి సౌందరాజన్ నూతన షావోమీ 14 సీవీ మోడల్‌ను ఆవిష్కరించనున్నారు.మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహించే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీతార వర్షిణి సౌందరాజన్తో పాటు పలువురు ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొంటారని స్టోర్ నిర్వాహకులు పేర్కొన్నారు.ఇవి చదవండి: కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!! -
పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి! కోరుతున్న సాక్షాత్తు కంపెనీ సీఈవో..
పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దని పలువురు నిపుణులు, వైద్యులు చెప్పడం విన్నాం. కానీ సాక్షాత్తు ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ మాజీ సీఈవోనే తల్లిదండ్రులను పిల్లలకు పోన్లు ఇవ్వొద్దని కోరుతున్నారు. చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్లు ఇస్తే అది వారి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందువల్ల స్మార్ట్ ఫోన్ల విషయలో తల్లిదండ్రులను జాగ్రత్త వహించమని సూచిస్తున్నారు ప్రముఖ షియోమీ ఇండియా కంపెనీ మాజీ సీఈవో కుమార్ జైన్. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతాయో వివరించారు. ఈ మేరకు ఆయన దీనికి సంబంధించి.. యూఎస్‌కు చెందిన ప్రముఖ లాభప్రేక్షలేని సంస్థ సపియన్ ల్యాబ్ అధ్యయనం చేసిందని చెప్పారు. ఆ ల్యాబ్ నుంచి ఒక స్నేహితుడు అందుకు సంబంధించిన విషయాలను తనతో షేర్ చేసుకున్నట్లు లింక్డ్ఇన్లో వెల్లడించారు. ఆ నివేదికలో.. చిన్నప్పుడే స్మార్ట్ఫోన్లకు అలవాటు పడే చిన్నారులు పెద్దయ్యాక మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలిపారు. ఆ అధ్యయన ప్రకారం పదేళ్ల వయసులో స్మార్ట్ఫోన్లకు అలవాటు పడితే పెద్దయ్యాకు మహళలైతే 60%-70% మంది దాక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని, అదే పురుషులైతే 45%-50% మంది దాక ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదిక వెల్లడించిందని కుమార్ జైన్ వెల్లడించారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది కావున దయచేసి వారిని వేరే యాక్టివిటీస్‌లో నిమగ్నమయ్యేలా చూడండని తల్లిదండ్రులకు విజ్ఞిప్తి చేశారు. అది ఏదైనా అభ్యాసం లేదా వారి అభిరుచికి సంబంధించిన వాటిల్లో ప్రోత్సహిస్తే గనుక మనం వారికి ఆరోగ్యకరమైన సమతుల్య వాతావరణాన్ని అందించగలిగిన వారమవుతాం అని చెప్పారు. చిన్న వయసులోనే ఎక్కువ సమయం స్క్రీన్‌పై గడిపితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడి పలు దుష్ప్రరిణామాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. బాల్యం చాల విలువైనదని, ఆ సమయాన్ని వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అంశాల్లో కేంద్రీకరించేలా చేసి వారి భవిష్యత్తుకు మంచి పునాదిని ఏర్పరుచుకనేలా ప్రోత్సహించాల్సిన భాద్యత మనమిదే ఉందని చెప్పారు. అదేసమయంలో తాను స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లకి వ్యతిరేకిని కాదని, ఐతే చిన్న పిల్లలను మాత్రం స్మార్ట్ ఫోన్లకు సాధ్యమైనంత దూరంగా ఉంచేలా జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులని కోరుతున్నట్లు లింక్డ్ఇన్లో చెప్పుకొచ్చారు. (చదవండి: ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..) -
ఆ విషయంలో షావోమీ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్న ఐఫోన్!
ఖరీదైన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ( iPhone 15 Pro Max) ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. అయితే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ల ఫ్రంట్ గ్లాస్‌కు సంబంధించిన వీడియోలు ఇటీవల ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇందులో స్క్రీన్ బెజెల్ చాలా సన్నగా ఉన్నట్లు తెలుస్తోంది. డిస్ప్లే స్క్రీన్కు చుట్టూ ఫోన్ ఫ్రేమ్‌కు మధ్య ఉన్న అంచును స్క్రీన్ బెజెల్ అని అంటారు. ఇదీ చదవండి: యాపిల్ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు! ఈ స్క్రీన్ బెజెల్ విషయంలో షావోమీ రికార్డ్‌ను ఐఫోన్ అధిగమించనుంది. షావోమీ (Xiaomi) 13 స్క్రీన్ బెజెల్ 1.81 ఎంఎం. ఇప్పటివరకూ ఇదే అతి సన్నని బెజెల్. ఇప్పుడు ఈ రికార్డ్‌ను యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బద్ధలుకొట్టబోతోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ ఫోన్ బెజెల్ వెడెల్పు 1.55 ఎంఎం ఉంటుందని టిప్‌స్టర్ ఒకరు ట్విటర్లో షేర్ చేశారు. ఆల్వేస్ ఆన్, ప్రో మోషన్ వంటి డిస్ప్లే ఫీచర్లను యాపిల్.. రాబోయే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లకు పరిమితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే Wi-Fi 6E నెట్వర్క్ ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుందని పుకారు వచ్చింది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లలో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో కూడిన సాలిడ్ స్టేట్ బటన్లు, టైటానియం ఫ్రేమ్, అధిక ర్యామ్ వంటి కొత్త ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది. iPhone 15 Pro Max will break the record of 1.81mm bezel black edge held by Xiaomi 13, and we measure that its cover plate black bezel width is only 1.55 mm.(S22 and S23 ≈1.95mm,iPhone 14 Pro 2.17mm) pic.twitter.com/9TBrVCGSCo — Ice universe (@UniverseIce) March 17, 2023 -
సేల్స్ బీభత్సం!! గతేడాది ఎక్కువగా అమ్ముడైన టాప్-10 స్మార్ట్ఫోన్లు ఇవే!
వరల్డ్ వైడ్ స్మార్ ఫోన్ మార్కెట్లో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ సేల్స్ బీభత్సం సృష్టిస్తున్నాయి. గతేడాది ఎక్కువగా కొనుగోలు చేసిన టాప్-10 స్మార్ట్ ఫోన్లలో ఏడు స్థానాల్ని ఐఫోన్లే సొంతం చేసుకున్నాయి. ప్రముఖ రీసెర్చ్ సంస్థ 'కౌంటర్ పాయింట్' తాజాగా గ్లోబల్ టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ -2021 పేరుతో ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం యాపిల్ బ్రాండ్‌కు చెందిన 7 ఐఫోన్లను, యాపిల్ తర్వాత శాంసంగ్ ఒక ఫోన్ , షావోమీ రెండు ఫోన్లను ఎక్కువగా కొనుగులు చేసినట్లు రిపోర్ట్‌లో హైలెట్ చేసింది. ఇక 2021లో ఎక్కువగా అమ్ముడైన టాప్ ఫైవ్ ఐఫోన్లలో ఐఫోన్ 12 ప్రథమ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత 41శాతంతో ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13, ఐఫోన్ 12ప్రో, ఐఫోన్ 11 అమ్మకాలు జరిగాయి. క్యూ4లో ఐఫోన్ 12 కంటే అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఐఫోన్ 12ప్రో మ్యాక్స్, ఐఫోన్13 ఫోన్లు ముందున్నాయి. ఐఫోన్ 12 ప్రో నాల్గవ స్థానంలో ఉండగా..2019లో విడుదలైన ఐఫోన్ 11తర్వాతి స్థానంలో ఉంది.శాంసంగ్, షోవోమీ మాత్రమే టాప్-10 జాబితాలో నిలవగా శాంసంగ్ గెలాక్సీ ఏ12 ఆరోస్థానంలో ఆ తర్వాత షోవోమీ రెడ్మీ 9ఏ ఏడవ స్థానంలో నిలిచింది. యాపిల్‌కు చెందిన ఐఫోన్ ఎస్ఈ 2020-2021లో అత్యధికంగా అమ్ముడైన పరికరంలో ఎనిమిదో స్థానంలో ఉండగా, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 ఫోన్లు మొత్తం గ్లోబల్ అమ్మకాలలో 19శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2020 విలువలతో పోలిస్తే 3 శాతం పాయింట్లు పెరిగాయి. చదవండి: యాపిల్ ఈవెంట్: టెక్ లవర్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త ప్రొడక్ట్‌లు!! -
షావోమి ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమి ఇండియా తన ఉద్యోగులకు తీపికబురు అందించింది. హార్డ్‌షిప్ బోనస్‌కింద ఉద్యోగులకు15 రోజుల జీతాన్ని బోనస్ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంలో ఇబ్బందులను ఎదుర్కొన్న కార్పొరేట్ ఉద్యోగులతోపాటు ఇతరలకు వార్షిక బిజినెస్ బోనస్‌కు అదనంగా ఈ బోనస్‌ను అందించనుంది. అలాగే తన ఉద్యోగులందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యులతోపాటు, ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్ ఖర్చులను తామే భరిస్తామని షావోమి ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ తెలిపారు. వీరందరికీ అర్హత ప్రమాణాల ప్రకారం కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ 60వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులను కలిగి ఉంది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ తరువాత దేశీయ డిమాండ్ పెరగడంతో, ఎగుమతులను నిలిపివేయాలని భావిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. స్థానిక డిమాండ్‌కే తమ తొలి ప్రాధాన్యమని జైన్ తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకంలో భాగంగా తన భాగస్వాములతో కలిసి దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. కాగా సీఎంఆర్ ఇండియా డేటా ప్రకారం 2020 మూడవ త్రైమాసికంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్‌లో ఉంది షావోమి. 27 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్‌గా ఉంది. దేశంలో స్మార్ట్ఫోన్లతో పాటు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వీఆర్ హెడ్సెట్లు వర్ బ్యాంక్‌లను షావోమి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
మ్యూజిక్ బిజినెస్‌కు అలీబాబా టాటా
న్యూఢిల్లీ: చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్ జియామీ మ్యూజిక్‌ను వచ్చే నెల నుంచీ మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చైనా ఎంటర్టైన్మెంట్ రంగంలో భారీగా ఎదగాలని అలీబాబా తొలుత వేసిన ప్రణాళికలకు దీంతో చెక్ పడవచ్చని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో అభిప్రాయపడింది. కార్యకలాపాల సర్దుబాటులో భాగంగా జియామీ మ్యూజిక్‌ను ఫిబ్రవరి 5 నుంచి నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. 2013లో మ్యూజిక్ యాప్‌పై అలీబాబా గ్రూప్ మిలియన్లకొద్దీ ఇన్వెస్ట్ చేసింది. తద్వారా చైనీస్ భారీ మ్యూజిక్ మార్కెట్లో ప్రవేశించింది. అయితే ప్రణాళికలు విజయవంతం కాకపోవడంతో వెనకడుగు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా మ్యూజిక్ స్ట్రీమింగ్ మార్కెట్లో జియామీ కేవలం 2 శాతం మార్కెట్ వాటాను మాత్రమే సాధించగలిగింది. వెరసి కుగో, క్యూక్యూ, కువో, నెట్ఈజ్, క్లౌడ్ మ్యూజిక్ తదితర సంస్థల వెనుక నిలిచింది. ఈ వివరాలను బీజింగ్ సంస్థ టాకింగ్ డేటా వెల్లడించింది. కాగా.. గత నెలలో చైనా నియంత్రణ సంస్థలు అలీబాబా గ్రూప్‌నకు చెందన యాంట్ గ్రూప్‌పై యాంటీట్రస్ట్ చట్టంకింద దర్యాప్తును చేపట్టిన విషయం విదితమే. -
రియల్‌మి ఎక్స్2 ప్రో @ రూ. 29,999
చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘రియల్‌మి’.. ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదలచేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ చిప్ అమర్చిన ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుండగా.. 8జీబీ/128జీబీ ధర రూ. 29,999 వద్ద నిర్ణయించింది. 12జీబీ/256జీబీ వేరియంట్ ధర రూ. 33,999. వీటిలో 64–మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాను అమర్చింది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 35 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుందని వివరించింది. ఈ రెండు వేరియంట్లు నవంబర్ 26 నుంచి రిటైల్ కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది. డిజిటల్ లావాదేవీలు 2,178 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 13 నాటికి 2,178 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదైనట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. 2018–19 ఏడాదిలో ఈ మొత్తం 3,134 కోట్లు కాగా, గత కొనేళ్లుగా వృద్ధి వేగవంతంగా ఉందని పేర్కొన్నారు. 2016–17లో కేవలం 1,004 కోట్ల లావాదేవీలు నమోదైతే, ఈ ఏడాదిలో ఇప్పటికే రెట్టింపు లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. -
తక్కువ ధరలో రెడ్‌మిగో.. జియో భారీ క్యాష్‌బ్యాక్
షావోమి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేసింది. రెడ్మి గో పేరుతో దీన్ని మంగళవారం విడుదల చేసింది. ఇది తొలి ఆండ్రాయిడ్ గో ఫోన్ కూడా. దీని ధర రూ. 4499 లు. 22 మార్చి మధ్యాహ్నం 1 గంట నుంచి ఎం.కాం, ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. రెడ్మి గో ఫీచర్లు 5 అంగుళాల డిస్ప్లే 1.4 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషనన్ ఆండ్రాయిడ్8.1 ఓరియో ( గో ఎడిషన్) 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ 8 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ దీనికి లాంచింగ్ ఆఫర్ విషయానికి వస్తే జియో రీ చార్జ్ ద్వారా రూ. 2200 క్యాష్‌బ్యాక్, 100 జీబీ ఉచిత ఆఫర్‌ను అందిస్తోంది. Mi fans, presenting #RedmiGo #AapkiNayiDuniya - Qualcomm® Snapdragon™ 425 - Android™ Oreo™ (Go Edition) - 3000mAh Battery - 8MP Rear camera with LED Flash - 5MP Selfie camera - 5" HD display - 4G Network Connectivity - Color: Blue & black - Price: ₹4,499 RT & spread the ❤️ pic.twitter.com/aanAoiauqj — Mi India (@XiaomiIndia) March 19, 2019 -
రెడ్మి నోట్ 6ప్రో లాంచ్ : స్పెషల్ డిస్కౌంట్
సాక్షి, ముంబై: ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న చైనా మొబైల్ దిగ్గజం షావోమి నాలుగు(క్వాడ్) కెమెరాలతో సరికొత్త ఫోన్నున విడుదల చేసింది. నోట్ సిరీస్‌లో భాగంగా రెడ్మి నోట్ 6ప్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రేపు (నవంబరు23) మధ్యాహ్నం 12గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా తొలి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సందర్భంగా మొదటి రోజున కస్టమర్లకు బంపర్ఆఫర్ ఇస్తోంది. అసలు ధరపై డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. దీనికి అదనంగా హెచ్డీఎఫ్సీ క్రెడిట్/డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.500 తక్షణ క్యాస్‌బ్యాక్ లభించనుంది. అంతేకాదు ట్విటర్లో సెలబ్రిటీల ఫోటోలతో సందడి చేసింది ఎంఐ. రెడ్మి నోట్ 6ప్రో ఫీచర్లు 6.26 ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20+2 ఎంపీ రియర్ కెమెరాలు 12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 4+64 జీబీ ధర 12,999 (మొదటి రోజు మాత్రమే) 6+64 జీబీ ధర 14,999 (మొదటి రోజు మాత్రమే) -
డిజిటల్ రుణాల్లోకి షావోమి
న్యూఢిల్లీ: చైనాకి చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ దిగ్గజం షావోమి... తాజాగా భారత్‌లో డిజిటల్ రుణాల మంజూరీ కార్యకలాపాల్లోకి కూడా ప్రవేశించింది. తమ యూజర్లకు ఇన్స్టంట్ రుణాలందించే దిశగా ‘ఎంఐ (మి) క్రెడిట్’ పేరుతో సర్వీసులు ప్రారంభించింది. ఇందుకోసం విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్‌కి రుణ సదుపాయం అందించే క్రెడిట్‌బీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యువ ప్రొఫెషనల్స్‌కి స్వల్పకాలిక రుణాల మంజూరుకు ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడనుంది. చాలా సరళతరమైన కేవైసీ (ఖాతాదారు సమగ్ర వివరాల) వెరిఫికేషన్ ద్వారా పది నిమిషాల వ్యవధిలోనే రుణ ప్రాసెసింగ్ జరుగుతుందని షావోమి తెలిపింది. ఎంఐ క్రెడిట్ ప్లాట్‌ఫాం ద్వారా షావోమి యూజర్లకు క్రెడిట్‌బీ రూ.1,000 నుంచి రూ.1,00,000 దాకా రుణాలు ఆఫర్ చేస్తోంది. ఇతరత్రా క్రెడిట్ కార్డు సంస్థల తరహాలోనే నెలకు మూడు శాతం (వార్షికంగా 36%) వడ్డీ రేటు ఉంటుంది. కేవలం ఎంఐ యూజర్స్కే తప్ప ఇతర ఆండ్రాయిడ్ యూజర్స్‌కి ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు. తమ ఫోన్ల విక్రయానికి ఈ ఆఫర్ మరింతగా తోడ్పడగలదని షావోమి భావిస్తోంది. ఐడీసీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 31.1% మార్కెట్ వాటాతో స్మార్ట్‌ఫోన్ విభాగంలో భారత్‌లో షావోమి అగ్రస్థానంలో, 25% వాటాతో శాంసంగ్ రెండో స్థానంలో ఉన్నాయి. ఫోన్ స్క్రీన్స్‌పైనే యూజర్స్‌కి లోన్ ఆఫర్లు కనిపిస్తాయి. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే కంపెనీ సైట్ తెరుచుకుంటుంది. అవసరమైన వివరాలన్నీ పొందుపరిచాక రుణ ప్రక్రియ మొదలవుతుంది. అయితే, ప్రాసెసింగ్ చార్జీల వంటివి ఒకసారి చూసుకోవడం మంచిదనేది మార్కెట్ వర్గాల మాట. ప్రస్తుతం క్రెడిట్‌బీ రుణ మొత్తాన్ని బట్టి రూ.100 నుంచి రూ.1,000 దాకా చార్జీలు వసూలు చేస్తోంది. దీన్ని అసలు నుంచి మినహాయించుకున్నాకే మిగతాది విడుదల చేస్తోంది. -
దీపావళి ఫ్లాష్ సేల్: రూ.1 కే స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: చైనాకు చెందిన మొబైల్ తయారీదారు షావోమి అద్భుతమైన దీపావళి ఆఫర్ ప్రకటించింది. దీపావళిసందర్భంగా నిర్వహిస్తున్న ఫ్లాష్ సేల్‌లో రూ. 1కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఈ స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. లిమిటెడ్ సంఖ్యలో డివైస్‌లు అందుబాటులోఉన్నాయని, ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రకారం ఈ సేల్ నిర్వహించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని షావోమి తన పార్ట్నర్ సైట్లతోపాటు, పాటు తన ఎంఐ ఆన్లైన్ స్టోర్‌లో దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో రూ.1కే పలు షియోమీ ఫోన్లను పొందే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు షావోమి చెందిన ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్లను కూడా అందించనుంది. సేల్ జరగనున్నఈ మూడు రోజుల్లో రెండు స్లాట్లలో ఈ సేల్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు రూ.1 సేల్ కొనసాగుతుంది. ఇందులో రెడ్మీ నోట్ 4, ఎంఐ రూటర్ 3సీ, రెడ్మీ 4, ఎంఐ బ్లూటూత్ మినీ స్పీకర్, ఎంఐ సెల్ఫీ స్టిక్, రెడ్మీ 4ఎ, ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్, ఎంఐ క్యాప్సూల్ ఇయర్‌ఫోన్స్, ఎంఐ వైఫై రిపీటర్, ఎంఐ బ్యాక్‌ప్యాక్, ఎంఐ వీఆర్ ప్లేలను కేవలం రూ.1కే పొందేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు సేల్ జరిగే రోజుల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు యాప్‌లో బిడ్ టు విన్ సేల్ ను నిర్వహించనుంది. అలాగే ఈ సేల్ సందర్భంగా షియోమీ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ రాయితీలను అందివ్వనున్నారు. ఆయా ఉత్పత్తులపై కనీసం రూ.100 రాయితీ మొదలుకొని గరిష్టంగా రూ.2500 వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మరిన్ని వివరాలకు షావోమి అధికారిక వెబ్‌సైట్‌ను, ఎంఐ యాప్‌ను పరిశీలించాల్సిందే. -
షియోమి రెడ్మి2 వచ్చేసింది..
ధర రూ. 6,999 - 24 నుంచి తొలి రౌండ్ విక్రయాలు - ఎంఐ ప్యాడ్ ట్యాబ్ @ రూ. 12,999 న్యూఢిల్లీ: చైనా యాపిల్‌గా ప్రసిద్ధిగాంచిన షియోమి కంపెనీ రెడ్మి 2 స్మార్ట్‌ఫోన్‌ను.. ట్యాబ్లెట్ల విభాగంలో తొలిసారిగా ఎంఐపాడ్ ట్యాబ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ నెల 24న తొలి రౌండ్ విక్రయాలు నిర్వహిస్తామని షియోమి పేర్కొంది. వీటి కొనుగోళ్లకు గురువారం నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని వివరించింది. గత ఏడాది తెచ్చిన రెడ్మి 1ఎస్‌కు కొనసాగింపుగా రెడ్మి 2 స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని షియోమి వైస్ ప్రెసిడెంట్, హ్యుగో బర్రా చెప్పారు. ఈ ఫోన్ ధర రూ.6,999 అని పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ రెడ్మి 2 స్మార్ట్‌ఫోన్‌లో 4.7 అంగుళాల డిస్ప్లే, 1 జీబీ ర్యామ్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. 4జీ సర్వీసులు(అధిక వేగమున్న ఇంటర్నెట్)కు సంబంధించి టీడీడీ, ఎఫ్డీడీలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని పేర్కొన్నారు. ఇక యాపిల్ మినికు పోటీనిచ్చేలా ఎంఐప్యాడ్ ట్యాబ్‌ను రూ.12,999కు అందిస్తున్నామని వివరించారు. 7.9 అంగుళాల డిస్ప్లేలో ఉన్న ఈ ట్యాబ్‌లో ఎన్విడియా టెగ్రా కే1 చిప్సెట్, 2.2 గిగా హెర్ట్స్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6,700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపారు.