షియోమి రెడ్‌మి2 వచ్చేసింది.. | xiami redmi2 is in online | Sakshi
Sakshi News home page

షియోమి రెడ్‌మి2 వచ్చేసింది..

Published Fri, Mar 13 2015 7:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

షియోమి రెడ్‌మి2 వచ్చేసింది..

షియోమి రెడ్‌మి2 వచ్చేసింది..

ధర రూ. 6,999
- 24 నుంచి తొలి రౌండ్ విక్రయాలు
- ఎంఐ ప్యాడ్ ట్యాబ్ @ రూ. 12,999


న్యూఢిల్లీ: చైనా యాపిల్‌గా ప్రసిద్ధిగాంచిన షియోమి కంపెనీ రెడ్‌మి 2 స్మార్ట్‌ఫోన్‌ను.. ట్యాబ్లెట్ల విభాగంలో తొలిసారిగా ఎంఐపాడ్ ట్యాబ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ నెల 24న తొలి రౌండ్ విక్రయాలు నిర్వహిస్తామని షియోమి పేర్కొంది. వీటి కొనుగోళ్లకు గురువారం నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని వివరించింది.

గత ఏడాది తెచ్చిన రెడ్‌మి 1ఎస్‌కు కొనసాగింపుగా రెడ్‌మి 2 స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని షియోమి వైస్ ప్రెసిడెంట్, హ్యుగో బర్రా చెప్పారు. ఈ ఫోన్ ధర రూ.6,999 అని పేర్కొన్నారు.  ఈ డ్యుయల్ సిమ్ రెడ్‌మి 2 స్మార్ట్‌ఫోన్‌లో 4.7 అంగుళాల డిస్‌ప్లే, 1 జీబీ ర్యామ్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. 4జీ సర్వీసులు(అధిక వేగమున్న ఇంటర్నెట్)కు సంబంధించి టీడీడీ, ఎఫ్‌డీడీలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని పేర్కొన్నారు.

ఇక యాపిల్ మినికు పోటీనిచ్చేలా ఎంఐప్యాడ్ ట్యాబ్‌ను రూ.12,999కు అందిస్తున్నామని వివరించారు. 7.9 అంగుళాల డిస్‌ప్లేలో ఉన్న ఈ ట్యాబ్‌లో ఎన్‌విడియా టెగ్రా కే1 చిప్‌సెట్, 2.2 గిగా హెర్ట్స్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6,700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement