దీపావళి ఫ్లాష్‌ సేల్‌: రూ.1 కే స్మార్ట్‌ఫోన్‌ | Redmi Diwali sale: You can buy Xiaomi mobile phones for just Re 1; here is how | Sakshi
Sakshi News home page

దీపావళి ఫ్లాష్‌ సేల్‌: రూ.1 కే స్మార్ట్‌ఫోన్‌

Published Sat, Sep 23 2017 4:55 PM | Last Updated on Sun, Sep 24 2017 1:14 AM

Redmi Diwali sale: You can buy Xiaomi mobile phones for just Re 1; here is how

సాక్షి, ముంబై:  చైనాకు చెందిన మొబైల్ తయారీదారు షావోమి   అద్భుతమైన దీపావళి ఆఫర్‌ ప్రకటించింది.  దీపావళిసందర్భంగా నిర్వహిస్తున్న ఫ్లాష్‌ ​ సేల్‌లో రూ. 1కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఈ  స్పెషల్‌ సేల్‌ నిర్వహిస్తోంది. లిమిటెడ్‌  సంఖ్యలో  డివైస్‌లు అందుబాటులోఉన్నాయని, ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ ప్రకారం ఈ సేల్‌ నిర్వహించనున్నట్టు కంపెనీ  ప్రకటించింది.  

దీపావళి పండుగను పురస్కరించుకుని  షావోమి తన పార్ట్‌నర్ సైట్లతోపాటు, పాటు తన ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో  దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది.  ఇందులో రూ.1కే పలు షియోమీ ఫోన్లను పొందే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు షావోమి చెందిన ఇతర   ఉత్పత్తులపై  డిస్కౌంట్లను కూడా అందించనుంది.

సేల్ జరగనున్నఈ మూడు రోజుల్లో రెండు స్లాట్లలో ఈ సేల్‌  నిర్వహించనుంది. సెప్టెంబర్‌  27, 28, 29 తేదీల్లో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు రూ.1 సేల్ కొనసాగుతుంది. ఇందులో రెడ్‌మీ నోట్ 4, ఎంఐ రూటర్ 3సీ, రెడ్‌మీ 4, ఎంఐ బ్లూటూత్ మినీ స్పీకర్, ఎంఐ సెల్ఫీ స్టిక్, రెడ్‌మీ 4ఎ, ఎంఐ బ్యాండ్ హెచ్‌ఆర్‌ఎక్స్ ఎడిషన్, ఎంఐ క్యాప్సూల్ ఇయర్‌ఫోన్స్, ఎంఐ వైఫై రిపీటర్, ఎంఐ బ్యాక్‌ప్యాక్, ఎంఐ వీఆర్ ప్లేలను కేవలం రూ.1కే పొందేందుకు అవకాశం ఉంటుంది.  

దీంతోపాటు సేల్ జరిగే రోజుల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు యాప్‌లో బిడ్ టు విన్ సేల్ ను నిర్వహించనుంది.

అలాగే ఈ సేల్ సందర్భంగా షియోమీ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ రాయితీలను అందివ్వనున్నారు. ఆయా ఉత్పత్తులపై కనీసం రూ.100 రాయితీ మొదలుకొని గరిష్టంగా రూ.2500 వ‌ర‌కు డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది.  మరిన్ని వివరాలకు  షావోమి అధికారిక వెబ్‌సైట్‌ను, ఎంఐ యాప్‌ను పరిశీలించాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement