ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మాస్ అప్‌డేట్‌ వచ్చేసింది! | Sithara Entertainments Update On Mass Hero Ravi Teja Upcoming Movie | Sakshi
Sakshi News home page

Raviteja Movie: మనదే ఇదంతా అంటోన్న మాస్ మహారాజా.. ఆ టైటిల్ పెడతారా?

Published Tue, Oct 29 2024 4:40 PM | Last Updated on Tue, Oct 29 2024 4:49 PM

Sithara Entertainments Update On Mass Hero Ravi Teja Upcoming Movie

ఇటీవల మిస్టర్ బచ్చన్‌ సినిమాతో మెప్పించిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తోన్న మూవీకి సంబంధించిన లేటేస్ట్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌ ఇవ్వనున్నారు.

రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. బుధవారం సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పోస్ట్ చేసింది. ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మనదే ఇదంతా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

కాగా.. సామజవరగమన వంటి హిట్‌ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కోహినూర్‌ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement