వరల్డ్ వైడ్ స్మార్ ఫోన్ మార్కెట్‌లో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ సేల్స్ బీభత్సం సృష్టిస్తున్నాయి. గతేడాది ఎక్కువగా కొనుగోలు చేసిన టాప్-10 స్మార్ట్ ఫోన్‌లలో ఏడు స్థానాల్ని ఐఫోన్‌లే సొంతం చేసుకున్నాయి.
ప్రముఖ రీసెర్చ్ సంస్థ 'కౌంటర్ పాయింట్' తాజాగా గ్లోబల్ టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ -2021 పేరుతో ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం యాపిల్ బ్రాండ్‌కు చెందిన 7 ఐఫోన్‌లను, యాపిల్ తర్వాత శాంసంగ్ ఒక ఫోన్ , షావోమీ రెండు ఫోన్‌లను ఎక్కువగా కొనుగులు చేసినట్లు రిపోర్ట్‌లో హైలెట్ చేసింది.
ఇక 2021లో ఎక్కువగా అమ్ముడైన టాప్ ఫైవ్ ఐఫోన్‌లలో ఐఫోన్ 12 ప్రథమ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత 41శాతంతో ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13, ఐఫోన్ 12ప్రో, ఐఫోన్ 11 అమ్మకాలు జరిగాయి. క్యూ4లో ఐఫోన్ 12 కంటే అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌లలో ఐఫోన్ 12ప్రో మ్యాక్స్, ఐఫోన్13 ఫోన్‌లు ముందున్నాయి. ఐఫోన్ 12 ప్రో నాల్గవ స్థానంలో ఉండగా..2019లో విడుదలైన ఐఫోన్ 11తర్వాతి స్థానంలో ఉంది.శాంసంగ్, షోవోమీ మాత్రమే టాప్-10 జాబితాలో నిలవగా శాంసంగ్ గెలాక్సీ ఏ12 ఆరోస్థానంలో ఆ తర్వాత షోవోమీ రెడ్‌మీ 9ఏ ఏడవ స్థానంలో నిలిచింది.
యాపిల్‌కు చెందిన ఐఫోన్ ఎస్‌ఈ 2020-2021లో అత్యధికంగా అమ్ముడైన పరికరంలో ఎనిమిదో స్థానంలో ఉండగా, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 ఫోన్‌లు మొత్తం గ్లోబల్ అమ్మకాలలో 19శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2020 విలువలతో పోలిస్తే 3 శాతం పాయింట్లు పెరిగాయి.
చదవండి: యాపిల్ ఈవెంట్: టెక్ లవర్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త ప్రొడక్ట్‌లు!!
Comments
Please login to add a commentAdd a comment