ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రత్యర్ధి శాంసంగ్‌కు చెక్ పెట్టనుంది. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2022 ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మూడు స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు శాంసంగ్‌కు చెక్ పెట్టేలా యాపిల్ సంస్థ ఐఫోన్ 14ప్రో మోడల్స్‌ను 8 జీబీ ర్యామ్‌తో తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
యాపిల్ గతేడాది ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్‌లు 6జీబీ ర్యామ్‌తో విడుదల చేసింది. త్వరలో మార్కెట్‌లో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్‌ను 8 జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చేందుకు యాపిల్ సంస్థ సన్నాహాలు చేస్తుంది.
మాక్ రూమర్స్ రిపోర్ట్ ప్రకారం..యాపిల్ సంస్థ ఈ ఏడాది నాలుగు ఐఫోన్14 మోడళ్లు..ఐఫోన్14, ఐఫోన్14 మ్యాక్స్, ఐఫోన్14ప్రో, ఐఫోన్14 ప్రో మ్యాక్స్‌లను విడుదల చేయనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
మరో కొరియా టెక్ బ్లాగ్ 'yeux1122 పోస్ట్ ప్రకారం..హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అనలిస్ట్ జెఫ్ పు నుండి వచ్చిన నివేదిక ఆధారంగా ఐఫోన్ 14 ప్రో 6.1 అంగుళాలు, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్‌లు 6.7 అంగుళాలు ఉండగా 8జీబీ మెమరీతో అందుబాటులోకి రానున్నాయి. ఇక ఐఫోన్ 14 , ఐఫోన్ 14 మాక్స్ నాన్-ప్రో ఐఫోన్ 14 మోడల్‌లు 8జీబీ కంటే తక్కువ ర్యామ్‌ను కలిగి ఉంటాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment