![Parents To Stop Giving Smartphones To Children Urges Former Xiaomi India CEO - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/20/smart.jpg.webp?itok=xg-Ujmfc)
పిల్లలకు స్మార్ట్ ఫోన్‌లు ఇవ్వొద్దని పలువురు నిపుణులు, వైద్యులు చెప్పడం విన్నాం. కానీ సాక్షాత్తు ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ మాజీ సీఈవోనే తల్లిదండ్రులను పిల్లలకు పోన్‌లు ఇవ్వొద్దని కోరుతున్నారు. చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్‌లు ఇస్తే అది వారి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందువల్ల స్మార్ట్ ఫోన్‌ల విషయలో తల్లిదండ్రులను జాగ్రత్త వహించమని సూచిస్తున్నారు ప్రముఖ షియోమీ ఇండియా కంపెనీ మాజీ సీఈవో కుమార్ జైన్.
స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతాయో వివరించారు. ఈ మేరకు ఆయన దీనికి సంబంధించి.. యూఎస్‌కు చెందిన ప్రముఖ లాభప్రేక్షలేని సంస్థ సపియన్ ల్యాబ్ అధ్యయనం చేసిందని చెప్పారు. ఆ ల్యాబ్ నుంచి ఒక స్నేహితుడు అందుకు సంబంధించిన విషయాలను తనతో షేర్ చేసుకున్నట్లు లింక్డ్‌ఇన్‌లో వెల్లడించారు.
ఆ నివేదికలో.. చిన్నప్పుడే స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటు పడే చిన్నారులు పెద్దయ్యాక మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలిపారు. ఆ అధ్యయన ప్రకారం పదేళ్ల వయసులో స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటు పడితే పెద్దయ్యాకు మహళలైతే 60%-70% మంది దాక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని, అదే పురుషులైతే 45%-50% మంది దాక ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదిక వెల్లడించిందని కుమార్ జైన్ వెల్లడించారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది కావున దయచేసి వారిని వేరే యాక్టివిటీస్‌లో నిమగ్నమయ్యేలా చూడండని తల్లిదండ్రులకు విజ్ఞిప్తి చేశారు.
అది ఏదైనా అభ్యాసం లేదా వారి అభిరుచికి సంబంధించిన వాటిల్లో ప్రోత్సహిస్తే గనుక మనం వారికి ఆరోగ్యకరమైన సమతుల్య వాతావరణాన్ని అందించగలిగిన వారమవుతాం అని చెప్పారు. చిన్న వయసులోనే ఎక్కువ సమయం స్క్రీన్‌పై గడిపితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడి పలు దుష్ప్రరిణామాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
బాల్యం చాల విలువైనదని, ఆ సమయాన్ని వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అంశాల్లో కేంద్రీకరించేలా చేసి వారి భవిష్యత్తుకు మంచి పునాదిని ఏర్పరుచుకనేలా ప్రోత్సహించాల్సిన భాద్యత మనమిదే ఉందని చెప్పారు. అదేసమయంలో తాను స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లకి వ్యతిరేకిని కాదని, ఐతే చిన్న పిల్లలను మాత్రం స్మార్ట్ ఫోన్‌లకు సాధ్యమైనంత దూరంగా ఉంచేలా జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులని కోరుతున్నట్లు లింక్డ్‌ఇన్‌లో చెప్పుకొచ్చారు.
(చదవండి: ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..)
Comments
Please login to add a commentAdd a comment