త్వరలో సన్నీలియోన్‌ స్మార్ట్‌ఫోన్‌లు! | sunny leone to start her own line of mobile phones | Sakshi
Sakshi News home page

త్వరలో సన్నీలియోన్‌ స్మార్ట్‌ఫోన్‌లు!

Published Sun, Nov 26 2017 3:12 PM | Last Updated on Sun, Nov 26 2017 3:12 PM

sunny leone to start her own line of mobile phones - Sakshi

వరుస సినిమాలతో బిజీగా ఉన్న సన్నీలియోన్‌ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో పక్కా ప్రణాళికలతోనే ముందుకు సాగుతోంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలనే సూత్రాన్ని అక్షరాలా అమలు చేస్తోంది ఈ బాలీవుడ్‌ బ్యూటీ. దీనిలో భాగంగానే ఓవైపు సినిమాలు చేస్తున్న సన్నీ, మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే దుస్తులు, కాస్మోటిక్‌ వ్యాపారంలో అడుగుపెట్టిన సన్నీ రానున్న కాలంలో మరో బిజినెస్‌ రంగంలో అడుగుపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

వ్యాపార నైపుణ్యం ఉన్న సన్నీలియోన్‌ కొత్త బిజినెస్‌లోకి రానుందని సమాచారం. ఇప్పటికే పలు వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్న సన్నీ రానున్న కాలంలో తన పేరు మీద మొబైల్‌ కంపెనీ ప్రారంభించే పనిలో ఉన్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఇప్పటికే ఓ చైనా కంపెనీని సంప్రదించారట. యువతను ఆకర్శించే విధంగా పలు మోడల్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నీ ప్రయత్నాలు చేస్తోంది.

ఈ కంపెనీకలి భర్త డానియెల్‌ను మేనేజర్ గా నియమిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంబించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి కొంచెం సమయం పడుతుందని ఏడాదిలోపు ఈ ఫోన్‌ను మార్కెట్లో రిలీజ్ చేస్తానని అంటోంది ఈ హాట్ బ్యూటీ. ఇక సన్నీ ప్రస్తుతం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తేరా ఇంతజార్‌ సినిమాలో నటిస్తోంది. ఈచిత్రం డిసెంబర్‌ 1న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement