అసుస్ పాడ్‌ఫోన్ మినీ@రూ.15,999 | First look: Asus PadFone Mini smartphone-tablet hybrid at Rs 15,999 | Sakshi
Sakshi News home page

అసుస్ పాడ్‌ఫోన్ మినీ@రూ.15,999

Published Sat, Nov 29 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

అసుస్ పాడ్‌ఫోన్ మినీ@రూ.15,999

అసుస్ పాడ్‌ఫోన్ మినీ@రూ.15,999

హైదరాబాద్: ప్రముఖ మొబైల్ కంపెనీ అసుస్ పాడ్‌ఫోన్ మినీని మార్కెట్లోకి తెచ్చింది. 4 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్ ధర రూ. 15,999 అని అసుస్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 7 అంగుళాల ట్యాబ్‌గా కూడా దీనిని మార్చుకోవచ్చని అసుస్ ఇండియా కంట్రీ మేనేజర్ (సిస్టమ్ బిజినెస్ గ్రూప్) పీటర్ చంగ్ పేర్కొన్నారు. దీంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ సిరీస్‌లో  రెండు ల్యాప్‌టాప్‌లను, మరో ఆల్ట్రాపోర్టబుల్ ల్యాప్‌టాప్‌ను, ఒక ట్యాబ్‌ను కూడా అందిస్తున్నామని వివరించారు.

వినూత్నమైన ఫీచర్లతో ఈ ట్రాన్స్‌ఫార్మర్ ఫ్లిప్‌బుక్ (ల్యాప్‌టాప్‌లు-ధరలు రూ.47,999, 53,999), ట్రాన్స్‌ఫార్మర్ 200(ఆల్ట్రా పోర్టబుల్ ల్యాప్‌టాప్- ధర రూ.35,999), ట్రాన్స్‌ఫార్మర్ ప్యాడ్ టీఎఫ్103(ట్యాబ్-ధర రూ.19,999)లను అందిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా జెన్‌ఫోన్ సిరీస్ కోసం ‘లైవ్ ద జెన్ లైఫ్ విత్ రణ్‌విజయ్’ ప్రచారాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రముఖ టీవీ హోస్ట్, సినిమా నటుడు, ప్రెజంటర్ అయిన రణ్‌విజయ్‌తో ఈ వినూత్న కార్యక్రమాన్ని ఐదు వారాల పాటు నిర్వహిస్తామని వివరించారు. ఈ సందర్భంగా జెన్ ఫోన్ ఫీచర్లు బావుంటాయని రణ్‌విజయ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement