సాక్షి, న్యూఢిల్లీ: న్యూస్ ఆన్ ఎయిర్ సేవల వినియోగంలో హైదరాబాద్ మూడోస్థానం దక్కించుకుంది. ప్రసార భారతి సంస్థ అధికారిక యాప్ ‘న్యూస్ ఆన్ ఎయిర్’లో ఆల్ ఇండియా రేడియోకు సంబంధించిన 240 రేడియో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం90 దేశాల్లో శ్రోతలు ఉన్నారు. మే 15-31వ తేదీల మధ్య ఈ యాప్‌లోని సేవల ర్యాంకులను ప్రసార భారతి విడుదల చేసింది. న్యూస్ ఆన్ ఎయిర్ రేడియో సర్వీసుల్లో వివిధ భారతి మొదటి స్థానంలో నిలిచింది.
నగరాల వారీగా చూస్తే ‘న్యూస్ ఆన్ ఎయిర్’యాప్ సేవలు వినియోగించిన నగరాల్లో పుణె, బెంగళూరు, హైదరాబాద్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా పొందిన సేవల్లో వివిధ భారతి నేషనల్ మొదటి స్థానంలో, ఎఫ్.ఎం.రెయిన్ బో విజయవాడ రెండో స్థానం, ఆలిండియా రేడియో(ఏఐఆర్) తెలుగు 3వ స్థానంలో, ఏఐఆర్ హైదరాబాద్ వీబీఎస్ 4వ స్థానంలో, హైదరాబాద్ ఎఫ్‌ఎం రెయిన్ బో 5వ స్థానంలో నిలిచాయి. వీబీఎస్ విజయవాడ, ఏఐఆర్ హైదరాబాద్ ఏ, ఏఐఆర్ విశాఖ పీసీ, ఏఐఆర్ కర్నూలు సేవలు తదుపరి స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment