భారత్‌కు కాంస్యం | India bag silver, bronze at Antalya Archery World Cup | Sakshi
Sakshi News home page

భారత్‌కు కాంస్యం

Published Sun, Jun 15 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

భారత్‌కు కాంస్యం

భారత్‌కు కాంస్యం

అంటాల్యా (టర్కీ): ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పూర్వాషా షిండే, త్రిషా దేబ్, లిల్లీ చానులతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు టీమ్ విభాగంలో కాంస్యం నెగ్గింది.
 
 మూడో స్థానం పోరులో భారత్ 226-224 పాయింట్లతో బ్రెండా మెరినో, లిండా ఒచావో, కాట్యా సోఫియాలతో కూడిన మెక్సికో జట్టును ఓడించింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో రజత్ చౌహాన్ 141-145 పాయింట్లతో యోంగ్ చోయ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయి రజత పతకం సొంతం చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement