
అర్జున్, హారిక
షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ శుభారంభం చేశాడు. బుధవారం మొదలైన ఈ టోర్నీలో పోలాండ్ గ్రాండ్‌మాస్టర్ కాస్పెర్ పియోరన్‌తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 32 ఎత్తుల్లో గెలుపొందాడు.
భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్, తమిళనాడుకు చెందిన దొమ్మరాజు గుకేశ్ కూడా తొలి రౌండ్‌లో గెలిచాడు. వెస్కోవి (బ్రెజిల్)తో జరిగిన గేమ్‌లో గుకేశ్ 33 ఎత్తుల్లో విజయం సాధించాడు.
హారిక గేమ్ ‘డ్రా’
నికోసియా (సైప్రస్): మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి ‘డ్రా’ నమోదు చేసింది. జర్మనీ ప్లేయర్ దినారా వాగ్నర్‌తో బుధవారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను తెల్ల పావులతో ఆడిన హారిక 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment