ప్రౌడ్‌ ఆఫ్‌ యూ బావ : హారిక | Dronavalli Harika Congratulates Director Bobby | Sakshi
Sakshi News home page

ప్రౌడ్‌ ఆఫ్‌ యూ బావ : హారిక

Jan 3 2020 2:12 PM | Updated on Jan 3 2020 2:29 PM

Dronavalli Harika Congratulates Director Bobby - Sakshi

దర్శకుడు కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ‘వెంకీ మామ’ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్‌, నాగచైనత్య హీరోలుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం 2019 డిసెంబర్‌లో విడుదలైన తెలుగు సినిమాలన్నింటిల్లో కెల్లా అత్యధిక గ్రాస్‌ కలెక్ట్‌ చేసిందని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ విడుదల చేసింది.

దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక.. సో ప్రౌడ్‌ ఆఫ్‌ యూ బావ అని బాబీకి ట్వీట్‌ చేశారు. హారిక ట్వీట్‌కు బాబీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, హారిక సోదరిని బాబీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి ఓ పాప కూడా ఉంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న హారిక.. గతేడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement