మాస్కో: ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ఈ సంవత్సరంలో చివరి టోర్నమెంట్‌కు సిద్ధమయ్యారు. మాస్కోలో నేడు మొదలయ్యే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో హంపి, హారిక టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. ర్యాపిడ్ విభాగంలో మొత్తం 121 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 12 రౌండ్లపాటు టోర్నీ జరుగుతుంది. గురు, శుక్ర, శనివారాల్లో నాలుగు రౌండ్‌ల చొప్పున గేమ్‌లు జరుగుతాయి. ఈనెల 29, 30వ తేదీల్లో బ్లిట్జ్ విభాగం గేమ్‌లను నిర్వహిస్తారు. బ్లిట్జ్ కేటగిరీలో 17 రౌండ్‌లు ఉంటాయి. ఇక ఓపెన్ విభాగంలో భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్, సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, శ్రీనాథ్ నారాయణన్, అరవింద్ చిదంబరం, విష్ణుప్రసన్న, హర్ష భరతకోటి, రౌనక్ సాధ్వాని, నిహాల్ సరీన్, డి.గుకేశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment