సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఫ్రాన్స్ జట్టుతో బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–1తో గెలిచి ఏడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మేరీ సెబాగ్‌తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 45 ఎత్తుల్లో... నవ్రోతెసు్కతో జరిగిన గేమ్‌ను తానియా సచ్‌దేవ్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. భక్తి కులకర్ణి 51 ఎత్తుల్లో నటాషాపై, మేరీఆన్ గోమ్స్ 51 ఎత్తుల్లో సిలి్వయాపై నెగ్గడంతో భారత విజయం ఖాయమైంది. భారత్‌తోపాటు గ్రూప్ ‘ఎ’ నుంచి రష్యా, అర్మేనియా, అజర్‌బైజాన్ కూడా క్వార్టర్ ఫైనల్ చేరాయి. గ్రూప్ ‘బి’ నుంచి ఉక్రెయిన్, జార్జియా, కజకిస్తాన్, అమెరికా క్వార్టర్ ఫైనల్ చేరాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో కజకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది.
చదవండి: కోనేరు హంపికి కోవాగ్జిన్ ఆంక్షలు
Comments
Please login to add a commentAdd a comment