World Womens Team Chess Championship
-
హారిక అద్భుత విజయం.. సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: స్పెయిన్ దేశంలో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఎఫ్ఐడీఈ) ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీల్లో రజత పతకం సాధించిన ద్రోణవల్లి హారిక నేతృత్వంలోని భారత జట్టును సీఎం వైఎస్ జగన్ అభినందించారు. టీమ్ ఈవెంట్లో హారిక అద్భుత విజయం సాధించిందని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో హారికతో పాటు ఇండియన్ టీమ్ మరిన్ని పురస్కారాలు సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
World Women Chess Championship: క్వార్టర్ ఫైనల్లో భారత్
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఫ్రాన్స్ జట్టుతో బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–1తో గెలిచి ఏడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మేరీ సెబాగ్‌తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 45 ఎత్తుల్లో... నవ్రోతెసు్కతో జరిగిన గేమ్‌ను తానియా సచ్దేవ్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. భక్తి కులకర్ణి 51 ఎత్తుల్లో నటాషాపై, మేరీఆన్ గోమ్స్ 51 ఎత్తుల్లో సిలి్వయాపై నెగ్గడంతో భారత విజయం ఖాయమైంది. భారత్‌తోపాటు గ్రూప్ ‘ఎ’ నుంచి రష్యా, అర్మేనియా, అజర్బైజాన్ కూడా క్వార్టర్ ఫైనల్ చేరాయి. గ్రూప్ ‘బి’ నుంచి ఉక్రెయిన్, జార్జియా, కజకిస్తాన్, అమెరికా క్వార్టర్ ఫైనల్ చేరాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో కజకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. చదవండి: కోనేరు హంపికి కోవాగ్జిన్ ఆంక్షలు -
భారత్‌కు మూడో విజయం
చెంగ్డూ (చైనా): పతకం నెగ్గే అవకాశాలు చేజారినా... ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన ఎనిమిదో రౌండ్ మ్యాచ్‌లో టీమిండియా 3.5-0.5 పాయింట్ల తేడాతో పోలండ్పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 46 ఎత్తుల్లో మోనికా సోకోపై నెగ్గగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 35 ఎత్తుల్లో జొలాంతా జవాద్జకాతో ‘డ్రా’ చేసుకుంది. మేరీ ఆన్ గోమ్స్ 44 ఎత్తుల్లో మార్తా బార్తెల్పై, సౌమ్య స్వామినాథన్ 41 ఎత్తుల్లో కరీనా హౌరోస్కాపై గెలిచారు. మంగళవారం జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్లో ఆర్మేనియాతో భారత్ ఆడుతుంది. మరోవైపు ఆర్మేనియాలో జరుగుతున్న పురుషుల ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 1.5-2.5 పాయింట్ల తేడాతో ఆర్మేనియా చేతిలో ఓడిపోయింది. హరికృష్ణ, శశికిరణ్, సేతురామన్ గేమ్‌లు ‘డ్రా’ కాగా, విదిత్ ఓడిపోయాడు.