
సాక్షి, అమరావతి: స్పెయిన్ దేశంలో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఎఫ్‌ఐడీఈ) ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోటీల్లో రజత పతకం సాధించిన ద్రోణవల్లి హారిక నేతృత్వంలోని భారత జట్టును సీఎం వైఎస్ జగన్ అభినందించారు. టీమ్ ఈవెంట్‌లో హారిక అద్భుత విజయం సాధించిందని ప్రశంసించారు.
రాబోయే రోజుల్లో హారికతో పాటు ఇండియన్ టీమ్ మరిన్ని పురస్కారాలు సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.