సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అర్మేనియాతో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 2.5–1.5తో గెలిచిన భారత జట్టు... రష్యాతో జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 1–3తో పరాజయం పాలైంది. అర్మేనియాతో మ్యాచ్‌లో హారిక తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకోగా... వైశాలి ఓడిపోయింది.
తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణి తమ ప్రత్యర్థులపై నెగ్గి భారత్‌కు విజయాన్ని అందించారు. రష్యాతో మ్యాచ్‌లో హారిక, మేరీఆన్ గోమ్స్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... తానియా, వైశాలి ఓడిపోయారు. నేడు ఐదో రౌండ్‌లో ఫ్రాన్స్‌తో భారత్ ఆడుతుంది. కాగా అజర్‌బైజాన్‌తో జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో లీగ్ మ్యాచ్‌లో 2.5–1.5తో స్పెయిన్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్ కార్తిక్
The battles of the FIDE Women's World Team Championship are finished for today. Results of Round 4 of the group stage:
— International Chess Federation (@FIDE_chess) September 28, 2021
Pool A
Spain ½:3½ Armenia
CFR Team 3:1 India
France 3½:½ Azerbaijan
Pool B
Poland 2:2 Georgia
FIDE Americas 2:2 Germany
Ukraine 2½:1½ Kazakhstan pic.twitter.com/pdcmsOr5mP
Comments
Please login to add a commentAdd a comment