హారికకు 3 పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఆసియా నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడు పతకాలను సాధించింది. అబుదాబిలో ఇటీవల ముగిసిన ఈ టోర్నమెంట్‌లో మహిళల స్టాండర్డ్ వ్యక్తిగత విభాగంలో బోర్డు-1పై ఆడిన హారిక రజత పతకాన్ని దక్కించుకుంది. ర్యాపిడ్ విభాగంలో బోర్డు-2పై ఆడిన హారిక స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ర్యాపిడ్ టీమ్ విభాగంలో హారిక సభ్యురాలిగా ఉన్న భారత జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది.