
హారిక గెలుపు
జియాజింగ్ (చైనా): చైనీస్ ఎ డివిజన్ చెస్ లీగ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో షాన్‌డంగ్ జట్టుకు చెందిన హారిక... తైన్ జింగ్ జట్టుకు చెందిన ని షికన్‌పై గెలుపొందింది. తొలి రౌండ్‌లో క్వి జువో (జింగ్సు జట్టు)తో జరిగిన గేమ్‌ను హారిక డ్రా చేసుకుంది.
మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ (షాంఘై జట్టు)... జెన్ చాంగ్ షెంగ్(గ్వాంగ్ డంగ్ జట్టు)పై విజయం సాధించాడు. మొత్తం 12 జట్లు తలపడే ఈ లీగ్‌లో చైనా అగ్రశ్రేణి క్రీడాకారులతో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు పాల్గొంటారు.