
అంటాల్యా (టర్కీ): భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సభ్యురాలిగా ఉన్న బతూమి చెస్ క్లబ్ నోనా జట్టు ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 12 క్లబ్ జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో హారిక బృందం 17.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది.
హారిక జట్టులో నానా జాగ్‌నిద్జె, నినో బతియాష్‌విలి, బేలా ఖొటెనాష్‌విలి, మెలియా సలోమి (జార్జియా) మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ టోర్నీలో హారిక తాను ఆడిన ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment