ముంబై: టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)లో హైదరాబాద్ స్ట్రయికర్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. యశ్ ముంబై ఈగల్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ స్ట్రయికర్స్ 51–44 పాయింట్లతో గెలిచి మూడోసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హరీట్ డార్ట్, బెంజమిన్ లాక్, ఒలింపియన్ విష్ణువర్ధన్‌లతో కూడిన హైదరాబాద్ స్ట్రయికర్స్ జట్టుకు గ్రాస్‌కోర్టు జాతీయ మాజీ చాంపియన్ సురేశ్ కృష్ణ కోచ్‌గా వ్యవహరించాడు.
తొలి మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో హరీట్ డార్ట్ 14–11తో జెనెప్ సోన్‌మెజ్‌పై గెలిచి హైదరాబాద్‌కు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో కరణ్ సింగ్ (ముంబై) 14–11తో బెంజమిన్ లాక్‌పై గెలిచాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో విష్ణువర్ధన్–హరీట్ డార్ట్ ద్వయం 16–9తో జెనెప్ సోన్‌మెజ్–జీవన్ నెడుంజెళియన్ జోడీని ఓడించింది. జీవన్ నెడుంజెళియన్–కరణ్ (ముంబై)... విష్ణువర్ధన్–బెంజమిన్ లాక్ (హైదరాబాద్) జోడీల మధ్య నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్ పోరు 10–10తో ‘టై’గా ముగియడంతో హైదరాబాద్ స్ట్రయికర్స్ జట్టుకు టైటిల్ ఖరారైంది.
Comments
Please login to add a commentAdd a comment