Hampi
-
బీబీసారా చేతిలో హంపి ఓటమి
షిమ్కెంట్ (కజకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి కోనేరు హంపికి తొలి పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపి 34 ఎత్తుల్లో కజకిస్తాన్‌కు చెందిన అసబయేవా బీబీసారా చేతిలో ఓడిపోయింది. పది మంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. భారత్‌కే చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్తో జరిగిన తొలి గేమ్ ను 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... టాన్ జోంగి (చైనా)తో జరిగిన రెండో గేమ్‌ను 70 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన మూడో గేమ్‌లో హంపి 45 ఎత్తుల్లో గెలిచింది. సలీమోవా (బల్గేరియా)తో జరిగిన నాలుగో గేమ్‌లో హంపి 64 ఎత్తుల్లో నెగ్గింది. ఐదో రౌండ్ తర్వాత హంపి 3 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా 3వ స్థానంలో ఉంది. దివ్య గెలుపు బోణీ భారత రైజింగ్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్ ఐదో రౌండ్లో గెలుపు బోణీ కొట్టింది. మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో దివ్య 45 ఎత్తుల్లో నెగ్గింది. హంపితో తొలి రౌండ్ గేమ్‌ను ‘డ్రా’గా ముగించిన దివ్య... కాటరీనా లాగ్నోతో జరిగిన రెండో గేమ్‌ను కూడా ‘డ్రా’ చేసుకుంది. అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా)తో జరిగిన మూడో గేమ్‌లో దివ్య 40 ఎత్తుల్లో ఓడిపోయింది. టాన్ జోంగి (చైనా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను దివ్య 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
హంపి : నాటి వైభవానికి నిలువుటద్దం, ఇవి అస్సలు మిస్ కావద్దు!
రాజులు రాజ్యస్థాపనలో రాజధాని నిర్మాణం ప్రధానమైంది. అయితే రాజులందరూ రాజధాని కోసం కొండలు, గుట్టల బాట పడుతారెందుకో. హంపిని చూసినప్పుడు ఇదే అనిపిస్తుంది. బీడు భూమి సారవంతమైన పంట నేలగా మారాలంటే ఏళ్లు పడుతుంది. అందుకే పంట పొలాలను రాజధానిగా మార్చే ప్రయత్నం చేసేవారు కాదు. గట్టి నేల మీద నిర్మాణాలు చేపట్టి శత్రుదుర్భేద్యంగా మలుచుకుంటారు. హంపి కూడా అలాంటిదే.హంపిలోని నిర్మాణాలు 14వ శతాబ్దం నాటివి. ప్రతి కట్టడమూ విధ్వంసానికి గురై ఉండడంతో హంపిని లాస్ట్ సిటీ అంటారు కానీ పర్యాటకుల సంఖ్యను చూస్తే దాని కల్చరల్ గ్లోరీని ఏ మాత్రం లాస్ కాలేదనిపిస్తుంది. పర్వత శ్రేణుల్లో 500కు పైగా మాన్యుమెంట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. ఏడాదికి ఏడు లక్షల మంది వస్తారు. ఇంతటి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది కాబట్టే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల జాబితాలో చేరిపోయింది.కన్నడ గ్రామంలో బస హంపి టూర్లో మిస్ కాకూడనివి... తుంగభద్రానదిలో పడవ ప్రయాణం, పంట పొలాల్లో రాత్రి బస, మోటార్‌బైక్ మీద అచ్చమైన కన్నడ గ్రామాల్లో విహారం, క్లిఫ్ జంపింగ్, విరూపాక్ష ఆలయం, లోటస్ మహల్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియం. రామాయణకాలంలో కిష్కింద అంటే ఈ ప్రదేశమేనని అశోకుని శిలాశాసనంలో ఉంది. పంపాదేవి తీర్థక్షేత్రంగా దీని ప్రస్తావన ఉంది. ఈ ప్రదేశం బెంగళూరు వాళ్లకు ఎంత దూరం (348 కి.మీ.లు)లో ఉందో హైదరాబాద్ వాళ్లకీ దాదాపు అంతే దూరం(385 కిమీలు)లో ఉంది. హంపి పర్యాటకులకు హోటళ్లు హోస్పేటలో ఉంటాయి. కన్నడ సంప్రదాయ భోజనం, నివాసాలను ఆస్వాదించాలంటే హంపికి ఉత్తరాన కదిరామ్పురా గ్రామంలో హోమ్స్టేలుంటాయి. హంపిని ఇప్పటికే చూసి ఉంటే... విజయదశమి ఉత్సవాలు పూర్తి చేసుకుని పండగ శోభను కొనసాగిస్తూ ఉండే హంపిని మరోసారి చూసిరావచ్చు. ఎంజాయ్మెంట్కి మినిమమ్ గ్యారంటీ. -
‘మహిళల టోర్నీల సంఖ్య పెంచాలి’
న్యూఢిల్లీ: మహిళల చెస్‌కు మన దేశంలో మరింత ప్రోత్సాహం అందించాలని, లేదంటే రాబోయే రోజుల్లో మంచి ప్లేయర్లు రావడం తగ్గిపోతుందని భారత అగ్రశ్రేణి చెస్ క్రీడాకారిణి, వరల్డ్ ర్యాపిడ్ మాజీ చాంపియన్ కోనేరు హంపి అభిప్రాయ పడింది. ఇందులో భాగంగా ఎక్కువ సంఖ్యలో టోర్నీలు నిర్వహించాలని ఆమె సూచించింది. ఇటీవలి కాలంలో గుకేశ్, ప్రజ్ఞానంద తదితరుల ఆటతో పురుషుల విభాగంలో చెస్‌కు ప్రాచుర్యం బాగా పెరిగింది. అయితే మహిళల విభాగంలో మాత్రం పరిస్థితి అలా లేదు. ఇప్పటికి 37 ఏళ్ల హంపి, 33 ఏళ్ల ద్రోణవల్లి హారికలే ప్రపంచ వేదికపై మన చెస్‌ను నడిపిస్తున్నారు. ‘మహిళా చెస్ ప్లేయర్ల శాతం చాలా తక్కువగా ఉంది. మనం మరిన్ని మహిళా టోర్నీలు నిర్వహించాలని నా అభిప్రాయం. ప్రతిభావంతులను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చెస్ భవిష్యత్తు కోసం ఇది ఎంతో ముఖ్యం. లేదంటే ఇద్దరు, ముగ్గురికి మించి టాప్ ప్లేయర్లు ఉండరు. రాబోయే తరంపై దృష్టి పెట్టకపోతే చెస్ ఆటగాళ్లు వెలుగులోకి రావడం కష్టంగా మారి అంతరం చాలా పెరిగిపోతుంది. వచ్చే 10–15 ఏళ్లలో కూడా మీకు మంచి ఆటగాళ్లు కనిపించరు’ అని హంపి ఆందోళన వ్యక్తం చేసింది. చైనాను చూసి నేర్చుకోవాలి భవిష్యత్ ఆటగాళ్లను ఎలా తయారు చేసుకోవాలనే విషయంలో చైనాను చూసి భారత్ ఎంతో నేర్చుకోవాలని హంపి వ్యాఖ్యానించింది. సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత చైనా చెస్‌లో పవర్‌హౌస్‌గా ఎదిగిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ‘ఈ విషయంలోనే భారత్, చైనాకు మధ్య చాలా తేడా ఉంది. చైనాలో ఒకరి తర్వాత మరొకరు కొత్త ప్లేయర్ వెంటవెంటనే వచ్చేస్తుంటారు. ఒక అగ్రశ్రేణి ప్లేయర్ కెరీర్ ముగుస్తున్న దశలో కొత్త తరం ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు. మన దేశంలో మహిళల చెస్‌పై ఫెడరేషన్ మరింత దృష్టి పెట్టాలి’ అని హంపి పేర్కొంది. కోవిడ్ సమయంలో ఇతర క్రీడా పోటీలన్నీ దాదాపుగా రద్దు కాగా... ఆన్లైన్ టోర్నీల కారణంగా చెస్ మాత్రమే బాగా ప్రజాదరణ పొందిందని హంపి చెప్పింది. ‘కోవిడ్ సమయాన్ని సానుకూలంగా వాడుకున్న క్రీడ చెస్ మాత్రమే. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ఆన్లైన్ టోర్నీలు జరిగాయి. ఇతర పనులేవీ లేకపోవడంతో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ఆ సమయంలో మన దేశంలో చెస్ దూసుకుపోయింది కెప్టెన్. ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి లాంటివారు కూడా కోవిడ్ సమయంలో పెద్ద సంఖ్యలో టోర్నీలు ఆడారు. తర్వాతి రోజుల్లో ఇదే జోరును కొనసాగించి వారి రేటింగ్‌ను మెరుగుపర్చుకున్నారు’ అని హంపి విశ్లేíÙంచింది. సరైన ప్రాక్టీస్ లేకనే... తన కూతురి వయసు పెరుగుతుండటంతో చెస్‌కు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని హంపి వెల్లడించింది. ‘పాపకు ఇప్పుడు ఏడేళ్లు. ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడైతే ఇంట్లో అమ్మ దగ్గర వదిలి టోర్నీలకు వెళ్లిపోయేదాన్ని. ఇప్పుడు అలా సాధ్యం కావడం లేదు. స్కూల్ హోమ్‌వర్క్, ఆటలు... ఎక్కడైనా నేను తనతో ఉండాలని ఆమె కోరుకుంటోంది. దాంతో ప్రాక్టీస్‌కు సమయం లభించక టోర్నీలకు దూరమవుతున్నా. అయితే అమ్మగా మారిన తర్వాత నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు చిన్నపాటి అంతరాయం వచ్చినా నా ఏకాగ్రత చెదిరిపోయేది. ఇప్పుడు అలా కాదు. గతంలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతోనే ఆడేదాన్ని. ఇప్పుడు స్థితప్రజ్ఞత వచ్చింది’ అని ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వివరించింది. ప్రస్తుతం బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఒలింపియాడ్‌కు దూరంగా ఉన్న హంపి త్వరలో జరిగే గ్లోబల్ చెస్ లీగ్‌లో ముంబా మాస్టర్స్ తరఫున బరిలోకి దిగనుంది. ఆ తర్వాత కజకిస్తాన్‌లో జరిగే మహిళల గ్రాండ్‌ప్రి, టాటా స్టీల్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో ఆడుతుంది. -
వైశాలి విజయం... హంపి పరాజయం
స్టావెంజర్: నార్వే చెస్ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి తన జోరు కొనసాగిస్తోంది. నాలుగో రౌండ్ గేమ్‌లో వైశాలి 54 ఎత్తుల్లో పియా క్రామ్లింగ్ (స్వీడన్)పై గెలిచింది. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత వైశాలి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత నంబర్‌వన్ కోనేరు హంపి 55 ఎత్తుల్లో అనా ముజిచుక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు, భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద నాలుగో రౌండ్లో 65 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. -
వైశాలి చేతిలో హంపి ఓటమి
స్టావెంజర్: నార్వే చెస్ మహిళల టోర్నీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత స్టార్ కోనేరు హంపి తొలి ఓటమిని చవిచూసింది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ వైశాలితో జరిగిన రెండో రౌండ్ క్లాసికల్ గేమ్‌లో హంపి 44 ఎత్తుల్లో ఓడిపోయింది. క్లాసికల్ గేమ్‌లో నెగ్గినందుకు వైశాలికి మూడు పాయింట్లు లభించాయి. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత వైశాలి నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు ప్రజ్ఞానందకు రెండో రౌండ్ అర్మగెడాన్ గేమ్‌లో ఓటమి ఎదురైంది. ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగిన రెండో రౌండ్ క్లాసికల్ గేమ్‌ను ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఇద్దరి మధ్య విజేతను నిర్ణయించడానికి అర్మగెడాన్ గేమ్ నిర్వహించగా తెల్ల పావులతో ఆడిన డింగ్ లిరెన్ 51 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించాడు. -
హంపి శుభారంభం
స్టావెంజర్ (నార్వే): భారత చెస్ స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి నార్వే చెస్ మహిళల ఓపెన్ టోర్నీలో శుభారంభం చేసింది. పియా క్రామ్లింగ్ (స్వీడన్)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపి అర్మగెడాన్ గేమ్‌లో గెలిచింది. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ముందుగా క్లాసికల్ ఫార్మాట్లో గేమ్ జరుగుతుంది. ఒకవేళ గేమ్ ‘డ్రా’ అయితే ఫలితం తేలడానికి అర్మగెడాన్ గేమ్‌ను నిర్వహిస్తారు. అర్మగెడాన్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడే వారికి 10 నిమిషాలు, నల్ల పావులతో ఆడే వారికి 7 నిమిషాలు కేటాయిస్తారు. అర్మగెడాన్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడే ప్లేయర్ నెగ్గని పక్షంలో... నల్ల పావులతో ఆడిన ప్లేయర్ గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంటే దానిని విజయంగా పరిగణిస్తారు. హంపి, పియా క్రామ్లింగ్ క్లాసికల్ గేమ్ 37 ఎత్తుల్లో ‘డ్రా’కాగా... ఫలితం తేలడానికి అర్మగెడాన్ గేమ్ నిర్వహించారు. ఇందులో నల్లపావులతో ఆడిన హంపి 51 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో ఆమెను విజేతగా ప్రకటించారు. భారత్‌కే చెందిన వైశాలి తొలి రౌండ్ క్లాసికల్ గేమ్‌లో 43 ఎత్తుల్లో వెన్జున్ జు (చైనా) చేతిలో ఓడిపోయింది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అర్మగెడాన్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడుతూ 38 ఎత్తుల్లో ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలిచాడు. వీరిద్దరి మధ్య క్లాసికల్ గేమ్ 44 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. -
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
2024–25 ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో పాల్గొనే 14 మంది గ్రాండ్మాస్టర్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తమిళనాడు క్రీడాకారిణి ఆర్.వైశాలి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో మొత్తం 20 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.‘ఫిడే’ నిర్దేశించిన అర్హత (ర్యాంకింగ్) ప్రకారం 14 మందికి నేరుగా చోటు దక్కగా... మిగతా ఆరుగురిని నిర్వాహకులు నామినేట్ చేస్తారు. ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లు (క్లాసికల్) టాన్ జోంగ్యి, అలెగ్జాండ్రా కోస్టెనిక్, మారియా ముజీచుక్ కూడా టోర్నీ బరిలో నిలిచారు. ప్రస్తుత చాంపియన్ జు వెన్జున్ ఈ ఈవెంట్‌నుంచి తప్పుకుంది. మహిళల చెస్‌ను మరింత ఆదరణ పెంచే క్రమంలో పలు మార్పులతో గ్రాండ్‌ప్రి సిరీస్‌ను ఈ సారి కొత్తగా నిర్వహించనున్నట్లు ‘ఫిడే’ సీఈఓ ఎమిల్ సుటోవ్స్కీ వెల్లడించారు. ఇటీవల జరిగిన క్యాండిడేట్స్ టోర్నీలో హంపి రెండో స్థానంలో నిలిచింది. -
సంయుక్తంగా అగ్రస్థానంలో గుకేశ్
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల గుకేశ్ 12వ రౌండ్ తర్వాత 7.5 పాయింట్లతో నకముర (అమెరికా), నిపోమ్‌నిషి (రష్యా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. 12వ రౌండ్లో గుకేశ్ 57 ఎత్తుల్లో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)ను ఓడించాడు. ఈ టోర్నీలో గుకేశ్‌కిది నాలుగో విజయం. భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద, విదిత్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నిపోమ్‌నిíÙతో జరిగిన గేమ్‌ను తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 55 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ 52 ఎత్తుల్లో కరువానా (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. నిర్ణీత 14 రౌండ్లు ముగిశాక అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్ ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌తో ప్రపంచ టైటిల్ కోసం పోటీపడతాడు. మరోవైపు మహిళల విభాగంలో భారత స్టార్ కోనేరు హంపి ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’ చేరింది. గొర్యాచ్కినా (రష్యా)తో జరిగిన 12వ రౌండ్ గేమ్‌ను హంపి 25 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ అనా ముజిచుక్‌తో జరిగిన గేమ్‌ను భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ వైశాలి 57 ఎత్తుల్లో నెగ్గింది. హంపి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో, వైశాలి 5.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. -
హంపి, వైశాలి విజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో పోటీపడుతున్న భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి 11వ రౌండ్లో విజయం సాధించారు. సలీమోవా నుర్గుయెల్ (బల్గేరియా)తో జరిగిన గేమ్‌లో హంపి 90 ఎత్తుల్లో... అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా)తో జరిగిన గేమ్‌లో వైశాలి 70 ఎత్తుల్లో గెలిచారు. ఈ టోర్నీలోకి హంపికిది రెండో విజయంకాగా, వైశాలి ఖాతాలో మూడో గెలుపు చేరింది. 11వ రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, వైశాలి 4.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఓపెన్ విభాగంలో 11వ రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్‌లకు ఓటమి ఎదురుకాగా, దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రజ్ఞానంద 54 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా) చేతిలో, విదిత్ 67 ఎత్తుల్లో నిపోమ్‌నిషి (రష్యా) చేతిలో పరాజయం పాలయ్యారు. గుకేశ్, కరువానా (అమెరికా) గేమ్ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. 11వ రౌండ్ తర్వాత గుకేశ్ 6.5 పాయింట్లతో రెండో స్థానంలో, ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో 5వ స్థానంలో, విదిత్ 5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. -
అగ్ర స్థానంలోనే గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టొరంటో: ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు డి.గుకేశ్ పది రౌండ్ల తర్వాత కూడా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గుకేశ్, నెపొమినియాచి (రష్యా) మధ్య జరిగిన పదో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. ఈ గేమ్ అనంతరం వీరిద్దరు కూడా చెరో 6 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. ఇతర గేమ్‌లలో ఫిరూజా అలీరెజా (ఫ్రాన్స్)పై ఫాబియానో కరునా (అమెరికా)... నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)పై హికారు నకమురా (అమెరికా) విజయం సాధించారు. ఇద్దరు భారత ఆటగాళ్లు విదిత్ గుజరాతీ, ప్రజ్ఞానంద మధ్య జరిగిన గేమ్ ‘డ్రా’ అయింది. ప్రజ్ఞానంద, నకమురా (5.5 పాయింట్లు) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కోనేరు హంపికి మరో ‘డ్రా’ ఎదురైంది. పదో గేమ్‌లో హంపి, జ్యోంగి తాన్ (చైనా) సమ ఉజ్జీలుగా నిలిచారు. అయితే మరో భారత ప్లేయర్ ఆర్.వైశాలి...సలిమోవా (బల్గేరియా)పై గెలుపొందింది. చైనాకు చెందిన లీ టింగ్జీ, జ్యోంగి తాన్ ప్రస్తుతం 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
గుకేశ్‌కు రెండో విజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఐదో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్స్ అజేయంగా నిలిచారు. ఓపెన్ విభాగంలో తమిళనాడు కుర్రాడు దొమ్మరాజు గుకేశ్ ఈ టోరీ్నలో రెండో విజయాన్ని నమోదు చేయగా... ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతి తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరగా... తమిళనాడు అమ్మాయి వైశాలి కూడా తన గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. గుకేశ్ 87 ఎత్తుల్లో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)ను ఓడించగా... విదిత్–కరువానా (అమెరికా) గేమ్ 30 ఎత్తుల్లో... ప్రజ్ఞానంద–నెపోమ్నిషి (రష్యా) గేమ్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. హంపి–గొర్యాచ్కినా (రష్యా) గేమ్ 44 ఎత్తుల్లో... వైశాలి–అనా ముజిచుక్ (ఉక్రెయిన్) గేమ్ 49 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఐదో రౌండ్ తర్వాత ఓపెన్ విభాగంలో గుకేశ్ 3.5 పాయింట్లతో నిపోమ్‌నిషితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. 2.5 పాయింట్లతో ప్రజ్ఞానంద నాలుగో ర్యాంక్‌లో, 2 పాయింట్లతో విదిత్ ఆరో ర్యాంక్‌లో ఉన్నారు. -
విదిత్ గుజరాతీ సంచలన విజయం
టొరంటో: ప్రతిష్టాత్మక ‘ఫిడే’ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో రెండో రౌండ్లో నాలుగు గేమ్‌లలో కూడా ఫలితం వచ్చింది. భారత గ్రాండ్‌మాస్టర్ విది త్ గుజరాతీ...అమెరికాకు చెందిన వరల్డ్ నంబర్ 3 హికారు నకమురాపై 29 ఎత్తుల్లో సంచలన విజయం సాధించడం విశేషం. వరుసగా 47 గేమ్‌లలో ఓటమి లేకుండా కొనసాగిన నకమురా విజయయాత్రకు విదిత్ బ్రేక్ వేశాడు. భారత ఆటగాళ్ల మధ్య జరిగిన పోరులో డి.గుకేశ్ 33 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించాడు. ఇతర రెండో రౌండ్ గేమ్‌లలో ఇయాన్ నెపొనియాచి (రష్యా ) 45 ఎత్తుల్లో అలీ రెజా ఫిరోజా (ఫ్రాన్స్)పై విజయం సాధించగా...మరో గేమ్‌లో ఫాబియానో కరూనా (అమెరికా) 37 ఎత్తుల్లో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)పై గెలుపొందాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కోనేరు హంపి తన రెండో రౌండ్ గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. కటారినా లాగ్నో (ఉక్రెయిన్)తో ఈ గేమ్ 38 ఎత్తుల తర్వాత ముగిసింది. మరో గేమ్‌లో మ్యాచ్‌లలో చైనాకు చెందిన టాన్ జోంగీ చేతిలో భారత ప్లేయర్ వైశాలి ఓటమిపాలైంది. -
హంపి తొలి గేమ్ ‘డ్రా
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో ఐదుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి, ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్ తమ తొలి రౌండ్ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మహిళల విభాగంలో తమిళనాడు అమ్మాయి వైశాలితో జరిగిన తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ స్టార్ హంపి 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్ విభాగంలో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లో... విదిత్‌తో జరిగిన గేమ్‌ను గుకేశ్ 21 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఓపెన్ విభాగంలో ఎనిమిది మంది మధ్య... మహిళల విభాగంలో ఎనిమిది మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. రెండు విభాగాల విజేతలు ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం తలపడతారు. -
ప్రజ్ఞానంద, హంపిలపైనే దృష్టి
టొరంటో: ఓపెన్, మహిళల విభాగాల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్‌కు ప్రత్యర్థులను నిర్ణయించే క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి రంగం సిద్ధమైంది. టొరంటోలో నేడు మొదలయ్యే ఈ టోర్నీలో భారత్ నుంచి ఏకంగా ఐదుగురు గ్రాండ్‌మాస్టర్లు బరిలో ఉన్నారు. ఓపెన్ విభాగంలో ప్రజ్ఞానంద, గుకేశ్ (తమిళనాడు), విదిత్ (మహారాష్ట్ర)... మహిళల విభాగంలో కోనేరు హంపి (ఆంధ్రప్రదేశ్), ప్రజ్ఞానంద సోదరి వైశాలి (తమిళనాడు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భారత్ నుంచి ప్రజ్ఞానంద, హంపి ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. ఓపెన్ విభాగంలో 8 మంది... మహిళల విభాగంలో 8 మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మొత్తం 14 రౌండ్ల చొప్పున టోర్నీని నిర్వహిస్తారు. అత్యధిక పాయింట్లు గెలిచిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు. క్యాండిడేట్స్ టోర్నీ ఓపెన్ విభాగం విజేత ప్రస్తుత విశ్వవిజేత డింగ్ లిరెన్ (చైనా)తో... మహిళల విభాగం విజేత ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ టైటిల్ కోసం తలపడతారు. బుధవారం కేవలం ప్రారంభోత్సవం ఉంది. గురువారం తొలి రౌండ్ గేమ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీలో పోటీపడనున్న క్రీడాకారుల వివరాలు... ఓపెన్ విభాగం: ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్ (భారత్) , నెపోమ్నిషి (రష్యా), కరువానా, నకముర (అమెరికా), అబసోవ్ (అజర్బైజాన్), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్). మహిళల విభాగం: హంపి, వైశాలి (భారత్), టింగ్జీ లె, టాన్ జోంగి (చైనా), కాటరీనా లాగ్నో, గొర్యాక్చినా (రష్యా), సలీమోవా (బల్గేరియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్). -
కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర పురావస్తు శాఖ నోటీసులు
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన హంపీలోని విరూపాక్ష ఆలయంలో చారిత్రక స్తంభాన్ని తవ్వినట్లు వచ్చిన ఆరోపణలపై భారత ఆర్కియోలాజికల్ సర్వే కర్ణాటక దేవదాయ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఇటీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరైన కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమంలో జెండా ఏర్పాటు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. చారిత్రక ప్రదేశంలో తవ్వే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆక్షేపిస్తోంది. హంపీ విరూపాక్ష ఆలయ సముదాయం కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని భారత ఆర్కియోలాజికల్ సర్వే రక్షణలో ఉందని, అనుమతులు లేకుండా ఆలయాన్ని మూసివేయడం, స్తంభాల మధ్య రంధ్రాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని దేవదాయ శాఖ ఇన్ఛార్జ్ అధికారికి ఇచ్చిన నోటీసులో భారత ఆర్కియోలాజికల్ సర్వే పేర్కొంది.చారిత్రక కట్టడాల రక్షణ చట్టం (AMASR Act)లోని సెక్షన్ 30ను ఉల్లంఘించినందుకు గానూ వివరణ ఇవ్వాలని కోరింది. విజయనగర సామ్రాజ్య కాలంలో రాజధాని నగరంగా ఉన్న హంపిలోని స్మారక కట్టడాల సమూహంలో విరూపాక్ష ఆలయం భాగంగా ఉంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో విజయనగర రాజు రెండవ దేవరాయ నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. 1986లో యునెస్కో హంపిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడి వివిధ స్మారక చిహ్నాలను కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని భారత ఆర్కియోలాజికల్ సర్వే పరిరక్షిస్తోంది. -
ఆసియా క్రీడల్లో సత్తా చాటారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి (చెస్), జ్యోతి యర్రాజీ (అథ్లెట్), బి.అనూష (క్రికెట్) శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ప్రపంచ క్రీడా వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతూ రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చారని సీఎం జగన్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు తాము గెలుచుకున్న పతకాలను సీఎంకు చూపించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేలా క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. ఏపీకి 11 పతకాలు.. ఆసియా క్రీడల్లో మన దేశం తొలిసారిగా 107 పతకాలను సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 మంది క్రీడాకారులు దేశం తరఫున వివిధ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఎనిమిది మంది క్రీడాకారులు 11 పతకాలను (5 గోల్డ్, 6 సిల్వర్) సాధించారు. రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో పతకాల విజేతలకు ప్రభుత్వం రూ.2.70 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసింది. వీటితో పాటు గతంలోని ప్రోత్సాహక బకాయిలతో కలిపి మొత్తం రూ.4.29 కోట్లు క్రీడాకారుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్విసులు, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ హెచ్.ఎం.ధ్యానచంద్ర, శాప్ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రెండు గేముల్లో ఓడిన హంపి
కోల్‌కతాలో జరుగుతున్న టాటా స్టీల్ ఇండియా ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రెండు గేముల్లో ఓడిపోయి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. అర పాయింట్‌తో చివరిదైన పదో ర్యాంక్‌లో ఉంది. జు వెన్జున్ (చైనా)తో జరిగిన తొలి గేమ్‌ను 67 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... ఇరీనా క్రుష్ (అమెరికా)తో జరిగిన రెండో గేమ్‌లో 48 ఎత్తుల్లో... వంతిక (భారత్)తో జరిగిన మూడో గేమ్‌లో 24 ఎత్తుల్లో ఓటమి పాలైంది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఒక పాయింట్‌తో 8వ ర్యాంక్‌లో ఉంది. తొలి రౌండ్ లో దివ్య (భారత్) చేతిలో 57 ఎత్తుల్లో ఓడిన హారిక... నినో బత్సియాష్విలి (జార్జియా)తో 26 ఎత్తుల్లో, సవితాశ్రీ (భారత్)తో 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో మూడు రౌండ్ల తర్వాత దివ్యæ, వంతిక 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
ఆ ఆటోడ్రైవర్ నిజాయితీకి ఫిదా.. ఏకంగా మనువాడింది
అతనొక ఆటోడ్రైవర్. అయినా ఆమె అతన్ని అర్థం చేసుకుని ఇష్టపడింది. అతని నిజాయితీ ఆమెను బాగా ఆకర్షించింది. స్వదేశీ-విదేశీ అభ్యంతరాలు, ఆస్తిపాస్తుల అంతరాల్ని పక్కన పెట్టింది. మనసులో మాట బయటపెట్టి.. అతన్ని ఒప్పించింది. ఐదేళ్లుగా వాళ్ల ప్రేమ ప్రయాణం సాగింది. డేటింగ్ పేరుతో ఎక్కడ మోసం చేస్తుందేమోనని ఆ కుర్రాడి కుటుంబం కంగారు పడింది. దేశం కానీ దేశం నుంచి అల్లుడు అనేసరికి ఆమె తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. కానీ, వాళ్ల ప్రేమ కొనసాగింది. చివరికి.. మనసైన వాడిని అతని సంప్రదాయ పద్ధతుల్లోనే వివాహం ఆడింది. బెల్జియంకు చెందిన కెమిల్ తన కుటుంబం పాటు ఐదేళ్ల కిందట కర్ణాటక విజయనగర జిల్లా హంపికి టూర్ మీద వచ్చింది. ఆ సమయంలో హంపి జనతా ప్లాట్‌కు చెందిన ఆటోడ్రైవర్ అయిన అనంతరాజుతో పరిచయం ఏర్పడింది. ఇక్కడ ఉన్నన్నిరోజులు వాళ్ల గైడ్‌గా ఉన్నాడు రాజు. ఎక్కడా మోసం చేయకుండా ప్రయాణికులతో, విదేశీయులతో అతను వ్యవహరించిన తీరు, నిజాయితీ ఆమెను విపరీతంగా ఆకర్షించాయి. పైగా తనకు వచ్చే సంపాదనలో అతను కొంత దానం చేస్తున్నాడని తెలిసి.. ఆ మంచి మనసును ఇష్టపడిందామె. ఈ క్రమంలో అతన్ని ప్రేమిస్తున్నట్లు తన ఇంట్లో వాళ్లకు చెప్పింది. మొదట ఆలోచనలో పడ్డా.. కూతురి సంతోషం కోసం వాళ్లు అంగీకరించారు. పెద్దల సమక్షంలోనే ఆమె అతనికి ప్రపోజ్ చేసింది. తన ఇంట్లో వాళ్లను అడిగి.. ఆమె ప్రేమకు అంగీకారం తెలిపాడతను. అలా.. వాళ్ల ప్రేమ.. పెద్లల సమక్షంలోనే పెరిగి పెద్దైంది. అయితే.. కరోనా సమయంలో వాళ్ల వివాహం జరగాల్సి ఉంది. బెల్జియంలో గ్రాండ్‌గా పెళ్లి ప్లాన్ చేశారు ఆమె తల్లిదండ్రులు. ఈలోపు.. కరోనా పరిణామాలతో ఆ పెళ్లి వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కెమిల్ బెల్జియంలో సామాజిక వేత్త. ఈ గ్యాప్‌లో వాళ్ల బంధం మరింత బలపడింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలాగైనా రాజునే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. చివరికి వాళ్ల ఇంట్లో వాళ్లు.. రాజు తల్లిదండ్రులతో మరోసారి పెళ్లి సంప్రదింపులు మొదలుపెట్టారు. చివరికి.. భారత్‌లోనే పెళ్లి బాజాలు మొగాయి. ఇవాళ(శుక్రవారం 25-11-2022) హంపీ విరూపాక్షేశ్వర ఆలయంలో పెద్దలు, బంధు మిత్రుల నడుమ ఘనంగా వివాహం జరిగింది. హంపీకి చెందిన అంజీనప్ప కుమారుడు అనంతరాజుకి, బెల్జియంకు చెందిన జీప్ పిలిఫ్ మూడవ కుమార్తె కెమిల్ ఏడగుడులతో ఒక్కటవ్వడం స్థానికంగా ఆకట్టుకుంది. -
హంపీ అద్భుతం
సాక్షి, బళ్లారి: ఘనమైన సాంస్కృతిక వారసత్వాలకు నిలయమైన భారతదేశపు గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం కుటుంబసమేతంగా చారిత్రక హంపీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఇలాంటి ప్రదేశాల గురించి తెలుసుకోవడం ద్వారా యువతలో మనోబలం, ఆత్మవిశ్వాసం పెరిగి నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కాగలరని ఆకాంక్షించారు. హంపీలో విజయనగర సామ్రాజ్య గత వైభవపు ఆనవాళ్లు, నాటి శిల్పకళాశైలి ఎవరినైనా మంత్రముగ్ధుల్ని చేస్తాయన్నారు. బహమనీ సుల్తానులు విజయనగర వైభవాన్ని నేలమట్టం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, హంపీ శిథిలాలు సైతం నాటి చరిత్రను మనకు తెలియజేస్తున్నాయని తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయగిరి నియోజకవర్గం సైతం రాయలవారి సామ్రాజ్యంలో ఒకనాడు భాగంగా ఉండేదని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో హంపీని సందర్శించానని తెలిపారు. ప్రజా సంక్షేమానికి రాయలు శ్రమించారని, సంస్కృతిని, కళలను ప్రోత్సాహించారని, ఆయన లాంటి ఆదర్శవంతమైన రాజులు చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తారని తెలిపారు. హంపీ వంటి చారిత్రక ప్రదేశాల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. -
హంపీకి నో ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
సాక్షి, బళ్లారి: కరోనా సెకండ్ వేవ్‌తో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న హంపీలో పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. హంపీ స్మారకాలతో పాటు మహిమాన్వితుడైన విరూపాక్షేశ్వర స్వామి దర్శనాన్ని నిలుపుదల చేశారు. వచ్చే నెల 15 వరకు హంపీలోకి పర్యాటకులకు అనుమతి ఉండదని పురావస్తు శాఖాధికారులు శుక్రవారం తెలియజేశారు. చదవండి: కరోనా ఆసుపత్రిలో వైద్యులు నృత్యం -
మేఘాలలో తేలిపొమ్మని!
‘దేఖో అప్నా దేశ్’. ఐఆర్సీటీసీ సరికొత్త నినాదం ఇది. కోవిడ్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో కొత్త సంవత్పరం వచ్చిందంటే చాలు నగరవాసులు ‘చలో టూర్’ అంటూ రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. బ్యాంకాక్, దుబాయ్, శ్రీలంక వంటి విదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈసారి కోవిడ్ కారణంగా మూసివేసిన అంతర్జాతీయ సరిహద్దులు ఇంకా తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో ‘మన దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో విహరిద్దాం’ అనే లక్ష్యంతో ఐఆర్సీటీసీ ‘దేఖో అప్నా దేశ్’ ప్యాకేజీలను సిద్ధంచేసింది. లాక్డౌన్, వర్క్ ఫ్రం హోం, పిల్లల ఆన్లైన్ చదువులు వంటి వివిధ కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్న నగరవాసులకు ఈ ప్యాకేజీలు సరికొత్త ఉత్సాహాన్నివ్వనున్నాయి. మధ్యప్రదేశ్, అండమాన్, మేఘాలయ, హంపీ తదితర ప్రాంతాల కోసం ఐఆర్సీటీసీ తాజాగా డొమెస్టిక్ ఫ్లైట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. – సాక్షి, సిటీబ్యూరో చలో హంపీ.. హంపీ– బాదామి– ఐహోల్– పట్టడక్కల్ ప్రాంతాల పర్యటన జనవరి (2021) 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉంటుంది. ఈ పర్యటనలో మొదటి రోజు (29) ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి ఉదయం 9.25 గంటలకు విద్యానగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హోస్పేట్‌కు రోడ్డు మార్గంలో వెళ్తారు. అనెగుండి, పంపానది, తుంగభద్ర డ్యామ్ తదితర ప్రాంతాల పర్యటన అనంతరం హోస్పేట్ చేరుకుంటారు. రెండోరోజు హోస్పేట్ నుంచి హంపీ వెళ్తారు. విఠల, విరూపాక్ష ఆలయాలు, క్వీన్స్బెత్, లోటస్ మహల్ తదితర ప్రాంతాల సందర్శన ఉంటుంది. మూడోరోజు బాదామి గుహలను సందర్శిస్తారు. అనంతరం ఐహోల్, పట్టడక్కల్ చారిత్రక కట్టడాల సందర్శన అనంతరం నాలుగోరోజు హోస్పేట్ మీదుగా తిరిగి ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు విద్యానగర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 6.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అన్ని వసతులతో కలిపి ఒక్కొక్కరికి రూ.15,750 చొప్పున చార్జీ ఉంటుంది. 11 ఏళ్లలోపు పిల్లలకు రూ.12,750 చొప్పున ఉంటుంది. చదవండి: మంచు ముసుగులో అరకు అందాలు అందాలలో అహో మహోదయం .. – అసోం, మేఘాలయలోని అందమైన ప్రదేశాలను వీక్షించేందుకు మరో ప్యాకేజీ. ఇది మార్చి (2021) 12 నుంచి 17 వరకు కొనసాగుతుంది. 12న ఉదయం5.20 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 8 గంటలకు గౌహతి చేరుకుంటారు. 17న ఉదయం 8.40 గంటలకు గౌహతి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 11.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అన్ని సదుపాయాలతో పెద్దవాళ్లకు రూ.44,683, పిల్లలకు రూ.26,353 చొప్పున చార్జీలు ఉంటాయి. చదవండి: సిక్కోలు ‘నయాగరా’ అమేజింగ్ అండమాన్.. అండమాన్, నికోబార్ పర్యటన ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు ఉంటుంది. ఈ టూర్లో సెల్యూలర్ జైల్, రాస్, హావ్లాక్ ఐలాండ్స్, అందమైన సాండీ బీచెస్, వివిధ రకాల జంతువులు, పక్షులతో కూడిన వైవిధ్య ప్రదేశాలను వీక్షించవచ్చు. పెద్దవాళ్లకు రూ.43,416, పిల్లలకు రూ.29,686 చొప్పున చార్జీ ఉంటుంది. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇండోర్, ఉజ్జయిని, మాండు తదితర ప్రాంతాల పర్యటన ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు కొనసాగుతుంది. కాలభైరవ టెంపుల్, మంగళ్‌నాథ్ మందిర్, జంతర్‌మంతర్, తదితర ప్రాంతాలను పర్యటిస్తారు. పెద్దవాళ్లకు రూ.25,250, పిల్లలకు 17,100 చొప్పున చార్జీ ఉంటుంది. -
హంపీలో చిక్కుకున్న నటి
కర్ణాటక ,హొసపేటె: కన్నడ సీనియర్ సినీ నటి జయంతి హంపీలో చిక్కుకుపోయారు. హంపీలో ఉంటున్న తన కుమారుడు కృష్ణకుమార్‌ను చూసేందుకు గత నెల 22న లాక్డౌన్ ప్రకటించడానికి రెండు రోజుల ముందు నటి జయంతి బెంగళూరునుంచి ఇక్కడకు విచ్చేశారు. ఉన్న ఫళంగా లాక్డౌన్ ప్రకటించడంతో బెంగళూరుకు వెళ్లలేకపోయారు. జయంతి మాట్లాడుతూ లాక్డౌన్ ఈ నెల 14న పూర్తి అవుతుందని భావించామన్నారు. తిరిగి లాక్డౌన్ వచ్చే నెల 3 వరకు పొడిగించడంతో హంపీ సమీపంలోని ఓ హోటల్లోనే ఉండి పోవాల్సి వచ్చిందన్నారు. హోటల్లో తమకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉందని పేర్కొన్నారు. -
ఊటీ, మనాలిని మరపించే ప్రకృతి అందాలు!
సాక్షి, బెంగళూరు : ఊటీ, కులు మనాలీని మరిపించే ప్రకృతి అందచందాలను తిలకించాలంటే మనం అక్కడికే వెళ్లవలసిన అవసరం లేదు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో గల సండూరుకు ప్రయాణమైతే చాలు. పచ్చని కొండలు కోనలు, లోయలు, జలజలపారే సెలయేళ్లు, ఎర్రని మట్టి రోడ్లు, ప్రాచీన ఆలయాలు ఇంకా ఎన్నెన్నో ప్రకృతి అందాలు. అక్కడ ఒక్కో ప్రాంతం చూస్తుంటే మనం ప్రపంచాన్నే మరిచి పోతాం. 1943లో జాతిపిత మహాత్మాగాంధీ సండూరు ప్రకృతిని తిలకించి పులకించిపోయి ‘సీ సండూర్ ఇన్ సెప్టెంబర్’ అని పిలుపునిచ్చారు. ఇక ఈ ఏడాది వరుణుడు కరుణించడంతో ప్రకృతి పులకరించి పుష్కలంగా వర్షాలు కురవడం వల్ల ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. రెప్ప వేయడం కూడా కష్టమే అంటే అతిశయోక్తి కాదు. గనులకు మారుపేరైన సండూరు ప్రకృతి సోయగాలతో పర్యాటకుల మనసులు దోచుకుంటోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో కుమారస్వామి, పార్వతీదేవి, గండి నరసింహ ఆలయాలు పర్యాటకుల మనసును ప్రశాంతంగా మార్చి వేస్తాయనడంలో సందేహం లేదు. ఎటు చూసినా ఎత్తైన కొండలు, పచ్చని అడవులు, చుట్టూ వృక్షాలు తెల్లవారు జామున మంచుకు మరింత సోయగం అందిస్తాయి. ఇక్కడ సూర్యకిరణాల దర్శనం కూడా కరువే అని చెప్పవచ్చు. ప్రత్యేకించి నందిహళ్లి, వర్సిటీ, కుమారస్వామి ఆలయం చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తాయి. అంతేకాదు ఇలాంటి ప్రకృతి ప్రాంతంలో రెండు కొండల నడుమ ఎప్పుడో తొలిచిన గుహ ద్వారా రైళ్ల రాకపోకల శబ్ధాలు, సెలయేళ్ల పరవళ్లు మనం ఎక్కడ ఉన్నాం? అనిపిస్తాయి. ప్రత్యేకించి దారి వంక చెరువు, ఇరుకొండల నడుమ పారుతున్న సెలయేళ్ల దృశ్యాలు మనసును దోచుకుంటాయి. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో కురిసే వర్షాలకు ఇక్కడి ప్రకృతి పులకించి వివిధ రకాల పక్షుల కూతలతో మనసును దోచుకుంటాయి. వర్షాలు తగ్గి అక్టోబర్‌లో మరింత నెమ్మదిగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు. హంపీకి 40 కిలోమీటర్లే ఇంతటి అందమైన ప్రాంతం మనకు సమీపంలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. కేవలం హంపీ పర్యాటక కేంద్రం ఒక్కటే జిల్లాలో ఉందనుకొని హంపీని సందర్శించి వెళ్లిపోతారే తప్ప హంపీకి కేవలం 40 కిలోమీటర్ల దూరాన సండూరు గురించి తెలిసినవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారు సండూరు అందాలను వర్ణించిన తర్వాత ఇక్కడ పర్యాటకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఇక బళ్లారి, హొసపేటె పట్టణాల నుంచి సండూరుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకృతి అందాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసిన పక్షంలో పర్యాటకులు ఊటీ తదితర ప్రాంతాలకు బదులుగా సండూరు ప్రకృతి సోయగాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతారనడంలో అతిశయోక్తి లేదు. బళ్లారి, హొస్పేటల నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. -
6లో హంపి... 11లో హారిక
హెంగ్షుయె (చైనా): వరల్డ్ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. 16 మంది మేటి చెస్ క్రీడాకారిణుల మధ్య ర్యాపిడ్ పద్ధతిలో 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం నాలుగు రౌండ్ గేమ్‌లు నిర్వహించారు. నాలుగో రౌండ్ ముగిశాక హంపి రెండు పాయింట్లతో ఆరో స్థానంలో, హారిక రెండు పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నారు. తొలి గేమ్‌లో హంపి 69 ఎత్తుల్లో బేలా ఖొటెనాష్విలి (జార్జియా)పై గెలిచింది. జన్సాయా (కజకిస్తాన్)తో రెండో గేమ్‌ను 32 ఎత్తుల్లో... కొస్టెనిక్ (రష్యా)తో మూడో గేమ్‌ను 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో జరిగిన నాలుగో గేమ్‌లో 53 ఎత్తుల్లో ఓడిపోయింది. మరోవైపు హారిక తొలి గేమ్‌లో 95 ఎత్తుల్లో కొస్టెనిక్ (రష్యా) చేతిలో ఓడిపోయి... ఎలిజబెత్ (జర్మనీ)తో జరిగిన రెండో గేమ్‌ను 79 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బేలా (జార్జియా)తో జరిగిన మూడో గేమ్‌లో హారిక 44 ఎత్తుల్లో గెలిచి, అనస్తాసియా (రష్యా)తో జరిగిన నాలుగో గేమ్‌ను 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. హంపి, హారికతోపాటు మరో నలుగురి ఖాతాలోనూ రెండేసి పాయింట్లు ఉన్నా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించారు. -
‘హంపి’ ఎంత పనిచేసింది...
సాక్షి, బెంగళూరు : ‘నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఒక జీవిత కాలం లేటు’ అని ఆరుద్ర అన్నట్లుగానే...రైలు ఆలస్యం కారణంగా సుమారు 500మంది విద్యార్థులు ‘నీట్’ పరీక్షకు దూరమయ్యారు. కర్ణాటకలో హంపి ఎక్స్‌ప్రెస్ సుమారు ఆరు గంటల పాటు ఆలస్యంగా రావడంతో విద్యార్థులు భవితవ్యం సందిగ్ధంగా మారింది. షెడ్యూల్ ప్రకారం రావాల్సిన హంపి రైలు ఆదివారం ఆరు గంటలు ఆలస్యంగా నడవటంతో విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారు. వీరంతా ఉత్తర కన్నడ నుంచి బెంగళూరుకు హంపి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. ఉదయం ఏడింటికి బెంగళూరు చేరుకోవాల్సిన ట్రైన్.. మధ్యాహ్నం రెండున్నరకి వచ్చింది. ఒంటిగంటన్నరలోపు పరీక్ష కేంద్రాలకు రానందుకు అక్కడి అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. అంతకు ముందు రైలు ఆలస్యంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు... కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రితో పాటు, రైల్వే మంత్రికి మెసేజ్‌లు పంపించినా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రస్థాయిలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు తిరిగి నీట్ నిర్వహించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై సిద్దరామయ్య ట్విటర్ ద్వారా ధ్వజమెత్తారు. ఇతరులు సాధించిన దానికి కూడా తన ఖాతాలో వేసుకుని జబ్బలు చరుచుకునే మోదీ... ఇటువంటి వైఫల్యాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఘాటుగా విమర్శించారు. రైళ్లు సకాలంలో నడవకపోవడం వల్ల వందలాదిమంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారని, వారిని మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సిద్దరామయ్య కోరారు. ఇక ఈ ఘటనపై సౌత్ వెస్ట్రన్ రైల్వే పీఆర్వో మాట్లాడుతూ.. హంపి ఎక్స్‌ప్రెస్ ఆలస్యం కారణంగా పరీక్షకు సకాలంలో హాజరుకాలేకపోయిన విద్యార్థులకు తిరిగి నీట్ పరీక్ష నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ లేఖ రాయనున్నట్లు తెలిపారు. -
హంపి పరాజయం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పోరాటం ముగిసింది. జొ లాంటా జవద్జా్క (పోలాండ్)తో జరిగిన రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను డ్రా చేసుకున్న హంపి రెండో గేమ్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి రెండో గేమ్‌ను తెల్ల పావులతో ఆడి 78 ఎత్తుల్లో పరాజయం పాలైంది. మరో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. బేలా ఖొటెనాష్విలి (జార్జియా)తో రెండో రౌండ్ రెండో గేమ్‌ను కూడా హారిక ‘డ్రా’ చేసుకుంది. దీంతో విజేతను తేల్చేందుకు టైబ్రేక్ నిర్వహించగా... అందులో గెలిచి మూడో రౌండ్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్ తరఫున హారిక మాత్రమే బరిలో మిగిలింది. -
హంపి శుభారంభం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజయంతో శుభారంభం చేయగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో సరిపెట్టుకుంది. హయత్ తుబాల్ (అల్జీరియా)తో జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌లో హంపి 46 ఎత్తుల్లో గెలిచింది. సోపికో ఖుఖాష్‌విలి (జార్జియా)తో జరిగిన తొలి గేమ్‌ను హారిక 61 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. జన్సాయా అబ్దుమలిక్ (కజకిస్తాన్)తో జరిగిన తొలి గేమ్‌ను భారత్‌కే చెందిన పద్మిని రౌత్ 34 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... నటాలియా పొగోనినా (రష్యా)తో జరిగిన తొలి గేమ్‌లో భక్తి కులకర్ణి 63 ఎత్తుల్లో ఓడిపోయింది. ఆదివారం ఈ జోడీల మధ్యే రెండో గేమ్ జరుగుతుంది. హంపి తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంటే తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. హారిక, పద్మిని రౌత్‌లు మాత్రం ముందంజ వేయాలంటే... టోర్నీలో నిలబడాలంటే భక్తి కులకర్ణి రెండో గేమ్‌లో తప్పకుండా గెలవాలి. ఒకవేళ హారిక, పద్మిని తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంటే మాత్రం సోమవారం టైబ్రేక్ గేమ్‌లను నిర్వహిస్తారు. -
భారత జట్ల విజయం
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్ ఐదో రౌండ్లో భారత పురుషుల, మహిళల జట్లు విజయం సాధించాయి. భారత పురుషుల జట్టు 3.5–0.5తో పరాగ్వేపై... మహిళల జట్టు 3.5–0.5తో అర్జెంటీనాపై గెలుపొందాయి. విశ్వనాథన్ ఆనంద్ 26 ఎత్తుల్లో రమిరెజ్ డెల్గాడోపై... ఆధిబన్ 35 ఎత్తుల్లో అల్మిరాన్‌పై... శశికిరణ్ 35 ఎత్తుల్లో వెర్జివ్‌కర్‌పై నెగ్గగా; గిలెర్మోతో జరిగిన గేమ్‌ను పెంటేల హరికృష్ణ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 52 ఎత్తుల్లో కరోలినా లుజాన్‌పై... తానియా సచ్దేవ్ 36 ఎత్తుల్లో ఫ్లోరెన్సియాపై... ఇషా కరవాడే 35 ఎత్తుల్లో ఐలెన్‌పై విజయం సాధించగా... క్లాడియా అమూరాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 65 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
హంపీలో సాంస్కృతిక నడక
హొసపేటె: విదేశీ పర్యాటకులు హంపీలో ఆదివారం హెరిటేజ్ వాక్ కార్యక్రమం చేపట్టారు. గో హెరిటేజ్ వాక్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, న్యూజీలాండ్ తదితర దేశాల నుంచి వచ్చిన సుమారు 15 మంది పర్యాటకులు, బెంగళూరు, హుబ్లీ తదితర ప్రాంతాలకు చెందిన స్వదేశీ సందర్శకులతో కలిసి హెరిటేజ్ వాక్‌లో పాల్గొన్నారు. హంపీలోని ఎదురు బసవణ్ణ మంటపంవద్ద ప్రారంభమైన నడక ప్రారంభించి విజయ విఠల దేవస్థానం, మహానవమి దిబ్బ, జలమంటపం, గజ్జల మంటపం, ఉగ్ర నరసింహ, లోటస్ మహల్, గజశాల తదితర పురాతన స్మారకాల మీదుగా 21 కి.మీ.ల మేర వరకు కొనసాగించారు. ఈసందర్భంగా ఇంగ్లండ్‌కు చెందిన జోనస్ ఎలిజబెత్ మాట్లాడుతూ పర్యాటక కేంద్రమైన హంపీలో హెరిటేజ్ వాక్ చేపట్టడం ద్వారా పురాతన స్మారకాల సంరక్షణపై అవగాహన కల్పించామన్నారు. -
విమానాల్లో వచ్చారు.. భిక్షమెత్తారు!
హోసపేటె: అభివృద్ధి చెందిన దేశాల నుంచి విలాసంగా విమానాల్లో వచ్చారు. అయినా భిక్షమెత్తారు. 30 దేశాల నుంచి సుమారు 100 మందికి పైగా విదేశీయుల పర్యాటకుల బృందం కర్ణాటకలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రమైన బళ్లారి జిల్లాలోని హంపినీ వీక్షించేందుకు వచ్చింది. కొద్దిరోజులుగా వీరంతా విరుపాపురగడ్డ సమీపాన ఉన్న మైదానంలో టెంట్ వేసుకొని బస చేస్తున్నారు. అయితే పోలీసులు వారిని ఖాళీ చేయించారు. దీంతో హోసపేటె నగరానికి చేరుకొన్న ఈ దేశీయుల బృందం గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండు ముందు విన్యాసాలు ప్రదర్శిస్తు భిక్షాటన చేశారు. జనం తోచిన డబ్బును అందించారు. ఈ డబ్బును పేదలకు ఇస్తామని కొందరు, సొంతానికి వాడుకుంటామని మరికొందరు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో మనదేశ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులు చిల్లరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజస్థాన్ లో పుష్కర్ ప్రాంతంలో నవంబర్ లో విదేశీ పర్యాటకులు తమకు వచ్చిన విద్యలు ప్రదర్శించి చిల్లర అర్థించారు. -
అమరావతిలో హంపీ పోలీసులు
అమరావతి (గుంటూరు రూరల్) : అమరావతిలో భక్తులకు సేవలందించేందుకు కర్నాటకకు చెందిన బళ్ళారి జిల్లా హంపీకి చెందిన పోలీసులు 184 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కర్నాటక నుంచి దాదాపు 400 మంది సిబ్బంది ఆంధ్రాకు వచ్చారు. భాష సమస్య ఉన్నా భక్తులకు సేవలందిస్తున్నామని తెలిపారు. భక్తులు ఎంతో క్రమశిక్షణగా స్నానాలు ఆచరించి దేవుడిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఇబ్బందులున్నా భక్తుల ఆసక్తిని చూసి విధులు నిర్వహిస్తున్నామన్నారు. -
హరికృష్ణకు రజతం
సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: చైనా వేదిక తెలుగు చెస్ క్రీడాకారులకు బాగా కలిసొచ్చినట్టుంది. నాలుగు రోజుల క్రితం చైనాలోని చెంగ్డూలో జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీలో తెలుగు అమ్మాయిలు హారిక, హంపి స్వర్ణ, రజత పతకాలు నెగ్గగా... తాజాగా చైనాలోనే జరిగిన డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మెరిశాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో హరికృష్ణ ఐదు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. మహిళల ప్రపంచ చాంపియన్ హు ఇఫాన్ (చైనా)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నెపోమ్నియాచి (రష్యా) ఆరు పాయింట్లతో విజేతగా నిలిచాడు. హరికృష్ణ, యు వాంగ్ (చైనా) ఐదు పాయింట్లతో సమఉజ్జీగా నిలి చినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హరికృష్ణకు రెండో స్థానం దక్కింది. -
హంపిపై హారిక గెలుపు
చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ ఏడో రౌండ్లో హారిక 74 ఎత్తుల్లో హంపిపై విజయం సాధించింది. హంపిపై హారికకిదే తొలి విజయం కావడం విశేషం. తాజా గెలుపుతో హారిక ఈ టోర్నీలో 5 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నీలో తొలి పరాజయం చవిచూసిన హంపి 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. హరికృష్ణ గేమ్ ‘డ్రా’: చైనాలోనే జరుగుతున్న డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హరికృష్ణ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. వాసిలీ ఇవాన్చుక్ (ఉ క్రెయిన్)తో శనివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 93 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
హారిక, హంపి గేమ్‌లు ‘డ్రా’
చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మరో ‘డ్రా’ను నమోదు చేసుకున్నారు. శుక్రవారం జరిగిన ఆరో రౌండ్లో జూ వెన్జున్ (చైనా)తో హంపి 27 ఎత్తుల్లో... అనా ముజిచుక్ (ఉక్రెయిన్)తో హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఆరో రౌండ్ తర్వాత హంపి 4.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతుండగా... హారిక నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. హరికృష్ణకు షాక్: మరోవైపు చైనాలోనే జరుగుతున్న డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. బూ జియాంగ్జి (చైనా)తో శుక్రవారం జరిగిన తొలి రౌండ్లో హరికృష్ణ 57 ఎత్తుల్లో ఓడిపోయాడు. -
హంపిలో కట్టడాలకు ముప్పు?
మూడు రోజులుగా నీటిలోనే స్మారకాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పర్యాటకుల వినతి సాక్షి, బళ్లారి : ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపిలోని ఆలయాల ఆవరణంలోకి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నీరు చేరడంతో కట్టడాల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి హంపి చుట్టుపక్కల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు సమీపంలోనే తుంగభద్ర డ్యాం నిండుగా తొణికిసలాడుతున్న సంగతి తెలిసిందే. హంపిలో కురుస్తున్న భారీ వర్షాలకు హంపి పూర్తిగా జలమయమైంది. తుంగభద్ర డ్యాం 35 గేట్లు పూర్తిగా ఎత్తివేసినప్పుడు కూడా హంపిలోకి నీరు ప్రవహించలేదు. అయితే మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హంపి జలదిగ్బంధమైంది. ఈ నేపథ్యంలో పురాతన కట్టడాలైన విరుపాక్షేశ్వర ఆలయం, విజయవిఠల ఆలయం, లోటస్ మహల్ తదితర పురాతన కట్టడాలు నీటిలోనే ఉండటంతో కట్టడాలకు హాని కలిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దాదాపు 600 సంవత్సరాల క్రితం హంపిలోని స్మారకాల నిర్మాణాలు చేపట్టారు. దీంతో పునాదులు, ఇతరత్రా కట్టడాల భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు వెంటనే హంపిని సందర్శించి భద్రతపై సమగ్రంగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని పర్యాటకులు భావిస్తున్నారు. హంపిలోని పర్యాటక ప్రాంతాలు జలమయమవడంతో పర్యాటకుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
వచ్చే ఆరు నెలల్లో హంపిలో అభివృద్ధి పనులు
తోరణగల్లు న్యూస్‌లైన్ : రాబోయే ఆరు నెలల్లో హంపిలో అత్యుత్తమ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆర్వీ. దేశ్‌పాండే తెలిపారు. ఆయన శనివారం సండూరు తాలూకాలోని యశ్వంతపూర్‌లో సండూరు పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో మాదిరిగా హంపి అభివృద్ధికి టూరిజం ప్యాకేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎం సిద్దరామయ్య బడ్జెట్లో పర్యాటక శాఖకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చిప్పటికీ, ఇక్కడ అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్న విలేకర్ల ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. తాజ్‌మహల్ తదితర ప్రాంతాలు మాత్రమే కాదు, హంపి కూడా ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా ఖ్యాతి చెందిందన్నారు. హంపి, కరావళి, జోగ, మైసూరు తదితర అనేక పర్యాటక ప్రాంతాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. పర్యాటక ప్రాంతం అంటే ఆ ప్రాంతాన్ని వీక్షించడమే కాదు, అక్కడి వ్యవసాయం, ఉద్యానవనాలు, ప్రజల జీవన విధానాలను పర్యాటకులకు పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందుకోసం పర్యాటక స్థలాల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు అక్కడి మానవ వనరులను పెంచనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పర్యాటక చట్టాన్ని తెచ్చిందని, దీంతో రాష్టంలోని ప్రముఖ పర్యాటక స్థలాల గురించి ప్రణాళిక సిద్ధం చేసి కేంద్రానికి పంపామన్నారు. రాబోయే ఆరు నెలల్లో హంపిని వీలైనంతగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సండూరులోని నారిహళ్ల జలాశయం, కుమారస్వామి ఆలయం, ఉబ్బళగుండి తదితర ప్రాంతాలను పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేయాలన్న ప్రస్తావన వచ్చిందన్నారు. సండూరు, హొస్పేట, హళేబీడు, బాదామి, ఐహోళెలతోపాటు ప్రతి జిల్లాలోని పర్యాటక స్థలాలను అభివృద్ధి పరిచే పథకం రూపొందించినట్లు చెప్పారు. పర్యాటకశాఖలో ఖాళీగా ఉన్న వివిధ అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం యోచిస్తోందని, ఇందుకు ఆర్థిక శాఖ అనుమతి లభించాల్సి ఉందని తెలిపారు. -
హంపి ఉత్సవంలో నేటి కార్యక్రమాలు...
కృష్ణదేవరాయ వేదిక సాయంత్రం 5 గంటలకు బళ్లారి అశ్వత్థ కళా బృందం నేతృత్వంలో నాడగీతే-రైతు గీతే, 6 గంటలకు బెంగళూరు ఎండీ పల్లవి కన్నడ పాటల గాత్రం, 7 గంటలకు సంప్రదాయక వస్త్ర ప్రదర్శన, రాత్రి 8 గంటలకు బెంగళూరు కస్తూరి శంకర్ సుగమ సంగీత కచేరి, రాత్రి 9 గంటలకు గజల్ బాంబై శబరి బ్రదర్స్ కవాలీ, రాత్రి 10 గంటలకు నృత్యం, రాత్రి 10.30 ముంబై షాన్ వారి హిందీ, కన్నడ పాటల గాయన కార్యక్రమం. ఎంపీ ప్రకాష్ వేదిక సాయంత్రం 6 గంటలకు బెంగళూరు ప్రవీణ్చే ప్యూజన్ బ్యాండ్ వాయిద్యం, 6.45 గంటలకు బెంగళూరు సయ్యద్‌ఖాన్ గజల్స్ కార్యక్రమం, 7.30 గంటలకు సాలబంజిక బెంగళూరు ఆర్థికో లేట్ ఇండియా ఆధ్వర్యంలో నృత్య రూపకం, రాత్రి 8.15 గంటలకు కలకత్తా రింపాశివ తబలా వాదన, 8.45 గంటలకు కలకత్తా ఆర్థికావెంకటేశ్ ఒడిస్సీ నృత్యం, 9.30 ముంబై సుభాముదగల్ హిందుస్థానీ సంగీత కచేరి, 10.30 గంటలకు బెంగళూరు డాక్టర్ కుమార్ పంచా వీణా వాదన, 11.15 గంటలకు బెంగళూరు ప్రసన్నగుడిచే హిందుస్థానీ సంగీత కచేరి. విద్యారణ్య వేదిక సాయంత్రం 6 గంటలకు బెంగళూరు ఆరాధన నృత్య పాఠశాల ఆధ్వర్యంలో సామూహిక నృత్యం, 6.30 గంటలకు బెంగళూరు గీతా ఎస్.హెల్బికర్చే సుగమ సంగీతం, 7 గంటలకు హొస్పేట కే.సన్నతిమ్మప్ప ఫ్లారియో నెట్ వాదన, 7.30 గంటలకు హొస్పేట శ్రీమాత మంజమ్మ యోగతిచే జోగతి నృత్యం, రాత్రి 8 గంటలకు హువినహడగలి కే.వనజాక్షి బృందం కన్నడ పాటలు, 8.30 గంటలకు బళ్లారి నాడోజ బెళగల్లు వీరణ్ణ బృందం తోలుబొమ్మల బాబ్, 9 గంటలకు బెంగళూరు రాఘవేంద్ర సంగీత సేవ ప్రతిష్టానంచే శ్రీరామ చరిత్ర నృత్య రూపకం, 9.30 గంటలకు హొస్పేట యల్లప్ప భండార్ బృందం జానపద గీతాలు, 10 గంటలకు దక్షిణి మంజునాథ్ నృత్య రూపకం, 11 గంటలకు హడగలి గోని బసప్ప జానపద గీతలు, 12 గంటలకు హువినహ డగలి రంగభారతి బృందంచే వార్డు నంబర్-6 నాటకం. హక్కబుక్క వేదిక మధ్యాహ్నం 3 గంటలకు ముగ్గుల, మెహందీ పోటీలు, 4 గంటలకు బళ్లారి వీణా కటకనహళ్లిచే హిందుస్థానీ గాయన, 4.30 గదగ్ మేఘా హుక్కేరిచే సుగమ సంగీత, 5 గంటలకు బెంగళూరు స్నేహలత బృందం కర్ణాటక సంగీతం, 5.15 గంటలకు గదగ్ భారతి డంబల బృందంచే మహిళా నాటకం, 5.30 గంటలకు హొస్పేట బీ.లక్ష్మిచే భరతనాట్యం, 5.45 గంటలకు బెంగళూరు గౌరి సంస్థాన బృందంచే మహిళా యక్షగానం, 6 గంటలకు హొస్పేట స్వర్ణముఖి భరతనాట్య పాఠశాల విద్యార్థుల నాట్య ప్రదర్శన. పోటీలు ఉదయం పది గంటలకు గ్రామీణ క్రీడా పోటీలు, కుస్తీ పోటీ, గాలి పటాలు ఎగురవేడయం, హాట్ ఎయిర్ బెలూన్, సాహస క్రీడలు, పేయింట్ బాల్, ఏటీవీ పోటీలు, ఉదయం 11 గంటలకు కిచెన్క్యూన్ పోటీలు, వికలాంగుల క్రీడాపోటీలు, హంపి బైక్స్కై, హోటల్ భువనేశ్వరి ఆవరణంలో 10.30 గంటలకు వికలాంగులకు క్రీడా పోటీలు, కమలాపురం పాఠశాల ఆవరణంలో 11.45 గంటలకు జరుగుతాయి.