రాజులు రాజ్యస్థాపనలో రాజధాని నిర్మాణం ప్రధానమైంది. అయితే రాజులందరూ రాజధాని కోసం కొండలు, గుట్టల బాట పడుతారెందుకో. హంపిని చూసినప్పుడు ఇదే అనిపిస్తుంది. బీడు భూమి సారవంతమైన పంట నేలగా మారాలంటే ఏళ్లు పడుతుంది. అందుకే పంట పొలాలను రాజధానిగా మార్చే ప్రయత్నం చేసేవారు కాదు. గట్టి నేల మీద నిర్మాణాలు చేపట్టి శత్రుదుర్భేద్యంగా మలుచుకుంటారు. హంపి కూడా అలాంటిదే.
హంపిలోని నిర్మాణాలు 14వ శతాబ్దం నాటివి. ప్రతి కట్టడమూ విధ్వంసానికి గురై ఉండడంతో హంపిని లాస్ట్ సిటీ అంటారు కానీ పర్యాటకుల సంఖ్యను చూస్తే దాని కల్చరల్ గ్లోరీని ఏ మాత్రం లాస్ కాలేదనిపిస్తుంది. పర్వత శ్రేణుల్లో 500కు పైగా మాన్యుమెంట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. ఏడాదికి ఏడు లక్షల మంది వస్తారు. ఇంతటి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది కాబట్టే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌ల జాబితాలో చేరిపోయింది.
కన్నడ గ్రామంలో బస
హంపి టూర్‌లో మిస్ కాకూడనివి... తుంగభద్రానదిలో పడవ ప్రయాణం, పంట పొలాల్లో రాత్రి బస, మోటార్‌బైక్ మీద అచ్చమైన కన్నడ గ్రామాల్లో విహారం, క్లిఫ్ జంపింగ్, విరూపాక్ష ఆలయం, లోటస్ మహల్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియం. రామాయణకాలంలో కిష్కింద అంటే ఈ ప్రదేశమేనని అశోకుని శిలాశాసనంలో ఉంది. పంపాదేవి తీర్థక్షేత్రంగా దీని ప్రస్తావన ఉంది. ఈ ప్రదేశం బెంగళూరు వాళ్లకు ఎంత దూరం (348 కి.మీ.లు)లో ఉందో హైదరాబాద్ వాళ్లకీ దాదాపు అంతే దూరం(385 కిమీలు)లో ఉంది. హంపి పర్యాటకులకు హోటళ్లు హోస్పేటలో ఉంటాయి.
కన్నడ సంప్రదాయ భోజనం, నివాసాలను ఆస్వాదించాలంటే హంపికి ఉత్తరాన కదిరామ్‌పురా గ్రామంలో హోమ్‌స్టేలుంటాయి. హంపిని ఇప్పటికే చూసి ఉంటే... విజయదశమి ఉత్సవాలు పూర్తి చేసుకుని పండగ శోభను కొనసాగిస్తూ ఉండే హంపిని మరోసారి చూసిరావచ్చు. ఎంజాయ్‌మెంట్‌కి మినిమమ్ గ్యారంటీ.
Comments
Please login to add a commentAdd a comment