Temple Demolition
-
హంపి : నాటి వైభవానికి నిలువుటద్దం, ఇవి అస్సలు మిస్ కావద్దు!
రాజులు రాజ్యస్థాపనలో రాజధాని నిర్మాణం ప్రధానమైంది. అయితే రాజులందరూ రాజధాని కోసం కొండలు, గుట్టల బాట పడుతారెందుకో. హంపిని చూసినప్పుడు ఇదే అనిపిస్తుంది. బీడు భూమి సారవంతమైన పంట నేలగా మారాలంటే ఏళ్లు పడుతుంది. అందుకే పంట పొలాలను రాజధానిగా మార్చే ప్రయత్నం చేసేవారు కాదు. గట్టి నేల మీద నిర్మాణాలు చేపట్టి శత్రుదుర్భేద్యంగా మలుచుకుంటారు. హంపి కూడా అలాంటిదే.హంపిలోని నిర్మాణాలు 14వ శతాబ్దం నాటివి. ప్రతి కట్టడమూ విధ్వంసానికి గురై ఉండడంతో హంపిని లాస్ట్ సిటీ అంటారు కానీ పర్యాటకుల సంఖ్యను చూస్తే దాని కల్చరల్ గ్లోరీని ఏ మాత్రం లాస్ కాలేదనిపిస్తుంది. పర్వత శ్రేణుల్లో 500కు పైగా మాన్యుమెంట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. ఏడాదికి ఏడు లక్షల మంది వస్తారు. ఇంతటి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది కాబట్టే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల జాబితాలో చేరిపోయింది.కన్నడ గ్రామంలో బస హంపి టూర్లో మిస్ కాకూడనివి... తుంగభద్రానదిలో పడవ ప్రయాణం, పంట పొలాల్లో రాత్రి బస, మోటార్‌బైక్ మీద అచ్చమైన కన్నడ గ్రామాల్లో విహారం, క్లిఫ్ జంపింగ్, విరూపాక్ష ఆలయం, లోటస్ మహల్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియం. రామాయణకాలంలో కిష్కింద అంటే ఈ ప్రదేశమేనని అశోకుని శిలాశాసనంలో ఉంది. పంపాదేవి తీర్థక్షేత్రంగా దీని ప్రస్తావన ఉంది. ఈ ప్రదేశం బెంగళూరు వాళ్లకు ఎంత దూరం (348 కి.మీ.లు)లో ఉందో హైదరాబాద్ వాళ్లకీ దాదాపు అంతే దూరం(385 కిమీలు)లో ఉంది. హంపి పర్యాటకులకు హోటళ్లు హోస్పేటలో ఉంటాయి. కన్నడ సంప్రదాయ భోజనం, నివాసాలను ఆస్వాదించాలంటే హంపికి ఉత్తరాన కదిరామ్పురా గ్రామంలో హోమ్స్టేలుంటాయి. హంపిని ఇప్పటికే చూసి ఉంటే... విజయదశమి ఉత్సవాలు పూర్తి చేసుకుని పండగ శోభను కొనసాగిస్తూ ఉండే హంపిని మరోసారి చూసిరావచ్చు. ఎంజాయ్మెంట్కి మినిమమ్ గ్యారంటీ. -
కర్ణాకటక లో వివాదాస్పదం అవుతున్న ఆలయాల కూల్చివేత
-
అమ్మా.. కరోనా మాత, అపచారం తల్లీ!
మహమ్మారి కరోనాను దేవతగా భావించి పూజించడం మన దేశంలోనే సాధ్యమేమో. ఆ మధ్య తమిళనాడు కొయంబత్తూరులో కరోనా దేవి పేరుతో ఒక గుడి కట్టి పూజలు చేయడం చూశాం. అది మరువక ముందే యూపీలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే భూ కబ్జా నేపథ్యంలో ఆ గుడి కూల్చివేతతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లక్నో: ప్రతాప్‌ఘడ్ శుకుల్‌పూర్ గ్రామంలో కొత్తగా ‘కరోనా మాత’ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఓ వేప చెట్టు కింద నిత్యం దేవతను పూజలు చేయడానికి ఒక పూజారిని సైతం నియమించారు. ‘కరోనా సోకకుండా చల్లగా చూడు తల్లీ’ అంటూ జనాలు పూజలు సైతం చేశారు. ఈ నెల 7న ప్రారంభమైన ఈ ఆలయం జాతీయ మీడియా ఛానెళ్ల దృష్టిని సైతం ఆకర్షించింది. అయితే నాలుగు రోజుల్లోనే కరోనా దేవి గుడి కథ ముగిసింది. శుక్రవారం రాత్రి ఎవరో ఆ గోడను కూల్చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇది పోలీసుల పనే అని గ్రామస్తులు ఆరోపిస్తుండగా, ఆ గుడి వెలిసిన జాగ మీద వివాదం నడుస్తోందని, ఇది అవతలి వర్గం పనే అయి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. కరోనా దేవత శాంతింజేసేందుకు కొందరు జంతువుల్ని బలి ఇస్తున్నారు. ఆక్రమణకు ప్లాన్? ఆలయం నిర్మించిన స్థలం లోకేశ్ కుమార్, నగేశ్ కుమార్ శ్రీవాస్తవ, జైప్రకాశ్ శ్రీవాస్తవ ఉమ్మడి ఆస్తి. లోకేష్ కుమార్ విరాళాలు వసూలు చేసి ఈ ప్రాంతంలో గుడి కట్టించాడు. కరోనా మాత పేరుతో మాస్క్ కట్టిన దేవతామూర్తికి పూజలు మొదలుపెట్టించాడు. అయితే, ఆ తర్వాత లోకేశ్ కుమార్ నోయిడాకు వెళ్లిపోయాడు. ఇక ఆలయ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నగేశ్.. సంగీపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థలాన్ని ఆక్రమించుకునేందుకే ఆలయాన్ని నిర్మించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
దేహంలో చెత్త లేకుండా చూసుకోవాలి: రకుల్
‘‘మన దేశంలో హెల్త్, ఫిట్‌నెస్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి. మన దేహం దేవాలయం లాంటిది. ఇంట్లో చెత్త లేకుండా చూసుకుంటాం. మరి దేహంలో కూడా చెత్త లేకుండా చూసుకోవాలి’’ అని హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ అన్నారు. ఫిట్నెస్, యోగా, ఆహారపు అలవాట్లపై రకుల్ మాట్లాడుతూ– ‘‘వ్యాయామం, యోగాను కలిపి చేయడం చాలా మంచిది. వ్యాయామం ఫిట్నెస్ ఇస్తే, యోగా పాజిటివ్ దృక్పథాన్ని కల్పిస్తుంది. నాకు నచ్చిన ఫుడ్‌ని ఫుల్‌గా తింటాను, కానీ యోగా–జిమ్ చేస్తాను. కనీసం రోజుకు 5 నిమిషాలు ఫిట్నెస్, యోగా ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలి. ఒకర్ని చూసి వ్యాయామాలు చేయడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చేయొద్దు. మీ శరీరానికి తగ్గదే తినండి, అలాంటి వ్యాయామాలే చేయండి. శరీరం మాత్రమే కాదు.. మనసు కూడా లైట్‌గా ఉండాలి. ఆరోగ్యం కోసం కొంతమంది అదే పనిగా సలాడ్స్ తింటారు. అది మంచిది కాదు. కొన్ని వండుకొని తినాలి. ఇంకా చెప్పాలంటే మన అమ్మమ్మల కాలం నాటి భోజనాలకి వెళ్లిపోవాలి. అదే సరైన పద్ధతి. తాత–అమ్మమ్మల కాలం నాటి వంటకాల వల్ల ఒంట్లో కొవ్వు చేరదు. ఫిట్నెస్ను లైఫ్ స్టయిల్‌గా చూడాలి. అది మన జీవితంలో భాగమైనప్పుడు ఆరోగ్యంగా ఉంటాం’’ అన్నారు. -
అర్ధరాత్రి ఆలయం కూల్చివేత
ఆగ్రహించిన స్థానికులు పునర్నిర్మించాలని డిమాండ్ తిమ్మాపూర్ : ఎల్‌ఎండీకాలనీలోని ఎస్సారెస్పీ స్థలంలో పదేళ్ల క్రితం రజకులు నిర్మించిన మడేలయ్య ఆలయూన్ని బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. రజకసంఘం నాయకులు ఎల్ఎండీకి చేరుకుని రాస్తారోకో చేశారు. ఈవిషయూన్ని బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు తెలపడంతో ఆయనతోపాటు బేతి మహేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి తహశీల్దార్ కార్యాలయూనికి చేరుకుని అధికారులను నిలదీశారు. తహశీల్దార్ సమాధానం ఇవ్వాలని లేకుంటే ఆలయూన్ని నిర్మిస్తామని చెప్పి ఆలయూనికి సమీపంలో బైఠాయించారు. తహశీల్దార్ కోమల్‌రెడ్డి అక్కడికి చేరుకుని ఉన్నతాధికారుల ఆదేశాలతోనే కూల్చివేసినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ స్థలంలో అన్ని మతాల వారి ప్రార్థన స్థలాలు ఉన్నప్పుడు కేవలం హిందువులు ఆలయూన్నే కూల్చివేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అధికారుల చర్యలు ఉన్నాయని.. జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆర్డీవో వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లోగా అనుమతినిస్తూ కూల్చివేసిన అధికారులే ఆలయూన్ని తిరిగి నిర్మించాలని, లేకుంటే తహశీల్దార్ బాధ్యత వహించాలని బండి సంజయ్ స్పష్టం చేశారు. తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని సీఐ వెంకటరమణకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆందోళనలో నాగేశ్వర్‌రెడ్డి, జోగిరెడ్డి, సంపత్, కమలాకర్, గంగరాజం, ఎల్లయ్య, లక్ష్మణ్, అంజిరెడ్డి, ఎల్లారెడ్డి, పద్మ, సత్తిరెడ్డి, తిరుపతి, రవి, శివ, చంద్రయ్య, రమేశ్, లింగయ్య, నర్సయ్య పాల్గొన్నారు. ఎల్ఎండీ, బెజ్జంకి ఎస్సైలు జగదీశ్, కోటేశ్వర్, పీఎస్సై మధూకర్, హెడ్‌కానిస్టేబుళ్లు సురేందర్‌రెడ్డి, మోతీరాం బందోబస్తు నిర్వహించారు.