అర్ధరాత్రి ఆలయం కూల్చివేత
ఆగ్రహించిన స్థానికులు పునర్నిర్మించాలని డిమాండ్
తిమ్మాపూర్ : ఎల్‌ఎండీకాలనీలోని ఎస్సారెస్పీ స్థలంలో పదేళ్ల క్రితం రజకులు నిర్మించిన మడేలయ్య ఆలయూన్ని బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. రజకసంఘం నాయకులు ఎల్‌ఎండీకి చేరుకుని రాస్తారోకో చేశారు. ఈవిషయూన్ని బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు తెలపడంతో ఆయనతోపాటు బేతి మహేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి తహశీల్దార్ కార్యాలయూనికి చేరుకుని అధికారులను నిలదీశారు. తహశీల్దార్ సమాధానం ఇవ్వాలని లేకుంటే ఆలయూన్ని నిర్మిస్తామని చెప్పి ఆలయూనికి సమీపంలో బైఠాయించారు. తహశీల్దార్ కోమల్‌రెడ్డి అక్కడికి చేరుకుని ఉన్నతాధికారుల ఆదేశాలతోనే కూల్చివేసినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ స్థలంలో అన్ని మతాల వారి ప్రార్థన స్థలాలు ఉన్నప్పుడు కేవలం హిందువులు ఆలయూన్నే కూల్చివేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అధికారుల చర్యలు ఉన్నాయని.. జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆర్డీవో వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లోగా అనుమతినిస్తూ కూల్చివేసిన అధికారులే ఆలయూన్ని తిరిగి నిర్మించాలని, లేకుంటే తహశీల్దార్ బాధ్యత వహించాలని బండి సంజయ్ స్పష్టం చేశారు. తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని సీఐ వెంకటరమణకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆందోళనలో నాగేశ్వర్‌రెడ్డి, జోగిరెడ్డి, సంపత్, కమలాకర్, గంగరాజం, ఎల్లయ్య, లక్ష్మణ్, అంజిరెడ్డి, ఎల్లారెడ్డి, పద్మ, సత్తిరెడ్డి, తిరుపతి, రవి, శివ, చంద్రయ్య, రమేశ్, లింగయ్య, నర్సయ్య పాల్గొన్నారు. ఎల్‌ఎండీ, బెజ్జంకి ఎస్సైలు జగదీశ్, కోటేశ్వర్, పీఎస్సై మధూకర్, హెడ్‌కానిస్టేబుళ్లు సురేందర్‌రెడ్డి, మోతీరాం బందోబస్తు నిర్వహించారు.