షాకింగ్‌! ఏకంగా 10 అనకొండలతో వచ్చాడు.. చివరికి..! | Man Smuggling 10 Yellow Anacondas From Bangkok Caught At Bengaluru Airport, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

షాకింగ్‌! ఏకంగా 10 అనకొండలతో వచ్చాడు.. చివరికి..!

Published Tue, Apr 23 2024 12:27 PM | Last Updated on Fri, Apr 26 2024 10:40 PM

Man smuggling 10 yellow anacondas from Bangkok caught at bangalore airport - Sakshi

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్‌ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  10 ఎల్లో అనకొండలను  అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబట్టాడు.నిందితుడిని అరెస్టు చేసిన కస్టమ్స్‌ అధికారులు తదుపరి దర్యాప్తు  మొదలు పెట్టారు.

బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణీకుడు  చెక్-ఇన్ బ్యాగ్‌లో దాచిన 10 పసుపు రంగు అనకొడలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు.  ఒక సూట్‌ కేసులో ఒక తెల్లని కవర్‌లో వీటిని జాగ్రత్తగా ప్యాక్‌ చేశాడు.  కానీ తనిఖీల్లో దొరికిపోయాడు.  ప్యాసింజర్ బ్యాగ్‌లో ఏకంగా 10 పసుపు రంగు అనకొండల్ని చూసిన అధికారులూ షాకయ్యారు.

బెంగళూరు కస్టమ్స్‌  ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన ఫోటోలను అధికారులు  పోస్ట్ చేశారు. వన్యప్రాణుల  రవాణా చట్టవిరుద్ధమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (సమ్మర్‌లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement