కవల అక్కాచెల్లెళ్ల అరుదైన ఘనత
10, 12 తరగతుల్లో సమాన మార్కులు సాధించిన కవలలు
ఇద్దరూ పుస్తకాలు పురుగులే : తండ్రి చంద్ర
కర్ణాటకలోని హాసన్ ప్రాంతానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. రెండు నిమిషాల తేడాతో పుట్టిన ట్విన్స్ చుక్కి, ఇబ్బని ఒకే పోలికలతో ఉంటారు. అంతేకాదు పరీక్షా ఫలితాల్లో కూడా ఒకేలా మార్కులు తెచ్చుకోవడం విశేషంగా నిలిచింది.
కర్ణాటకలో విడుదలైన 12వ తరగతి పరీక్షలలో ఇద్దరికీ సమానంగా మార్కులు వచ్చాయి. 600 మార్కులకు గాను ఇద్దరూ 571 మార్కులు సాధించారు. అంతే కాదు గతంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఇలాంటి మ్యాజిక్కే జరిగింది.ఇద్దరూ 625 మార్కులకు 620 మార్కులు తెచ్చు కున్నారు. దీంతే భలే అదృష్టం అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. సాధారణంగా కవలలు ఒకేలాగా ఆలోచించడం, ఒకేసారి శారీరక సమస్యలు రావడం చూస్తాం. కానీ పరీక్షల్లో కూడా ఒకేలా మార్కులు రావడం అదృష్టం అంటూ వ్యాఖ్యానించారు.
ఇద్దరికీ 97 శాతం మార్కులొస్తాయని ఆశించాం. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించ లేదని పెద్ద అమ్మాయి అయినా చుక్కి సంతోషం ప్రకటించింది. తమకూ ఇది ఆశ్చర్యకరంగా ఉందని తెలిపింది. రెండేళ్ల క్రితం పదో తరగతిలో కూడా ఇలానే సమాన మార్కులు సాధించా మని చెప్పుకొచ్చింది.
చుక్కి, ఇబ్బని కర్ణాటకలోని హసన్ నగరంలో ఎన్డిఆర్కె పియు కాలేజీలో 12వ తరగతిపూర్తి చేశారు. ప్రస్తుతం నీట్‌కోసం సిద్ధమవుతున్నారు. నీట్ పరీక్షలో వచ్చిన ఫలితాన్ని ఇంజనీరింగ్, మెడిసిన్ అనేది నిర్ణయించుకుంటారట. మీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడు తున్నారా..? అని ప్రశ్నించగా నా కంటే అక్క ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను ఎలా సంతోషిస్తానో అక్క కూడా అంతే.. ఇద్దరికీ పోటీ ఏమీ లేదు అని చెప్పింది. కేవలం చదువులు మాత్రమే కాకుండా సంగీతం, నృత్యం, అలాగే ఆటల్లో కూడా ముందుంటాం అని చెప్పారు. ఇద్దరిదీ ఒకే ఆశయమట.
అటు తండ్రి వినోద్ చంద్ర తన బిడ్డలు సాధించిన ఘనతపై ఆశ్చర్యాన్ని ప్రటకించారు. ఇది తనకు గర్వకారణమని చెప్పారు ఇబ్బానీ తన సోదరి కంటే భాషలలో మెరుగ్గా స్కోర్ చేసిందనీ, సైన్స్, మిగిలిన సబ్జెక్టులలో ఒకటి నుండి రెండు మార్కులే తేడా అని చెప్పారు. వాళ్ళు కలిసే పనులు చేసుకుంటారు స్నేహంగా ఉంటారు. కలిసే చదువుకుంటారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇద్దరూ పుస్తకాల పురుగులు అని తెలిపారు చంద్ర ఒకింత గర్వంగా.
Comments
Please login to add a commentAdd a comment