Anaconda
-
ఈ వాసనకి.. పాములిక పరారే..!
మారుతున్న కాలానుగుణంగా ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఎండాకాలం, చలికాలం కాస్త వాతావరణంలో పొడిగా, ఎండుగా ఉన్నా.. వర్షాకాలం మాత్రం నేల చాలావరకు తడిగానే ఉంటుంది. దీంతో చెట్లు, పొదలు విపరీతంగా పెరగడంతోపాటు విషజీవులకు నెలవుగా మారుతుంది.. ఆ విషయానికొస్తే పాములు అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు.పాము కనిపించగానే భయానికిలోనై ప్రాణరక్షణలో దానిని చంపడమో? తప్పించుకోవడమో? చేస్తుంటాము. మనుషులకు నచ్చని దుర్వాసనలు ఎలాగైతే ఉంటాయో.. నిపుణుల పరిశోధన ప్రకారం.. పాములకు కూడా నచ్చని కొన్ని వస్తువుల వాసనలున్నాయి. పాములు మన చుట్టూ పరిసరాలలో కనిపించకుండా, రక్షణగా ఉండడానికి ఈ వాసనలను వెదజల్లితే చాలు. ఇక దరిదాపుల్లో కూడా కనిపిచకుండాపోతాయి.అవి...- ప్రతీ ఇంట్లో సహజంగా నిల్వఉండే వెల్లుల్లి, ఉల్లిపాయలు పదార్థాల వాసనకు పాములు తట్టుకోలేవట.- పుదీనా, తులసి మొక్కల నుంచి వెలువడే వాసనను పాములు ఇష్టపడవు. బహుశా ఏళ్ల తరబడి భారతీయ ఇళ్లల్లో తులసి మొక్కను నాటడానికి కారణం ఇదే.- అలాగే నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే కూడా పాములు వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి.- అమ్మోనియా వాయువు వాసనను పాములు తీవ్ర ఇబ్బందిగా, అశాంతిగా భావిస్తాయి.- పాములు కిరోసిన్ వాసనను కూడా తట్టుకోలేవు.ఇవి చదవండి: ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే.. -
షాకింగ్! ఏకంగా 10 అనకొండలతో వచ్చాడు.. చివరికి..!
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఎల్లో అనకొండలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబట్టాడు.నిందితుడిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు మొదలు పెట్టారు.బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణీకుడు చెక్-ఇన్ బ్యాగ్‌లో దాచిన 10 పసుపు రంగు అనకొడలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఒక సూట్ కేసులో ఒక తెల్లని కవర్లో వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేశాడు. కానీ తనిఖీల్లో దొరికిపోయాడు. ప్యాసింజర్ బ్యాగ్‌లో ఏకంగా 10 పసుపు రంగు అనకొండల్ని చూసిన అధికారులూ షాకయ్యారు.బెంగళూరు కస్టమ్స్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన ఫోటోలను అధికారులు పోస్ట్ చేశారు. వన్యప్రాణుల రవాణా చట్టవిరుద్ధమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!)#Indiancustomsatwork Bengaluru Air #Customs intercepted attempt to smuggle 10 yellow Anacondas concealed in checked-in bag of a pax arriving from Bangkok. Pax arrested and investigation is underway. Wildlife trafficking will not be tolerated. #CITES #WildlifeProtection 🐍✈️ pic.twitter.com/2634Bxk1Hw— Bengaluru Customs (@blrcustoms) April 22, 2024 -
అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు
అనకొండనే ప్రపంచంలో అతిపెద్ద పాము జాతి అని అనుకున్నాం. అదే జాతికి చెందిని మరో జాతి అనకొండను ఈ క్వెడార్‌లో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఎన్నో ఏళ్లుగా ఈ అనకొండకు సంబంధించి మరో జాతి గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. శాస్త్రవేత్తల ఊహను నిజం చేస్తే మరో జాతి అనకొండ వాళ్ల కంటపడింది. ఇది 26 అడుగుల మరియు 200 కిలోల మేర బరువుంది. ఈ మేరకు శాస్త్రవేత్త విల్ స్మిత్‌ల బృందం రానున్న నాట్ జియాఓ సిరిస్ పోల్ టు పోల్ కోసం ఫోటో షూట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ క్కెడార్లోని అమెజాన్ నది అడుగు భాగంలో ఫోటోలు చిత్రిస్తుండగా ఈ అనకొండ కెమెరాకు చిక్కింది. ఆ సరికొత్త అనకొండను చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు ఇది ఇప్పటి వరకు చూసిన అనకొండ జాతులకు చెందిందా కాదా అనే దిశగా పరిశోధనలు చేశారు. దీన్ని చూసి ఇంతకుముందు కనిపెట్టిన ఆకుపచ్చ అనుకొండకు చెందిన మరోక జాతి ఏమో అనుకున్నారు. కానీ పరిశోధనలో వేర్వేరు జాతికి చెందినదని తేలింది. ఆక్కుపచ్చలో ఉండే అనకొండ జాతి ఎక్కువగా బ్రెటిజల్ , పెరూ, బొలీవియా, ఫ్రెంచ్ గయానాలలో నివశిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తించిన ఈ కొత్తజాతి అనకొండ తొమ్మిది దక్షిణ అమెరికా దేశాలలో బోవా గ్రూప్ సేకరించిన మిగతా అనకొండాల రక్తం, కణజాల నమూనాలతో సరిపోలలేదన్నారు. ఇది అనకొండలో కొత్త జాతిని నిర్థారించారు. దీనికి జెయింట్ అనకొండగా నామకరణం చేశారు. ఈ అనకొండ మరింత ప్రమాదకరమైనదని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. The world's largest snake has been discovered in the Amazon Rainforest: The Northern Green Anaconda measures 26 feet long and weighs 440 lbs - and its head is the same size as a human's. pic.twitter.com/XlaDk0qVYt — Denn Dunham (@DennD68) February 21, 2024 (చదవండి: శునకాల మధ్య పెరిగి ఆమె ఓ శునకంలా..ఇప్పటికీ..! మరో టార్జాన్, మోగ్లీ లాంటి కథ!) -
రాక్షస అనకొండ..అలా.. ఎలా సామీ: వైరల్ వీడియో
మామూలు పాము అంటేనే ఆమడ దూరం పారిపోతాం. ఇక అనకొండను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. వన్య ప్రాణ సంరక్షణ కార్యకర్తలు, జూ సంరక్షకులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. ఎంతటి క్రూర మృగాలైనా వాటిని మచ్చిక చేసుకుని, వాటితో స్నేహంగా ఉంటారు. కానీ ఒక భారీ అనకొండను నిర్భయంగా ఉత్తి చేతులతో అలా అలవోకగా, మేనేజ్ చేసిన వీడియో తాజాగా నెట్టింట్ సందడి చేస్తోంది. అతని అసాధారణ సాహసానికి, నైఫుణ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ విడియో వైరల్‌గా మారింది. ఫ్లోరిడాలోని మియామికి చెందిన జూ కీపర్ మైక్ హోల్స్టన్ Instagramలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. తనను తాను ది రియల్ టార్జాన్, ది కింగ్ ఆఫ్ ది జంగిల్ అని చెప్పుకునే హోల్స్టన్ తరచుగా వన్యప్రాణులకు సంబంధించిన చాలా ఆసక్తికరమైన వీడియోలను చాలా షేర్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా అలాంటిదే. నీటిలో దాగి వున్న ఈ భారీ అనకొండను జాగ్రత్తగా సమీపించి, మెల్లిగా వెళ్లి, చటుక్కున దాని తలను ఒడిసిపట్టుకోవడంతో ఈ వీడియో మొదలవుతుంది. సాధారణంగా అనకొండ ఎంత బలిష్టమైన వారినైనా తన పట్టుతో లొంగదీసుకుంటుంది. కానీ తన నైపుణ్యంతో బలీయమైన అనకొండను పట్టుకోవడం, దానిపై నియంత్రణ సాధించడం,చివర్లో దాని ముద్దు పుట్టుకోవడం విశేషంగా నిలిచింది. దీన్ని లొంగదీసుకున్న వైనం అందర్నీ షాక్‌కు గురిచేస్తుంది. ఈ వీడియోను ఆ సాంతం గుడ్లప్పగించి, ఉత్కంఠగా చూస్తారు. వాట్ యాన్ ఎక్స్పిడిషన్ వెనిజులాకు మాన్స్టర్ అనకొండను విజయవంతంగా పట్టుకున్నాం అనే క్యాప్షన్‌తో దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 5 రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో 11.2 మిలియన్లకు పైగా వ్యూస్‌లను సాధించింది. మూడు లక్షలకు కమెంట్లను సాధించింది. బహుశా ఈ గ్రహం మీద అత్యంత ధైర్యవంతుడు అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Mike Holston (@therealtarzann) Homie caught a huge anaconda! 👀 @therealtarzann Download the Topmixtapes app for Android to stay updated: https://t.co/vpyvPCzn45 Download the Topmixtapes app for iOS to stay updated: https://t.co/tk3g7a7reZ pic.twitter.com/1P7IH2YREb — TopMixtapes.com (@topmixtapescom) November 16, 2023 -
ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందుకు పంపిస్తున్నారంటే..
అనకొండ.. ఈ పేరు వినగానే మన మదిలో మనుషులను మింగివేసే అత్యంత భారీకాయం కలిగిన పాము కనిపిస్తుంది. దీనిని మనం తొలిసారి హాలీవుడ్ సినిమా ‘అనకొండ’లో చూసివుంటాం. అయితే మనం ఆ సినిమాలో చూసినది యానిమేషన్ అనకొండ. అయితే ఇప్పుడు మనం అలాంటి నిజమైన అనకొండ గురించి తెలుసుకోబోతున్నాం. వందేళ్ల వయసుగల ఆ అనకొండకు ఇప్పుడు సెలవులిచ్చి వేరే ప్రాంతానికి పంపిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అనకొండ ఎక్కడుందంటే.. ఈ అతిపెద్ద అనకొండ జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ఫర్ట్‌లోని సెన్కెన్బర్గ్స్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ మ్యూజియంలో ఒక అనకొండ కాపిబారా(జంతువు)ను మింగేస్తూ కనిపిస్తుంది. దానిని చూడగానే అది నిజమేనని అనిపిస్తుంది. మ్యూజియంలో మరమ్మతు పనులు జరుగుతున్నందున ఈ అనకొండకు కొంతకాలం సెలవులిచ్చారు. దానిని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. An exhibit of an anaconda devouring a capybara at the Senckenberg Natural History Museum in Frankfurt is undergoing restoration. Taxidermists say climate change is one of the reasons why it needs a makeover pic.twitter.com/KM1LataPZL — Reuters (@Reuters) July 6, 2023 ఈ మ్యూజియంలో ఇంకా ఏమి ఉన్నాయంటే.. ఈ మ్యూజియంలో ఈ అనకొండ మాత్రమే కాదు, వివిధ రకాల జీవుల శిలాజాలు కనిపిస్తాయి. అలాగే ఈ మ్యూజియంలో రకరకాల డైనోసార్లు కూడా ఉన్నాయి. We will be next. #ExtinctionRebellion #DieIn under dinosaurs at the @Senckenberg Natural History Museum in #Frankfurt, during the #MuseumsNight #ndmffm. @ExtinctionR @ExtinctionR_DE pic.twitter.com/jIlP4MOzJ8 — JuliaKrohmer (@JuliaKrohmer) May 12, 2019 అనకొండలో రకాలివే.. అనకొండ ప్రధానంగా నాలుగు రకాలు. ఇందులో గ్రీన్ అనకొండ, బొలీవియన్ అనకొండ, డార్క్ స్పాటెడ్ అనకొండ ఎల్లో అనకొండ ప్రముఖమైనవి. వీటిలో గ్రీన్ అనకొండలు అతిపెద్దవి. పరిమాణంలో ఎంతో బరువైనవి. గ్రీన్ అనకొండలు ప్రధానంగా దక్షిణ అమెరికా ఖండం బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ, కొలంబియా, వెనిజులా, సురినామ్, గయానా దేశాలలో కనిపిస్తాయి. మగ, ఆడ అనకొండల పొడవు విషయానికి వస్తే ఆడ అనకొండ.. మగ అనకొండ కంటే పొడవుగా ఉంటుంది. @jsnell @imyke my thought when you spoke of the snail and the pig on Upgrade. My favorite exhibit as a kid in the natural history museum in Frankfurt pic.twitter.com/TkhOGYLGJZ — Jenni Brehm (@Pfenya) May 13, 2018 ఇది కూడా చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. -
అనకొండతో మొసలి జీవన పోరాటం.. వీడియో వైరల్
బ్రెసిలియా: అనకొండ పాములు భారీ ఆకారంతో పొడవుగా ఉంటాయి. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయి. గ్రీన్ అనకొండలు సుమారు 30 అడుగుల మేర పెరుగుతాయి. సుమారు 550 పౌండ్ల బరువు ఉంటాయి. ఏదైనా జీవిని వేటాడేందుకు దానిని పూర్తిగా చుట్టేసి చంపేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ భారీ ఎలిగేటర్(మొసలి)ని భారీ అనకొండ బంధించింది. మొసలికి ఊపిరిసలపకుండా చేసి ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ సంఘటన బ్రెజిల్లో జరిగింది. అనకొండ బారినుంచి తప్పించుకునేందుకు ఎలిగేటర్ చేసిన ప్రయత్నాన్ని ఇండియానాకు చెందిన కిమ్ సులివాన్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కుయాబా నదిలో మొసలి, అనకొండలు పోరాడాయి. సుమారు 40 నిమిషాల పాటు వాటి పోరాటం సాగినట్లు కిమ్ తెలిపారు. పూర్తిగా చుట్టేయటం వల్ల ఎలిగేటర్ ఊపిరితీసుకునేందుకు ఇబ్బందులు పడింది. పాము నుంచి తప్పించుకునేందుకు మొసలి నీటి అడుగునకు వెళ్లిందని, దాంతో పాము గాలి తీసుకోలేకపోయిందని చెప్పారు. కొద్ది సమయం తర్వాత మొసలి బయటకు వచ్చిందని, అయినప్పటికీ అనకొండ వదలకుండా అలాగే పట్టినట్లు చెప్పారు కిమ్. దీంతో మరోసారి మొసలి నీటి అడుగుకు చేరుకుని కొన్ని నిమిషాల తర్వాత పైకి వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో అనకొండ కనిపించలేదన్నారు. ఊపిరి పీల్చుకున్న మొసలి తన చోటుకు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ వీడియోను ఆఫ్రికా వైల్డ్‌లైఫ్1 తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Wildlife | Africa | Lodges | Photography | Videography (@africanwildlife1) ఇదీ చదవండి: వీడియో: క్రేన్‌కు భారీ ‘రాకాసి’ చేప.. విలయం తప్పదంటూ వణుకుతున్న జనాలు -
లక్కీ ఫెలో.. అనకొండ దాడిలో జస్ట్ మిస్ అయ్యాడు
పామును చూస్తేనే ఒక్కసారిగి భయాందోళనకు గురవుతుంటాము. అలాంటిది ఏకంగా భారీ అనకొండ నుంచి ప్రాణాలకు కాపాడుకోవడమంటే మాములు విషయం కాదు. కాగా, ఓ వ్యక్తి అదృష్టవశాత్తు అనకొండ నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. బ్రెజిల్‌కు చెందిన గైడ్ జోవో సెవెరినో(38).. అనకొండ దాడిలో తన ప్రాణాలను కోల్పోకుండా తృటిలో తప్పించుకున్నాడు. కాగా, జోవో సెరియన్.. అరగుయా నదిలో పర్యాటకుల బృందంతో విహారయాత్రలో ఉన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు చుట్టుప్రక్కల ప్రాంతాలను ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో సెవెరినోకు నదిలోని నీటిలో ఉన్న గ్రీన్ అనకొండ కనిపించడంతో సరదాగా వీడియో తీశాడు. అదే సమయంలో అదును చూసి అనకొండ అతడిపై దాడి చేసే క్రమంలో కాటు వేసింది. ఈ క్రమంలో తృటిలో పాము నుంచి అతను తప్పించుకున్నారు. దీంతో పడవలో ఉన్న ప్రయాణీకులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక, గ్రీన్ అనకొండ.. 30 అడుగుల పొడవు, 550 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. దక్షిణ అమెరికాకు చెందిన గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాము. కాగా, నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, మగ గ్రీన్ అనకొండ కంటే.. ఆడ అనకొండలు చాలా పెద్దవిగా ఉంటాయి. సాధారణంగా ఇవి.. చిత్తడి నేలలు, నెమ్మదిగా కదులుతున్న ప్రవాహాలలో, ప్రధానంగా అమెజాన్ బేసిన్‌లోని ఉష్ణమండల వర్షారణ్యాలలో నివసిస్తాయి. View this post on Instagram A post shared by João Severino (@lavaginha_) ఇది కూడా చదవండి: రైల్వే ట్రాక్‌పై ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు.. వీడియో వైరల్ -
సిగ్గెక్కువ.. కానీ, కాటేస్తే వందమంది ఖతం!
ఈ భూమ్మీద సమస్త జీవరాశుల్లో సర్పాలు ఉన్నాయి. కానీ, మనుషుల భయాలు, అపోహలతో వాటి జనాభా తగ్గిపోతూ వస్తోంది. ఇది ఎంతవరకు సరైందన్నది పక్కనపెడితే.. చాలామందిలో చెడును చెప్పడానికి ‘పాములాంటోడు’ అని వర్ణిస్తుంటారు. కానీ, అవి అంత ప్రమాదకరమైనవి మాత్రం కావు. ఈ భూమ్మీద దాదాపు 4 వేల జాతుల దాకా పాములు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తగా కనుగొంటూ పోతున్నారు. ఈ మొత్తంలో 650కి(25 శాతం) పైగా జాతులు మాత్రమే విషపూరితమైనవని సైంటిస్టులు ఇప్పటిదాకా(జులై 7 రిపోర్ట్ ప్రకారం) గుర్తించారు. అందులోనూ 200 జాతుల(10 శాతం) పాముల నుంచి మాత్రమే మనిషికి ముప్పు ఉంటోందని తేల్చారు. కానీ, అవేం పట్టించుకోకుండా కనిపిస్తే చంపేస్తూ.. వాటి జనాభాను తగ్గించేస్తున్నారు. అందుకే వాటి పరిరక్షణ కోసం, పాములన్నీ ప్రమాదకరమైనవి కాదని జనాల్లో అవగాహన కల్పించాలని.. అందుకోసం ఓ రోజు ఉండాలని జులై 16న వరల్డ్ స్నేక్ డే ను నిర్వహిస్తున్నారు కొందరు(స్నేక్ సొసైటీలు). ప్రతీ ఏడాది ఇదే థీమ్‌తో ముందుకు సాగుతున్నారు. వాసన కోసం నాలిక పాములకు చూపు సామర్థ్యం చాలా తక్కువ. చెవుల్లేకున్నా వినికిడి శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది. పాము కింది దడవలో ఉన్న ఎముకలు శబ్దతరంగాలను పసిగడతాయి. కానీ, వాసన విషయంలో మాత్రం గొప్ప సామర్థ్యం కలిగి ఉంటాయి. అవి నాలుకతోనే వాసనను పసిగడతాయి. అందుకే ఎప్పుడూ అవి నాలికను అలా బయటకు ఆడిస్తుంటాయి. అత్యంత విషపూరితమైనవి విషానికి ప్రాథమిక కొలమానం ఎల్డీ 50. లెథాల్ డోస్ 50 పర్సంట్ టెస్ట్ అని పిలుస్తారు దీన్ని. ఈ పద్దతిలో పాముల విషాన్ని పరిశీలించే.. అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాముల జాబితాను సిద్ధం చేస్తుంది ఇంటర్నేషనల్ స్నేక్ సొసైటీ. ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్.. ఆస్ట్రేలియాలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాము జాతి. దీని విషం నిమిషాల్లో మనిషిలో అంతర్గతంగా రక్త స్రావం అయ్యేలా చేస్తుంది. కిడ్నీలను పాడు చేస్తుంది. ఒక్కోసారి మెదడుకు చేరి పక్షవాతాన్ని కలగజేస్తుంది. చివరికి రక్తం గడ్డకట్టేలా చేసి మనిషి ప్రాణం తీస్తుంది. టైగర్ స్నేక్ ఎలాపిడ్ జాతికి చెందిన టైగర్ స్నేక్ పాములు కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే కనిపిస్తాయి. ఒంటిపై ఉండే మచ్చల కారణంగా వాటికి టైగర్ స్నేక్ అనే పేరొచ్చింది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ.. అరగంటలో మనిషి మరణానికి కారణం అవుతుంటాయి. టైగర్స్నేక్స్ విషం నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపెడుతుంది. కండరాల్లో రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. కోబ్రా తరహాలో పడగ విప్పి.. భయపెడుతుంది. ఇన్‌ల్యాండ్ టైపాన్ ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైన పాము ఇది(అనధికారికంగా). వంద గ్రాముల విషంతో వంద మందిని చంపగలిగే సామర్థ్యం ఉన్న పాము ఇది. వంద గ్రాముల విషాన్ని ఒకే కాటుతో దింపగలదు ఇది. కానీ, ఎల్డీ50 ప్రకారం(త్వరగా ప్రాణం తీసే లెక్కప్రకారం).. లిస్ట్ వల్ల మూడో ప్లేస్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషం ప్రభావంతో గంటలో ప్రాణం పోవడం ఖాయం. ఇవి జనారణ్యానికి దూరంగా ఏకాంతంగా బతుకుతాయి. ఈ పాముకి ‘సిగ్గు’ ఎక్కువ అని అంటుంటారు. మనుషులను చూస్తే.. ఇవి వేగంగా పాక్కుంటూ వెళ్లి ఓ మూల దాక్కుంటాయి. అలా ఈ డేంజర్ స్నేక్కు ‘సిగ్గున్న పాము’గా ముద్దు పేరు వచ్చింది. రస్సెల్స్ వైపర్ ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పాము జాతిగా పేరుంది రస్సెల్స్ వైపర్‌కి. అంతేకాదు ఎక్కువ మరణాలకు కారణమైన జాతి కూడా ఇదే. దీనిని గుర్తించడం కూడా చాలా తేలిక. భయంతో ఉన్నప్పుడు అది గట్టిగా శబ్దం చేస్తుంటుంది. కాటు వేసిన మరుక్షణం నుంచే విషం శరీరంలోకి ఎక్కేస్తుంటుంది. ఒక్క రస్సెల్స్ వైపర్ గక్కే విషంతో లక్షా యాభై వేల ఎలుకలను చంపొచ్చనేది సైంటిస్టుల మాట. బ్లూ క్రాయిట్ ఆసియాలో ప్రమాదకరమైన పాముల్లో దీని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. దీని విషయం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది. చికిత్స అందినా సగం మంది చనిపోతుంటారు. అంత ప్రమాదకరమైంది ఈ పాము విషం. ఇవి విషపూరితమైన పాముల్నే ఆహారంగా తీసుకుంటాయి. జనసంచారానికి దూరంగా పగటి పూట పచ్చిక బయళ్లలో, అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి ఇవి. బూమ్స్లాంగ్ క్లౌబ్రిడ్ కుటుంబంలో అత్యంత విషపూరితమైన పాము జాతి ఇది. రంగు రంగుల్లో ఉంటాయి ఇవి. విషం అంత విషపూరితమైనది కాకపోయినా.. రక్తస్రావం కారణంగా ప్రాణం పోతుంటుంది. అందుకే ప్రమాదకరమైన పాముల లిస్ట్‌లో చేర్చారు. అయితే ఇవి మనుషులు కనిపిస్తే.. దూరంగా వెళ్లిపోతుంటాయి. ఇవి దాడులు చేసే సందర్భాలు చాలా తక్కువ. చెట్ల మీద ఉంటూ పక్షుల్ని, పురుగులని తింటాయి. మోజావే రాటెల్స్నేక్ అమెరికా నుంచి పాము జాతుల్లో అత్యంత విషపూరితమైన లిస్ట్‌లో ఫస్ట్ కనిపించేది ఇదే. రక్తం, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది దీని విషం. నైరుతి అమెరికా పప్రాంతంలో ఎక్కువ మరణాలు సంభవించేది ఈ పాముల వల్లే. స్టిలెట్టో స్నేక్ పరిణామంలో చిన్నగా ఉండి, కలుగుల్లో దాక్కునే పాము ఇది. కానీ, విషపూరితమైంది. అయితే అదృషవశాత్తూ ఇది ఎక్కువ విషాన్ని కక్కదు. కానీ, దీని విషం ఎంత ప్రమాదకరమంటే.. కణజాలాన్ని దెబ్బ తీయడంతో పాటు గుండె పనితీరును స్తంభింపజేస్తుంది. అంతేకాదు వీటిని పట్టడం కూడా అంత ఈజీ కాదు. కోరలు కూడా విచిత్రంగా వంగి ఉంటాయి. కాబట్టి, నేరుగా కాకుండా వంగి మరీ కాటు వేస్తుంది స్టిలెట్టో. సా స్కేల్డ్ వైపర్ ఇది అంత విషపూరితమైన పాము కాదు. కానీ, ప్రమాదకరమైన జాతిలో ఒకటి. భారత్ తో సహా చాలా దేశాల్లో ఇవి కనిపిస్తుంటాయి. చిన్నసైజులో ఉన్నప్పటికీ అగ్రెసివ్‌గా ఇవి దాడులు చేస్తాయి. వైపర్ జాతి పాముల్లాగే రక్తం గడ్డకట్టించి చంపుతాయి. అయితే విరుగుడు వెంటనే ఇవ్వకపోతే బతకడం కష్టం. ఇసుకలో దాక్కుని వేటాడుతుంటాయి. ఒకవేళ దగ్గరగా వెళ్లాలని ప్రయత్నిస్తే.. గట్టిగా శబ్ధం చేస్తూ భయపెడుతుంటాయి. కింగ్ కోబ్రా విషానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ జాతి. అత్యంత పొడవైన విషపూరితమైన పాము కింగ్ కోబ్రా. పైన చెప్పుకున్నంత రేంజ్లో వీటిలో విషం లేకపోయినా.. ఎక్కువ పరిమాణంలో విషం చిమ్మడం, కాటు వేయడంతో పాటు రూపంతోనే భయపెట్టేస్తుంటాయివి. ఇక ఆడ పాము గూడుకట్టి గుడ్లు పెట్టాక.. మగపాముతో కలిసి కాపలా కాస్తుంటుంది. వీటితో పాటు కోస్టల్ టైపాన్, బాండెడ్ క్రాయిట్, కామన్ డెత్ ఆడర్, సముద్రంలో ఉండే బీక్డ్ సీ స్నేక్, ఆఫ్రికన్ డేంజరస్ స్నేక్ జాతి ‘బ్లాక్ మాంబా’, చైనీస్ కోపర్హెడ్, సౌత్ అమెరికన బుష్‌మాస్టర్, ఫర్ డె డాన్స్, బెల్చర్స్ సీ స్నేక్, బ్లూ మలయన్ కోరల్ స్నేక్.. ఆ తర్వాతి స్థానాలో ఉన్నాయి. ఇక వీటితో పాటు విషం లేని బుక్స్నేక్(నార్త్ అమెరికా, అమెరికా), కొండ చిలువ జాతికి చెందిన పాములు, జెనస్ యూనెక్టస్కు చెందిన వాటర్ బోస్(అనకొండ) కూడా ఈ భూమ్మీద ఉన్నాయి. అదృష్టం అంటే దీనిదే.. చాలాకాలం కిందట వైరల్ అయిన వీడియో ఇది How could we dedicate #WorldSnakeDay to anything else? 🐍#PlanetEarth2 pic.twitter.com/B4YxSxqmvm — BBC Earth (@BBCEarth) July 16, 2018 "I'm asking you to respect these creatures, because they have a right to be on Earth, the same way we do." We know many of you may be scared of snakes but it's #WorldSnakeDay, so we asked the 'Snake Man of Lagos' - Dr Mark Ofua - why it's so important we protect them. 🐍 pic.twitter.com/DgWc12NvoS — BBC News Africa (@BBCAfrica) July 16, 2019 -
జాగ్వార్ Vs అనకొండ.. భయంకర వీడియో!
అనకొండ, బ్లాక్ పాంథర్(నల్ల చిరుతపలి) మధ్య ఫైట్ జరుగుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఇది 2013లోనే బయటకొచ్చిన వీడియో. అయితే అమెరికాలోని ఓ వ్యక్తి ఇటీవల ట్విటర్లో పోస్టు చేయడంతో ఈ వీడియో మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దక్షిణ అమెరికాలోని గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాము. అదే విధంగా జాగ్వార్ విషయానికొస్తే అమెరికాలోనే ఇది పెద్ద పిల్లి. ఈ రెండు తమ బలాన్ని నిరూపించుకునేందుకు తలపడితే ఆ దృశ్యాలు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో ఉంది. ఇందులో ఈ రెండు భయంకరంగా పోరాడుతూ.. నీటిలోకి, నేల మీదికి లాక్కుంటూ వేటికవే తమ బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. చదవండి: నెవెర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ ఫైట్ సీన్! ఈ వీడియోలో మెలనిస్టిక్ జాగ్వార్ దీనినే బ్లాక్ పాంథర్ అని కూడా పిలుస్తారు. ఇది భారీ అనకొండను నీటి నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది. అయితే పాము మాత్రం బ్లాక్ పాంథర్నుంచి తప్పించుకునేందుకు నీటిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ అనకొండను వదలకుండా పట్టు బిగిస్తూ భూమి మీదకు లాగుతోంది. మరి ఈ పోరాటంలో ఎవరిది పై చేయి సాధించిందనేది తెలియలేదు. దీనిని చూసిన నెటిజన్లు.. జాగ్వార్ అద్భుతంగా పోరాడిందని, వీడియో భయంకరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ అనకొండలు ప్రపంచంలోనే అత్యంత భారీ పాములలో ఒకటి. అంతేగాక 130 కిలోల వరకు బరువు కలిగి ఉంటాడి. వీటికి నీటిలో వేగం అమితంగా ఉంటుంది. అయితే భూమిపై వీటి బలం తక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ నీళ్లున్న ప్రదేశాల సమీపంలోనే ఎక్కువగా నివసిస్తుంటాయి. Registro raríssimo de uma onça-pintada lutando com uma sucuri. pic.twitter.com/bQPGu9Cutn — Biodiversidade Brasileira (@BiodiversidadeB) January 5, 2021 -
అనకొండకు చిక్కి.. ప్రాణాల కోసం విలవిల
జకార్తా : ప్రపంచ వ్యాప్తంగా మనుషులు అనకొండకు ఫలహారమైన ఘటనలు చాలానే ఉన్నాయి. అనవసరంగా ఇవి మనుషుల్ని చంపకపోయినా.. అవకాశం దొరికినప్పుడు మాత్రం వదలవు. 15-20 అడుగుల పొడవున్న అనకొండలు సులభంగా మనల్ని మింగేయగలవు. ఓ సారి దాని పట్టుకు చిక్కామంటే విడిపించుకోవటం బ్రహ్మకష్టమే. తాజాగా ఓ ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి భారీ అనకొండకు చిక్కాడు. దాని నుంచి విడిపించుకోవటానికి విశ్వప్రయత్నం చేశాడు. అయితే అతడి ఒక్కడి వల్ల కాలేదు. ( వైరల్: మొసలిని చుట్టేసిన భారీ అనకొండ) అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడికి సహాయంగా వచ్చారు. దాన్ని పక్కకు లాగి అతడ్ని కాపాడాలనుకున్నారు. వారికి కూడా అది కష్ట సాధ్యంగా మారింది. ఎలాగైతేనేం తీవ్రంగా ప్రయత్నించి పామునుంచి అభాగ్యుడ్ని రక్షించగలిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
వైరల్ వీడియో.. నిజం తెలిస్తే షాకవుతారు
ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం పెరిగాక సమాచారం క్షణాల్లో తెలిసిపోతుంది. అయితే నిజమో కాదో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్లో కనిపించే ప్రతీది వాస్తవం కాదు. టెక్నాలజీ సాయంతో గోరంతను కొండంతలు చేసి.. మనల్ని వెర్ని వాళ్లని చేస్తుంటారు కొందరు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. దీనిలో సినిమాల్లో మాత్రమే కనిపించే భారీ సైజు అనకొండను ఎర వేసి పట్టుకున్నారు. ‘కోళ్ల దొంగను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ నీటి మడుగు బయట నీల రంగు డ్రమ్మును ఉంచారు. దాని ముందు కోడిని ఎరగా ఉంచారు. ఇంతలో నీటిలో నుంచి ఓ అనకొండను కోడిని మింగడానికి బయటకు వచ్చి డ్రమ్ములో దూరుతుంది. బయటకు రావడానికి మార్గం లేక గిజగిజా తన్నుకుంటుంది. ఇక వీడియోలోని అనకొండను చూస్తే భయం, ఆశ్చర్యం రెండు ఒకేసారి కలుగుతాయి. ఎందుకంటే ఇంత పెద్ద అనకొండను సినిమాల్లో తప్ప రియల్‌గా చూసి ఉండరు. 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోని 24 గంటల వ్యవధిలో 1.2మిలయన్ల మంది వీక్షించారు. (జాగ్రత్త! చావుతో ఆడుకుంటున్నావ్) ఇక ఈ వీడియో నిజమా కాదా తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ‘స్నోప్స్’ రంగంలోకి దిగింది. తన పరిశోధనలో తేలింది ఏంటంటే.. ఇది మానిప్యులేటెడ్ వీడియో. అంతేకాక ఇది రెండు సంవత్సరాల క్రితం నాటిది అని తేల్చేసింది. ఇక ఒరిజనల్ వీడియోలో కనిపించే పాము కూడా పెద్దదే కానీ మరీ అనకొండంత భార సైజుది మాత్రం కాదు. అలానే నీలం రంగు పైపుని కూడా భారీ డ్రమ్ముగా మార్చారు. I thought the snake in anaconda was an exaggeration, then i saw this video https://t.co/PmL1qJ2fzP — Tony Digs (@ToneDigz) July 20, 2019 -
వైరల్: మొసలిని చుట్టేసిన భారీ అనకొండ
బ్రసిలియా: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం. భారీ అనకొండ మొసలిని చుట్టేసి మింగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని కండొమినియంలో గతవారం చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన ఓ సంస్థ ఈ వీడియోను శుక్రవారం షేర్ చేసింది. ఈ ట్వీట్లో దాదాపు ఆరడుగుల పొడవు ఉన్న అనకొండ మొసలిని పూర్తిగా చుట్టేసినట్లు కనిపిస్తోంది. అది గమనించిన స్థానికులు తాడుతో ఆ రెండింటిని విడిపించే ప్రయత్నం చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటివరకు వేల్లో వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. (చదవండి: షాకింగ్ వీడియో: ‘నువ్వు నిజంగా మూర్ఖుడివి’) ‘ఇది ప్రకృతి సహజం.. ‘అనకొండ, ఎలిగేటర్‌ను మింగడం వాటి ఆహార గొలుసులో భాగం’, ‘అనకొండ దాని పని అది చేసుకుంటుంది’, ‘ప్రజలు ప్రకృతిని గౌరవించడం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక దీనిపై స్థానిక వ్యక్తి వివరణ ఇస్తూ.. ‘అనకొండ దాదాపు 6 అడుగుల పొడవు ఉంది. అది మొసలిని మింగుతుంటే కొంతమంది కలిసి తాడుతో రెండింటిని విడదీశాము. అనంతరం ఈ రెండు సరిసృపాలు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయాయి’ అని చెప్పుకొచ్చాడు. (చదవండి: ఆవును హెలికాప్టర్లో ఇంటికి చేర్చిన రైతు) Ê CAROÇO! 😳 Uma sucuri foi flagrada tentando engolir um jacaré na área de um condomínio na Ponta Negra. 🐍🐊 pic.twitter.com/d3JlCQm3Ey — Manaus POP A 911🏳️🌈 (@manaus_pop) August 17, 2020 -
జాగ్రత్త! చావుతో ఆడుకుంటున్నావ్
బ్రెజీలియా : అనకొండ తోక పట్టుకులాగితే ఏమౌతుంది? దానికి కోపం వస్తే మన ప్రాణం గాల్లో కలిసి పోతుంది. అదంతా ఎందుకు దాన్ని దూరం నుంచి చూడగానే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది దాని తోక పట్టుకోవటమా.. అసాధ్యం అనుకుంటున్నారా?. కానీ కొంతమంది మాత్రం అనకొండతో డెత్ గేమ్స్ ఆడుతున్నారు. చాలా కాలం క్రితం బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి నదిలో పడవలో వెళుతుండగా నీటిలో ఓ పెద్ద అనకొండ కనిపించింది. దాని పొడవు దాదాపు 17 అడుగులు ఉంటుంది. అది తలుచుకుంటే మనిషిని అమాంతం మింగేయ గలదు. అలాంటి అనకొండ తన మానాన తను నీళ్లలో ఉంటే.. ఆ వ్యక్తి దాని తోక పట్టుకు లాగడం ప్రారంభించాడు. ( అనకొండ, మొసలి భీకర పోరాటం..) దీంతో అది ఏం జరుగుతోందో అర్థం కాక తప్పించుకోవటానికి తెగ ప్రయత్నించింది. కొద్దిసేపటి తర్వాత సదరు వ్యక్తి దాన్ని విడిచిపెట్టడంతో సర్రున అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో 2014 ప్రాంతానికి చెందినదైనా ప్రస్తుతం మళ్లీ వైరల్‌గా మారింది. ఈ వీడియోను కొత్తగా చూస్తున్న నెటిజన్లు.. ‘‘ అనకొండలతో ఆడుకోవటం ప్రమాదం: ఇది చిన్నపిల్లలకు కూడా తెలుసు... జాగ్రత్త! చావుతో ఆడుకుంటున్నావ్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ‘అది ఫొటోషాప్ ఇమేజ్.. నిజం కాదు’) -
జాగ్రత్త! చావుతో ఆడుకుంటున్నావ్
-
‘అది ఫొటోషాప్ ఇమేజ్.. నిజం కాదు’
ప్రపంచంలో అతిపెద్ద అనకొండను సంహరించినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ సర్పాన్ని అమెజాన్ నదిలో గుర్తించారు.. ఇది 257 మంది మానవులను, 2325 జంతువులను చంపింది. 134 అడుగుల పొడవు, 2067 కిలోల బరువు కల్గిన ఈ సర్పాన్ని ఆఫ్రికా రాయల్ బ్రిటిష్ కమాండోలు చంపడానికి 37 రోజులు పట్టింది’ అంటూ ఫేస్బుక్ యూజర్ షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ (AFWA) ఈ వాదన తప్పని తేల్చింది. ఈ వైరల్ ఇమేజ్ ని ఫోటోషాప్తో రూపొందించినట్లు తెలిపింది. అదే విధంగా అమెజాన్ నది దక్షిణ అమెరికాలో ఉన్న విషయాన్ని కూడా ఎవరూ గుర్తించకుండా వైరల్ చేశారని పేర్కొంది. కాగా అమెజాన్ నది ఒడ్డన 134 అడుగుల ఎత్తు, 2067కిలోల బరువు కలిగి ఉన్న ఓ అనకొండ అంటూ ఫేస్బుక్ యూజర్ రమాకాంత్ కజారి 2015లో దీనిని పోస్ట్ చేశారు. అయితే ఇప్పటికి ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటం గమనార్హం. కాగా, ఈ సర్పాన్ని చంపినట్లుగా చలామణీ అవుతున్న ఆఫ్రికా రాయల్ బ్రిటిష్ కమాండో అనే సంస్థ ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లభించ లేదు. ఇక నేషనల్ జియోగ్రఫీ వివరాల ప్రకారం... 30 అడుగుల పొడవు ఉండే గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతి పొడవైనది. ఇదిలా ఉండగా ఈ సర్పానికి సంబంధించిన ఫేక్పోస్ట్ ఇప్పటి వరకు 1,24,000సార్లు సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. -
అనకొండ, మొసలి భీకర పోరాటం..
సాక్షి, న్యూఢిల్లీ : బ్రెజిల్ దక్షిణ ప్రాంతంలోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో కార్చిచ్చు రగులుకుందంటూ ఇటీవల వచ్చిన వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ దావానలాన్ని కవర్ చేయడానికి వెళ్లాడేమోగానీ ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ కేవిన్ డూలే (58) ఇటీవల అమెజాన్ అడవిలో పెంటానల్ వద్ద మొసళ్ల మడుగు పక్కన కూర్చొని భోంచేస్తున్నారు. ఇంతలో ఆ మడుగు నుంచి భారీ శబ్దం వచ్చింది. అటు తల తిప్పి చూడగా ఓ భారీ అనకొండ, ఓ మొసలి భీకరంగా పోరాడుతూ కనిపించాయి. డూలే వెంటనే భోజనం తినడం ఆపేసి.. ఆ జంతువుల భీకర పోరాటాన్ని కెమేరాలో బంధించేందుకు ప్రయత్నించారు. పసుపు పచ్చ శరీరంపై నల్లటి చారికలు గల అనకొండ ఏకంగా 28 అడుగుల పొడవు ఉందట. సాధారణంగా ఆ అడవిలో ఆ ప్రాంతంలో అనకొండలు 30 అడుగుల వరకు పొడగు ఉంటాయట. వాటి బరువు 250 కిలోల వరకు ఉంటుందట. నీటిలో ఆ రెండు జంతువులు కూడా చాల బలమైనవే. మొసలిని చుట్టిన అనకొండ నీటిలో మెలికలు తిరిగుతూ మొసలి రెండు కాళ్లను బలంగా విరిచివేసింది. దాంతో ఒక్కసారిగా కోపం, బాధతో మెలికలు తిరిగిపోయిన మొసలు ఒక్కసారి అనకొండ మెడ అందిపుచ్చుకొని కొరికిందట. అయినా లాభం లేకపోయింది. అనతికాలంలోనే మొసలి చనిపోయింది. ఎనిమిది నిమిషాల సేపు కొనసాగిన ఈ భీకర పోరాటంలో అనకొండ గెలిచినప్పటికీ అలసిపోయి నీటిలో మునిగిపోయిందని ఫొటోగ్రాఫర్ డూలే తెలిపారు. తన వృత్తిలో ఇలా అనకొండ, మొసలి పోరాటాలను ఒకటి, రెండు సార్లు మాత్రమే చూశానని, ఈసారి తనకు అదష్టం కలిసి రావడం వల్ల అతి దగ్గరి నుంచి ఆ దశ్యాలను చూడడమే కాకుండా తన కెమేరాలో ఆ దృశ్యాలను బంధించగలిగానని డూలే మీడియాకు వివరించారు. ఇంతకు ఈ రెండు జంతువుల్లో ఏదీ ముందుగా దాడి చేసిందని ప్రశ్నించగా, తాను చూసేటప్పటికే వాటి మధ్యం భీకర పోరాటం ప్రారంభమైందని, మొసలి రెండు కాళ్లను అనకొండ ముందుగానే విరిచేసినందువల్ల మొసలే అనకొండపై ముందుగా దాడి చేసి ఉంటుందని ఆయన చెప్పారు. సాధారణంగా అనకొండలు తాను వేటాడాలనుకొన్న జంతువు, ఊపిరాడకుండా తన శరీరంతో భిగించి చంపేస్తుందని, ఆ తర్వాత దాని భాగాలను నమిలి విరిచేస్తుందని ఆయన అన్నారు. ఇక్కడ మొసలిని ఊపిరాడకుండా నలిపేసి చంపడం కన్నా ముందే దాన్ని కాళ్లను, ఆ తర్వాత చేతులను విరిచేసిందంటే కచ్చితంగా మొసలే ముందుగా దాడి చేసి ఉంటుందని ఆయన అన్నారు. సాధారణంగా పందులు, జింకలు, చేపలతోపాటు చిన్న చిన్న జంతువులను తినే అనకొండలు అప్పడప్పుడు మొసళ్లను తింటాయట. -
జెయింట్ గ్రీన్ అనకొండ.. వీడియో వైరల్
-
జెయింట్ గ్రీన్ అనకొండ.. వీడియో వైరల్
భారీ సైజులో ఉన్న అనకొండ రోడ్డుపైకి వచ్చింది. దీంతో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మూడు మీటర్ల పొడవు, 30 కిలోల బరువున్న గ్రీన్ అనకొండ ఇటు అటునుంచి రోడ్డును క్రాస్ చేసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తెగ వైరల్అవుతోంది. బ్రెజిల్‌లోని పోర్టో వెల్‌లో వాసులకు ఆ దృశ్యాన్ని చూసే అరుదైన అవకాశం చిక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా భావించే ఈ గ్రీన్ అనకొండ రోడ్డుకు ఒకవైపున వున్న పొదల్లోంచి బయటికొచ్చి, మరోవైపున వున్న పొదల్లోకి వెళ్లిపోయింది. అలా అది పెద్ద రహదారిని దాటుతుండటం గమనించిన కొంతమంది సెల్ఫీలు దిగితే.. ఇంకొంతమంది అలాగే షాక్ అయిపోయి అది రోడ్డు దాటి వెళ్లే వరకూ అలా చూస్తుండిపోయారు. అయితే ఆహారం కోసమే అది అలా రోడ్డుమీదికి వచ్చి వుంటుందని నిపుణులు భావిస్తున్నారు. -
వైరలవుతున్న అనకొండ గుడ్లు...?
కశ్మీర్ : గత కొన్ని రోజులుగా కశ్మీర్లో ‘అనకొండ గుడ్లు’ అనే వార్త తెగ హల్చల్ చేస్తోంది. అవును ‘అనకొండ గుడ్ల’ గురించే కశ్మీర్ ప్రజలు ఇప్పుడు తెగ చర్చించుకుంటున్నారు. వివరాల ప్రకారం కొన్ని రోజుల క్రితం కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఒక అనుమానాస్పద బ్యాగ్ వెలుగు చూసింది. ఆ బ్యాగ్ మీద ‘అనకొండ గుడ్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిసెర్చ్, బ్రెజిల్’ అని రాసి ఉంది. అంతే కాక ‘జాగ్రత్తగా తెరవండి...చల్లని ప్రదేశంలోనే ఉంచండి, లేదంటే గుడ్లు పొదిగే ప్రమాదం ఉంది’ అని రాసి ఉంది. ఈ బ్యాగ్ కనిపించడంతో ఇన్ని రోజులుగా పుల్వామా ప్రజలను వేధిస్తున్న ఒక ప్రశ్నకు సమాధానం కూడా దొరికినట్లయ్యింది. అదేంటంటే ఎన్నడు లేనిది కొన్నాళ్లుగా పుల్వామా జిల్లాలోని పొలాల్లో పాముల సంచారం పెరిగినట్లు స్థానికులు గుర్తించారు. దాంతో ఈ అనకొండ గుడ్లు పొదగడం వల్లే పాముల సంఖ్య పెరుగుతుందనే నిర్ణయానికి వచ్చారు స్థానికులు. అయితే కశ్మీర్ వైల్డ్ లైఫ్ డిపార్టమెంట్ అధికారులు మాత్రం ‘మాకు ఈ ప్రాంతంలో ఇంతవరకూ ఒక్క పాము కూడా కనిపించలేదు’ అని తెలిపారు. అంతేకాక ‘పాములు కనిపించడం అనేది కొత్త విషయం ఏమి కాదు. పాములనేవి ఎప్పుడైనా, ఎక్కడైనా కన్పిస్తాయి. కానీ అనకొండ గుడ్ల వల్లనే పాముల సంఖ్య పెరిగిందనడం కాస్తా ఆశ్చర్యం కలిగించే అంశమే కాక అవాస్తవం కూడా. ఎందుకంటే అనకొండ గుడ్లు పెట్టదు. స్వయంగా పిల్లలను కంటుంది’ అని తెలిపారు అధికారులు. అంతేకాక కొండ చిలువలు కూడా భారీ సైజులో ఉండటంతో జనాలు వీటినే అనకొండలుగా భావిస్తున్నారని తెలిపారు. ఇంతా జరిగినప్పటికి ఆ బ్యాగ్ ఎక్కడి నుంచి వచ్చింది, దానిలో ఉన్నవి ఏంటి అనే విషయం ఇంతవరకూ తెలియరాలేదు. ఈ విషయం గురించి నెటిజన్లు రకరకాల కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. ‘38 డిగ్రిల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో అనకొండలు బతకలేవు...చనిపోతాయి. అంతేకాక అనకొండలు ఎక్కువగా నీటిలోనే ఉంటాయి. కశ్మీర్ నదులు ఎప్పుడు గడ్డకట్టే ఉంటాయి కాబట్టి అక్కడ అనకొండలు బతికే అవకాశమే లేదు’ అని కామెంట్ చేయగా మరి కొందరు ‘అనకొండలు గుడ్లు పెట్టవు...ఒకవేళ పెట్టినా అవి పొదగాలంటే చాలా అధిక ఉష్ణోగ్రతలు కావాలి. కాబట్టి కశ్మీర్‌లాంటి ప్రాంతంలో ఆ గుడ్లు పొదిగే అవకాశమే లేదు’ అని పోస్టు చేశారు. -
పాముల పుట్టలో తలపెట్టిన షేన్‌వార్న్!
సిడ్నీ: చీమ చీమ మా పిల్లాడిని ఎందుకు కుట్టావ్ అంటే.. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట. ఇది మనందరికీ బాగా తెలిసిన కథ. మరి ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ కూడా ఇలాగే సరదా పడ్డాడు. కానీ.. షేన్ వార్న్ పెట్టింది చీమలో పుట్టలో కాదు, పెట్టింది వేలూ కాదు. ఏకంగా పాముల 'పుట్ట'లో తల దూర్చాడు. మరి అది ఊరుకుంటుందా? ఏం చేసిందో చూద్దామా... ఆస్ట్రేలియాలో నెట్ వర్క్ టెన్ నిర్వహించిన ఓ రియాల్టీ షోకు వార్న్ హాజరయ్యాడు. అక్కడికి సెలబ్రిటీ హోదాలో వెళ్లిన వార్న్.. అనకొండలతో ఓ టాస్క్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే అనకొండలున్న పెట్టెలో తలదూర్చాడు. ఇందులో ఒక అనకొండ వార్న్ తలపై కాటు వేసింది. అయితే ఈ విషయంలో వార్న్ అదృష్టం బాగుందనే చెప్పాలి. అది విషపూరితం కాకపోవడం, మరీ పెద్దగా కాటేయకపోవడంతో.. తలపై చిన్నచిన్న గాట్లు మాత్రమే పడ్డాయి. అదే గట్టిగా కాటేస్తే.. సుదీర్ఘ కాలం పాటు చికిత్స చేయించుకోవాల్సి వచ్చేదట. కాగా, దీనిపై ఆ షో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టీఫెన్ టేట్ మాట్లాడుతూ..మనుషులు భయపడేవాటిలో సరీసృపాలు కూడా ఒకటన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అనకొండ కరిచిన తరువాత కూడా వార్న్ ఆ టాస్క్ పూర్తి చేయడం నిజంగా చాలా సాహసంతో కూడుకున్నదని స్టీఫెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం వార్న్ చికిత్స తీసుకుంటున్నాడు. -
అనకొండ మింగితే ఎలాగుంటుంది?
అనకొండ.. చాలా మంది ఆ సినిమాను చూశారు.. ఆ పాము అమాంతం మనుషులను మింగేయడమూ చూశారు.. అయితే.. అది సినిమా.. మరి నిజంగా అది జరిగితేనో.. చిత్రంలో ఉన్న వ్యక్తి ఆ పనే చేయబోతున్నాడు. అమెజాన్ అడవుల్లోకి పోయి.. తనకు తానుగా ఆనకొండకు ఆహారమవబోతున్నాడు. ఇతడి పేరు పాల్ రోసోలీ(26). అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన పాల్ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్. ప్రపంచంలోనే అత్యంత భారీ పాముగా పేరొందిన అనకొండ మనల్ని మింగేస్తే ఎలాగుంటుంది? అన్న విషయాన్ని తెలుసుకోవడానికే పాల్ ఈ సాహసానికి సిద్ధమయ్యాడు. ఎలాగుంటుందో తెలియాలంటే.. అనకొండ మింగిన తర్వాత పాల్ బతికుండాలి కదా.. అందుకే తన కోసం ప్రత్యేకంగా స్నేక్ ప్రూఫ్ సూట్ తయారుచేయించుకున్నాడు. ‘ఈటెన్ ఎలైవ్’ పేరిట రూపొందించిన ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 7న డిస్కవరీ చానల్ ప్రసారం చేయనుంది. ఈ విషయంపై వన్యప్రాణి ప్రేమికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇది జంతువులను తీవ్రంగా హింసించడం కిందకే వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయరాదంటూ చానల్‌ను కోరుతున్నారు. ఈ కార్యక్రమం ప్రోమోల్లో పచ్చ అనకొండాను చూపించారని.. ఆ అనకొండాకు మనిషిని పూర్తిగా మింగే సామర్థ్యం లేదని అంటున్నారు. ఇలాంటి వాటి వల్ల ఆ అనకొండ ప్రాణాలకూ ప్రమాదమేనని చెబుతున్నారు.