జాగ్రత్త! చావుతో ఆడుకుంటున్నావ్‌ | Man Trying To Pull Anaconda In Brazil Viral Video | Sakshi
Sakshi News home page

జాగ్రత్త! చావుతో ఆడుకుంటున్నావ్‌

Published Mon, Jun 29 2020 2:47 PM | Last Updated on Mon, Jun 29 2020 2:58 PM

Man Trying To Pull Anaconda In Brazil Viral Video - Sakshi

వీడియో దృశ్యాలు

బ్రెజీలియా : అనకొండ తోక పట్టుకులాగితే ఏమౌతుంది? దానికి కోపం వస్తే మన ప్రాణం గాల్లో కలిసి పోతుంది. అదంతా ఎందుకు దాన్ని దూరం నుంచి చూడగానే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది దాని తోక పట్టుకోవటమా.. అసాధ్యం అనుకుంటున్నారా?. కానీ కొంతమంది మాత్రం అనకొండతో డెత్‌ గేమ్స్‌ ఆడుతున్నారు. చాలా కాలం క్రితం బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి నదిలో పడవలో వెళుతుండగా నీటిలో ఓ పెద్ద అనకొండ కనిపించింది. దాని పొడవు దాదాపు 17 అడుగులు ఉంటుంది. అది తలుచుకుంటే మనిషిని అమాంతం మింగేయ గలదు. అలాంటి అనకొండ తన మానాన తను నీళ్లలో ఉంటే.. ఆ వ్యక్తి దాని తోక పట్టుకు లాగడం ప్రారంభించాడు. ( అనకొండ, మొసలి భీకర పోరాటం..)

దీంతో అది ఏం జరుగుతోందో అర్థం కాక తప్పించుకోవటానికి తెగ ప్రయత్నించింది. కొద్దిసేపటి తర్వాత సదరు వ్యక్తి దాన్ని విడిచిపెట్టడంతో సర్రున అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో 2014 ప్రాంతానికి చెందినదైనా ప్రస్తుతం మళ్లీ వైరల్‌గా మారింది. ఈ వీడియోను కొత్తగా చూస్తున్న నెటిజన్లు.. ‘‘ అనకొండలతో ఆడుకోవటం ప్రమాదం: ఇది చిన్నపిల్లలకు కూడా తెలుసు... జాగ్రత్త! చావుతో ఆడుకుంటున్నావ్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ‘అది ఫొటోషాప్‌ ఇమేజ్‌.. నిజం కాదు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement