వైరల్‌: మొసలిని చుట్టేసిన భారీ అనకొండ | Anaconda Tries To Swallow Alligator In Brazil | Sakshi
Sakshi News home page

వైరల్‌: మొసలిని చుట్టేసిన అనకొండ

Aug 21 2020 3:21 PM | Updated on Aug 21 2020 4:14 PM

Anaconda Tries To Swallow Alligator In Brazil - Sakshi

బ్రసిలియా: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం. భారీ అనకొండ మొసలిని చుట్టేసి మింగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో‌ వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని కండొమినియంలో గతవారం చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన ఓ సంస్థ ఈ వీడియోను శుక్రవారం షేర్‌ చేసింది. ఈ ట్వీట్‌లో దాదాపు ఆరడుగుల పొడవు ఉన్న అనకొండ మొసలిని పూర్తిగా చుట్టేసినట్లు కనిపిస్తోంది. అది గమనించిన స్థానికులు తాడుతో ఆ రెండింటిని విడిపించే ప్రయత్నం చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటివరకు వేల్లో వ్యూస్‌, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. (చదవండి: షాకింగ్‌ వీడియో: ‘నువ్వు నిజంగా మూర్ఖుడివి’)

‘ఇది ప్రకృతి సహజం.. ‘అనకొండ, ఎలిగేటర్‌ను మింగడం వాటి ఆహార గొలుసులో భాగం’, ‘అనకొండ దాని పని అది చేసుకుంటుంది’, ‘ప్రజలు ప్రకృతిని గౌరవించడం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక దీనిపై స్థానిక వ్యక్తి వివరణ ఇస్తూ.. ‘అనకొండ దాదాపు 6 అడుగుల పొడవు ఉంది. అది మొసలిని మింగుతుంటే కొంతమంది కలిసి తాడుతో రెండింటిని విడదీశాము. అనంతరం ఈ రెండు సరిసృపాలు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయాయి’ అని చెప్పుకొచ్చాడు. 
(చదవండి: ఆవును హెలికాప్ట‌ర్‌లో ఇంటికి చేర్చిన రైతు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement