
భారీ సైజులో ఉన్న అనకొండ రోడ్డుపైకి వచ్చింది. దీంతో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మూడు మీటర్ల పొడవు, 30 కిలోల బరువున్న గ్రీన్ అనకొండ ఇటు అటునుంచి రోడ్డును క్రాస్ చేసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తెగ వైరల్‌అవుతోంది. బ్రెజిల్‌లోని పోర్టో వెల్లో వాసులకు ఆ దృశ్యాన్ని చూసే అరుదైన అవకాశం చిక్కింది.
ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా భావించే ఈ గ్రీన్ అనకొండ రోడ్డుకు ఒకవైపున వున్న పొదల్లోంచి బయటికొచ్చి, మరోవైపున వున్న పొదల్లోకి వెళ్లిపోయింది. అలా అది పెద్ద రహదారిని దాటుతుండటం గమనించిన కొంతమంది సెల్ఫీలు దిగితే.. ఇంకొంతమంది అలాగే షాక్ అయిపోయి అది రోడ్డు దాటి వెళ్లే వరకూ అలా చూస్తుండిపోయారు. అయితే ఆహారం కోసమే అది అలా రోడ్డుమీదికి వచ్చి వుంటుందని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment