బ్రెసిలియా: అనకొండ పాములు భారీ ఆకారంతో పొడవుగా ఉంటాయి. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయి. గ్రీన్ అనకొండలు సుమారు 30 అడుగుల మేర పెరుగుతాయి. సుమారు 550 పౌండ్ల బరువు ఉంటాయి. ఏదైనా జీవిని వేటాడేందుకు దానిని పూర్తిగా చుట్టేసి చంపేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ భారీ ఎలిగేటర్(మొసలి)ని భారీ అనకొండ బంధించింది. మొసలికి ఊపిరిసలపకుండా చేసి ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ సంఘటన బ్రెజిల్‌లో జరిగింది.
అనకొండ బారినుంచి తప్పించుకునేందుకు ఎలిగేటర్ చేసిన ప్రయత్నాన్ని ఇండియానాకు చెందిన కిమ్ సులివాన్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కుయాబా నదిలో మొసలి, అనకొండలు పోరాడాయి. సుమారు 40 నిమిషాల పాటు వాటి పోరాటం సాగినట్లు కిమ్ తెలిపారు. పూర్తిగా చుట్టేయటం వల్ల ఎలిగేటర్ ఊపిరితీసుకునేందుకు ఇబ్బందులు పడింది. పాము నుంచి తప్పించుకునేందుకు మొసలి నీటి అడుగునకు వెళ్లిందని, దాంతో పాము గాలి తీసుకోలేకపోయిందని చెప్పారు.
కొద్ది సమయం తర్వాత మొసలి బయటకు వచ్చిందని, అయినప్పటికీ అనకొండ వదలకుండా అలాగే పట్టినట్లు చెప్పారు కిమ్. దీంతో మరోసారి మొసలి నీటి అడుగుకు చేరుకుని కొన్ని నిమిషాల తర్వాత పైకి వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో అనకొండ కనిపించలేదన్నారు. ఊపిరి పీల్చుకున్న మొసలి తన చోటుకు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ వీడియోను ఆఫ్రికా వైల్డ్‌లైఫ్1 తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఇదీ చదవండి: వీడియో: క్రేన్‌కు భారీ ‘రాకాసి’ చేప.. విలయం తప్పదంటూ వణుకుతున్న జనాలు
Comments
Please login to add a commentAdd a comment