
మారుతున్న కాలానుగుణంగా ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఎండాకాలం, చలికాలం కాస్త వాతావరణంలో పొడిగా, ఎండుగా ఉన్నా.. వర్షాకాలం మాత్రం నేల చాలావరకు తడిగానే ఉంటుంది. దీంతో చెట్లు, పొదలు విపరీతంగా పెరగడంతోపాటు విషజీవులకు నెలవుగా మారుతుంది.. ఆ విషయానికొస్తే పాములు అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు.
పాము కనిపించగానే భయానికిలోనై ప్రాణరక్షణలో దానిని చంపడమో? తప్పించుకోవడమో? చేస్తుంటాము. మనుషులకు నచ్చని దుర్వాసనలు ఎలాగైతే ఉంటాయో.. నిపుణుల పరిశోధన ప్రకారం.. పాములకు కూడా నచ్చని కొన్ని వస్తువుల వాసనలున్నాయి. పాములు మన చుట్టూ పరిసరాలలో కనిపించకుండా, రక్షణగా ఉండడానికి ఈ వాసనలను వెదజల్లితే చాలు. ఇక దరిదాపుల్లో కూడా కనిపిచకుండాపోతాయి.
అవి...
- ప్రతీ ఇంట్లో సహజంగా నిల్వఉండే వెల్లుల్లి, ఉల్లిపాయలు పదార్థాల వాసనకు పాములు తట్టుకోలేవట.
- పుదీనా, తులసి మొక్కల నుంచి వెలువడే వాసనను పాములు ఇష్టపడవు. బహుశా ఏళ్ల తరబడి భారతీయ ఇళ్లల్లో తులసి మొక్కను నాటడానికి కారణం ఇదే.
- అలాగే నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే కూడా పాములు వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి.
- అమ్మోనియా వాయువు వాసనను పాములు తీవ్ర ఇబ్బందిగా, అశాంతిగా భావిస్తాయి.
- పాములు కిరోసిన్ వాసనను కూడా తట్టుకోలేవు.
ఇవి చదవండి: ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..