వీకెండ్ వస్తోంది అంటే మస్తీ మజా అన్నట్టు ఉండేది ఒకప్పుడు. కానీ ఇపుడు హెటెల్‌కి వెళదాం అంటేనే బెంబేలెత్తే పరిస్థితి. గొప్ప గొప్ప పేరున్న హోటల్స్‌లోనూ, ఐస్ క్రీం పార్లర్లలోనూ, బేకరీల్లోనూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇటీవలి కాలంలో బ్రాండెడ్ అని చెప్పుకునే హోటల్స్, ఐస్ క్రీం షాపుల్లో అపరిశుభ్రవాతావరణం, పురుగులు పట్టిన వస్తువులు, కాలం తీరిన సరుకులు. తాజాగా బెంగళూరులో మటన్‌కు బదులు కుక్క మాంసం అమ్ముతున్నారనే వార్తలు ఆందోళన రేపాయి. తాజాగా మటన్ తిని ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటం కలకలం రేపింది.
ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి బెంగళూరుకు మటన్ పేరుతో కుక్క మాంసం సరఫరా చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లా, కల్లూరు గ్రామంలో ఒక కుటుంబం కూడా మటన్ తెచ్చుకుని తిన్నారు. వాంతులు విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన నలుగురూ ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిందా.. లేక ఆ కుటుంబంపై ఏదైనా విషప్రయోగం జరిగిందా అనే అంశంపై విచారణ జరుపుతున్నారు. దీంతోవీకెండ్ అంటేనే భయమేస్తోందని, మటన్‌పేరెత్తాలంటేనే వణుకు పుడుతోందంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పుకార్లను నమ్మవద్దని కొందరు సూచిస్తోంటే, ఇంటి ఫుడ్డే బెటర్ అంటున్నారు కొంతమంది నెటిజన్లు.
కాగా మరోవైపు కుక్కమాసం విక్రయిస్తున్నారన్న పుకార్లపై స్పందించిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు అది కుక్క మాంసం కాదు మేక మాంసమే అని తేల్చిన సంగతి తెలిసిందే. ఇది గుజరాత్‌లోని కచ్-భుజ్ ప్రాంతాలలో కనిపించే సిరోహి అనే మేక జాతికి చెందినది వెల్లడించారు. వాటికి కొద్దిగా పొడుగు తోక, మచ్చలు కూడా ఉంటాయని తేల్చి చెప్పారు. మటన్ ఖరీదు ఎక్కువ కావడంతో తక్కువ రేటులో ఈ మాంసాన్ని విక్రయిస్తారని వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో బీజేపీ మాజీఎంపీ ప్రతాప్ సింహ మరికొందరిపై కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment