చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మరో ‘డ్రా’ను నమోదు చేసుకున్నారు. శుక్రవారం జరిగిన ఆరో రౌండ్‌లో జూ వెన్‌జున్ (చైనా)తో హంపి 27 ఎత్తుల్లో... అనా ముజిచుక్ (ఉక్రెయిన్)తో హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఆరో రౌండ్ తర్వాత హంపి 4.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతుండగా... హారిక నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది.
హరికృష్ణకు షాక్: మరోవైపు చైనాలోనే జరుగుతున్న డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. బూ జియాంగ్‌జి (చైనా)తో శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌లో హరికృష్ణ 57 ఎత్తుల్లో ఓడిపోయాడు.
హారిక, హంపి గేమ్‌లు ‘డ్రా’
Published Sat, Jul 9 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM
Advertisement
Advertisement