హంపికి ‘డ్రా’
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్
టొరంటో: ప్రతిష్టాత్మక ‘ఫిడే’ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో రెండో రౌండ్‌లో నాలుగు గేమ్‌లలో కూడా ఫలితం వచ్చింది. భారత గ్రాండ్‌మాస్టర్ విది త్ గుజరాతీ...అమెరికాకు చెందిన వరల్డ్ నంబర్ 3 హికారు నకమురాపై 29 ఎత్తుల్లో సంచలన విజయం సాధించడం విశేషం. వరుసగా 47 గేమ్‌లలో ఓటమి లేకుండా కొనసాగిన నకమురా విజయయాత్రకు విదిత్ బ్రేక్ వేశాడు.
భారత ఆటగాళ్ల మధ్య జరిగిన పోరులో డి.గుకేశ్ 33 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించాడు. ఇతర రెండో రౌండ్ గేమ్‌లలో ఇయాన్ నెపొనియాచి (రష్యా ) 45 ఎత్తుల్లో అలీ రెజా ఫిరోజా (ఫ్రాన్స్)పై విజయం సాధించగా...మరో గేమ్‌లో ఫాబియానో కరూనా (అమెరికా) 37 ఎత్తుల్లో నిజాత్ అబసోవ్ (అజర్‌బైజాన్)పై గెలుపొందాడు.
మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కోనేరు హంపి తన రెండో రౌండ్ గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. కటారినా లాగ్నో (ఉక్రెయిన్)తో ఈ గేమ్ 38 ఎత్తుల తర్వాత ముగిసింది. మరో గేమ్‌లో మ్యాచ్‌లలో చైనాకు చెందిన టాన్ జోంగీ చేతిలో భారత ప్లేయర్ వైశాలి ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment