హంపి ఖాతాలో నాలుగో ‘డ్రా’
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఐదో రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్స్ అజేయంగా నిలిచారు. ఓపెన్ విభాగంలో తమిళనాడు కుర్రాడు దొమ్మరాజు గుకేశ్ ఈ టోరీ్నలో రెండో విజయాన్ని నమోదు చేయగా... ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతి తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరగా... తమిళనాడు అమ్మాయి వైశాలి కూడా తన గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది.
గుకేశ్ 87 ఎత్తుల్లో నిజాత్ అబసోవ్ (అజర్‌బైజాన్)ను ఓడించగా... విదిత్–కరువానా (అమెరికా) గేమ్ 30 ఎత్తుల్లో... ప్రజ్ఞానంద–నెపోమ్‌నిషి (రష్యా) గేమ్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. హంపి–గొర్యాచ్‌కినా (రష్యా) గేమ్ 44 ఎత్తుల్లో... వైశాలి–అనా ముజిచుక్ (ఉక్రెయిన్) గేమ్ 49 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.
ఐదో రౌండ్ తర్వాత ఓపెన్ విభాగంలో గుకేశ్ 3.5 పాయింట్లతో నిపోమ్‌నిషితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. 2.5 పాయింట్లతో ప్రజ్ఞానంద నాలుగో ర్యాంక్‌లో, 2 పాయింట్లతో విదిత్ ఆరో ర్యాంక్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment