కర్ణాటక ,హొసపేటె: కన్నడ సీనియర్ సినీ నటి జయంతి హంపీలో చిక్కుకుపోయారు. హంపీలో ఉంటున్న తన కుమారుడు కృష్ణకుమార్‌ను చూసేందుకు గత నెల 22న లాక్‌డౌన్ ప్రకటించడానికి రెండు రోజుల ముందు నటి జయంతి బెంగళూరునుంచి ఇక్కడకు విచ్చేశారు. ఉన్న ఫళంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో బెంగళూరుకు వెళ్లలేకపోయారు. జయంతి మాట్లాడుతూ లాక్‌డౌన్ ఈ నెల 14న పూర్తి అవుతుందని భావించామన్నారు. తిరిగి లాక్‌డౌన్ వచ్చే నెల 3 వరకు పొడిగించడంతో హంపీ సమీపంలోని ఓ హోటల్లోనే ఉండి పోవాల్సి వచ్చిందన్నారు. హోటల్‌లో తమకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment