షిమ్‌కెంట్ (కజకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి కోనేరు హంపికి తొలి పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపి 34 ఎత్తుల్లో కజకిస్తాన్‌కు చెందిన అసబయేవా బీబీసారా చేతిలో ఓడిపోయింది.
పది మంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. భారత్‌కే చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌తో జరిగిన తొలి గేమ్ ను 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... టాన్ జోంగి (చైనా)తో జరిగిన రెండో గేమ్‌ను 70 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.
మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన మూడో గేమ్‌లో హంపి 45 ఎత్తుల్లో గెలిచింది. సలీమోవా (బల్గేరియా)తో జరిగిన నాలుగో గేమ్‌లో హంపి 64 ఎత్తుల్లో నెగ్గింది. ఐదో రౌండ్ తర్వాత హంపి 3 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా 3వ స్థానంలో ఉంది.
దివ్య గెలుపు బోణీ
భారత రైజింగ్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్ ఐదో రౌండ్‌లో గెలుపు బోణీ కొట్టింది. మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో దివ్య 45 ఎత్తుల్లో నెగ్గింది. హంపితో తొలి రౌండ్ గేమ్‌ను ‘డ్రా’గా ముగించిన దివ్య... కాటరీనా లాగ్నోతో జరిగిన రెండో గేమ్‌ను కూడా ‘డ్రా’ చేసుకుంది. అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా)తో జరిగిన మూడో గేమ్‌లో దివ్య 40 ఎత్తుల్లో ఓడిపోయింది. టాన్ జోంగి (చైనా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను దివ్య 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment