
స్టావెంజర్: నార్వే చెస్ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి తన జోరు కొనసాగిస్తోంది. నాలుగో రౌండ్ గేమ్‌లో వైశాలి 54 ఎత్తుల్లో పియా క్రామ్లింగ్ (స్వీడన్)పై గెలిచింది. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత వైశాలి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
భారత నంబర్‌వన్ కోనేరు హంపి 55 ఎత్తుల్లో అనా ముజిచుక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు, భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద నాలుగో రౌండ్‌లో 65 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment