ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పోరాటం ముగిసింది. జొ లాంటా జవద్జా్క (పోలాండ్)తో జరిగిన రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను డ్రా చేసుకున్న హంపి రెండో గేమ్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి రెండో గేమ్‌ను తెల్ల పావులతో ఆడి 78 ఎత్తుల్లో పరాజయం పాలైంది.
మరో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. బేలా ఖొటెనాష్‌విలి (జార్జియా)తో రెండో రౌండ్ రెండో గేమ్‌ను కూడా హారిక ‘డ్రా’ చేసుకుంది. దీంతో విజేతను తేల్చేందుకు టైబ్రేక్ నిర్వహించగా... అందులో గెలిచి మూడో రౌండ్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్ తరఫున హారిక మాత్రమే బరిలో మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment