బకూ (అజర్‌బైజాన్): ప్రపంచ కప్ చెస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి కీలక విజయాన్ని అందుకున్నాడు. మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో అర్జున్ 53 ఎత్తుల్లో భారత్‌కే చెందిన ఆర్. ప్రజ్ఞానందను ఓడించాడు. నల్లపావులతో ఆడిన అర్జున్‌కు ఈ విజయంతో ఆధిక్యం దక్కింది. బుధవారం తెల్ల పావులతో ఆడి రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకు న్నా అతను సెమీస్ చేరతాడు.
తొలి గేమ్‌లు డ్రా
మరో క్వార్టర్స్ పోరులో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) జోరు ముందు భారత ఆటగాడు డి.గుకేశ్ నిలవలేకపోయాడు. నల్ల పావులతో ఆడిన కార్ల్‌సన్ 48 ఎత్తులో గుకేశ్ ఆటకట్టించాడు. మరో రెండు క్వార్టర్ ఫైనల్ సమరాల తొలి గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.
విదిత్ గుజరాతీ (భారత్), నిజాత్ అబసోవ్ (అజర్ బైజాన్) మధ్య గేమ్ 109 ఎత్తుల్లో... ఫాబియోనో కరువానా (అమెరికా), లీనియర్ డొమినెగ్వెజ్ పెరెజ్ (అమెరికా) మధ్య గేమ్ 71 ఎత్తుల్లో ‘డ్రా‘ అయ్యాయి.
ఇదో చారిత్రక ఘట్టం
మరోవైపు నలుగురు భారత ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరడం పెద్ద విశేషమని దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ‘భారత చదరంగంలో ఇదో చారిత్రక ఘట్టం’ అని ఆనంద్ విశ్లేషించాడు. ‘ఒకరు కానీ ఇద్దరు కానీ క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలరని నేను అంచనా వేశాను. కానీ నలుగురు ముందంజ వేయగలిగారు. వారి ఆట చూస్తే ఇంకా ముందుకు వెళ్లగల సామర్థ్యం ఉందని నమ్ముతున్నా’ అని ఆనంద్ అభిప్రాయ పడ్డాడు.
చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే!
Comments
Please login to add a commentAdd a comment