ఆసియాకప్‌ 2020 వాయిదా : గంగూలీ | BCCI President Sourav Ganguly Says Asia Cup 2020 Has Been Cancelled | Sakshi
Sakshi News home page

ఆసియాకప్‌ 2020 వాయిదా : గంగూలీ

Published Wed, Jul 8 2020 8:34 PM | Last Updated on Wed, Jul 8 2020 8:40 PM

BCCI President Sourav Ganguly Says Asia Cup 2020 Has Been Cancelled - Sakshi

ముంబై : కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ టోర్నమెంట్ రద్దయినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. అయితే ఆసియా కప్‌ నిర్వహించాలా వద్దా అనే దానిపై ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ గురువారం (జూలై 9న) జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. కాగా ఒకరోజే ముందే గంగూలీ ఆసియా కప్‌ రద్దు అయినట్లు  ప్రకటించడం విశేషం. బుధవారం ఒక ప్రముఖ మీడియాతో లైవ్ సెషన్‌లో పాల్గొన్న గంగూలీ.. అందులో భారత క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ జట్టును తిరిగి మైదానంలో ఎప్పుడు చూస్తామని ప్రశ్నించారు. (క్రికెట్​ బంతితో కరోనా వైరస్​?)

దీనిపై గంగూలీ స్పందిస్తూ.. 'టీమిండియా మొదట ఏ సిరీస్‌ ఆడుతుందో చెప్పడం కష్టం. కరోనా వైరస్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. మనం చేయగలిగేది వేచి ఉండటమే. అయితే ఐపీఎల్ 2020 వాయిదా పడింది. టీ 20 ప్రపంచ కప్ పై ఐసీసీ ఓ నిర్ణయం తీసుకుంటే... మనం ఐపీఎల్ గురించి ఆలోచించగలము. ఇక సెప్టెంబరులో  జరగాల్సిన ఆసియా కప్ రద్దు చేయబడింది. కాబట్టి భారతదేశంలో క్రికెట్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో ప్రస్తుతానికి నేను చెప్పలేను' అని తెలిపాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీం ఖాన్ ఈ ఏడాది చివర్లో శ్రీలంకలో లేదా యుఎఇలో షెడ్యూల్ చేసిన విధంగా ఆసియా కప్ 2020 ముందుకు సాగుతుందని హామీ ఇచ్చిన కొద్ది రోజులకే గంగూలీ ఈ ప్రకటన చేశాడు. అయితే ఈ విషయం పై పీసీబీ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement