విలీన మండలాల్లో జగన్ పర్యటనకు పోలీసుల అభ్యంతరం
సాక్షిప్రతినిధి, కాకినాడ: ఏజెన్సీలోని విలీన మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన పోలీసులు అభ్యంతరాలతో వాయిదా వేసినట్టు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ చెప్పారు. బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ విలీన మండలాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జగన్ ఈ నెలలో పర్యట
పర్యటన వాయిదా
సాక్షిప్రతినిధి, కాకినాడ: ఏజెన్సీలోని విలీన మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన పోలీసులు అభ్యంతరాలతో వాయిదా వేసినట్టు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ చెప్పారు. బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ విలీన మండలాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జగన్ ఈ నెలలో పర్యటించాల్సి ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా జగన్ ఆదేశించారన్నారు. అయితే ఈలోపు ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన నేపధ్యంలో జగన్ పర్యటనపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ పోలీసు అధికారులను కలిసి పర్యటనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరినా పోలీసులు అంగీకరించలేదని చెప్పారు. దీంతో పర్యటన వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు.