న్యూఢిల్లీ : పెండింగ్‌లో ఉన్న టెన్త్ పరీక్షలన్నింటిని రద్దు చేస్తూ సీబీఎస్‌ఈ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సీబీఎస్ఈ పరిధిలోని ప్లస్‌టూ (12 వ తరగతి) పరీక్షలను రద్దుచేసే ఆలోచన ఇప్పుడు లేదని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి వెల్లడించారు. కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం పోరాడుతుందని, దానికి సీబీఎస్ఈ కూడా అతీతం కాదని అన్నారు. తల్లిదండ్రులు సంయమనం పాటించాలని కోరారు. పరిస్థితి మెరుగుపడ్డాక పరీక్షల గురించి వెల్లడిస్తామని, అప్పటివరకు ఓపికతో ఉండాల్సింగా పేర్కొన్నారు. (కోవిడ్-19 ఎఫెక్ట్ : టెన్త్ పెండింగ్ పరీక్షలు రద్దు)
అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న టెన్త్ పరీక్షలు రద్దు చేసినందున, వారి ఇంటర్నల్ మార్కులు, మరికొన్ని అంశాల ఆధారంగా తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయబడతారని స్పష్టం చేశారు. అయితే కరోనా సంక్షోభ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కానందున విద్యార్థుల పనితీరు, ప్రీవియస్ మార్కులను దృష్టిలో ఉంచుకొని 10, 12వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సినోడియా సూచించారు. ఈ విషయంలో మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు.
1. CBSE की 10 व 12वीं की बची हुई परीक्षाएँ कराना अभी सम्भव नहीं होगा अतः internal exams के आधार पर ही बच्चों को पास किया जाय जैसा कि 9 वीं और 11वीं के बच्चों को पास किया गया है.
— Manish Sisodia (@msisodia) April 28, 2020
2/4
Comments
Please login to add a commentAdd a comment