Class 12
-
NCERT: బాబ్రీ కాదు.. 3 గోపురాల నిర్మాణం
న్యూఢిల్లీ : హేతుబద్దీకరణ పేరుతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోనూ అనేక మార్పులు చేసింది. ‘బాబ్రీ మసీదు’ సహా అనేక కీలక అంశాలను, చాలా సమాచారాన్ని తొలగించింది. తొలగింపులు అంశాలవారీగా.. ⇒ ‘బాబ్రీ మసీదు’ పదం తొలగింపు: పాఠ్య పుస్తకంలోంచి బాబ్రీ మసీదు అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. దాని స్థానంలో ‘మూడు గోపురాల నిర్మాణం’ను చేర్చింది. ⇒ అయోధ్య అధ్యాయం తగ్గింపు: నాలుగు పేజీలున్న అయోధ్య అధ్యాయాన్ని రెండు పేజీలకు తగ్గించింది. రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూలి్చవేత, అనంతరం జరిగిన హింస, ఆ తరువాత బీజేపీ పాలిత ప్రాంతాల్లో విధించిన రాష్ట్రప తి పాలన అంశాలను తొలగించింది. ⇒ చారిత్రక వివరాల సవరణ: బాబ్రీ మసీదుకు సంబంధించిన వివరాల్లో కూడా అనేక మార్పులు చేసింది. బాబ్రీ మసీదును 16వ శతాబ్దంలో మీర్ బాకీ నిర్మించినట్లుగా గత పుస్తకంలో ఉండగా.. 1528లో రాముడి జన్మస్థలంలో నిర్మించబడిన మూడు గోపురాల నిర్మాణంగా ఇప్పుడు పేర్కొన్నది. అంతేకాదు ఈ నిర్మాణంలో అనేక హిందూ చిహ్నాలు ఉన్నాయని, లోపలి, వెలుపలి గోడలపై శిల్పాలు ఉన్నాయని కొత్త పుస్తకం పేర్కొంది. హిందూ చిత్రాలు, విగ్రహాలను కూడా కొత్తగా ప్రస్తావించింది. ⇒ చట్టపరమైన, మతపరమైన కథనాల్లోనూ మార్పులు: ఆలయంలో పూజలు చేసుకునేందుకు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని తెరచి ఉంచాలని 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్ జిల్లా కోర్టు ఇచి్చన తీర్పును పాత పుస్తకం వివరించగా, వాటన్నింటిని తొలగించి మూడు గోపురాల నిర్మాణం, తరువాత వచి్చన మతపరమైన వైరుధ్యాలను కొత్త పుస్తకం క్లుప్తంగా ప్రస్తావించింది. వివాదాస్పద భూమి ఆలయానికే చెందుతుందంటూ 2019లో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును మాత్రం కొత్త ఎడిషన్‌లో చేర్చింది. ⇒ వార్తాపత్రికల కటింగ్స్ తీసివేత: పాత పుస్తకంలో వార్తాపత్రిక కథనాలకు సంబంధించిన అనేక ఛాయాచిత్రాలు ఉన్నాయి. వీటిలో డిసెంబర్ 7, 1992న ’బాబ్రీ మసీదు కూలి్చవేత, కేంద్రం కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం కూడా ఉంది. వీటన్నింటినీ తొలగించారు. ⇒ గుజరాత్ అల్లర్ల అధ్యాయం తొలగింపు: ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం నుంచి గుజరాత్ అల్లర్ల ప్రస్తావనను పూర్తిగా తొలగించింది. అల్లర్ల గురించి బోధించాల్సిన అవసరం లేదుఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ద్వేషం, హింస బోధనాంశాలు కావని, పాఠశాల పాఠ్యపుస్తకాలు వాటిపై దృష్టి పెట్టకూడదని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) చీఫ్ దినేష్ ప్రసాద్ సక్లానీ అన్నారు. గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీదు కూలి్చవేత గురించి బోధిస్తే పాఠశాల విద్యార్థులు హింసాత్మకంగా తయారవుతారని, అందుకే వాటిని పాఠ్యాంశాల్లోంచి తొలగించామని వెల్లడించారు. పాఠ్య పుస్తకాల్లో మార్పులు, బాబ్రీ మసీదు కూల్చివేత, తరువాత మతపరమైన హింసకు సంబంధించిన అంశాల తొలగింపులపై శనివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. సమాజంలో విద్వేషాలను సృష్టించే విధంగా బోధనలు అవసరం లేదని, చిన్నపిల్లలకు అల్లర్ల గురించిన నేరి్పంచాల్సిన అవసరం లేదని, అది ఎందుకు జరిగిందో పెద్దయ్యాక వారే తెలుసుకుంటారని చెప్పారు. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కాషాయీకరణ చేశారనే ఆరోపణలను కొట్టి పారేశారు. రామజన్మభూమికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని పాఠ్యపుస్తకాల్లో ఎందుకు చేర్చకూడదని, పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించడం విద్యార్థులకు ఎందుకు తెలియకూడదని ఆయన ప్రశ్నించారు. చరిత్రను యుద్ధభూమిగా మార్చడానికి కాకుండా విద్యార్థులకు వాస్తవాలు తెలిసేలా బోధిస్తామన్నారు. పాఠ్యపుస్తకాల పునరి్వమర్శ ప్రపంచవ్యాప్తంగా జరిగే అభ్యాసమని, ఏది మార్చాలన్నది సబ్జెక్ట్, బోధనా శాస్త్ర నిపుణులే నిర్ణయిస్తారని, తాను ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో 2014 నుంచి ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు మార్పులు చేశారు. -
కష్టపడి చదివి ఇంటర్ పాసైన ఎమ్మెల్యేలు.. డిగ్రీ పూర్తి చేయడమే లక్ష్యం
లక్నో: చదువుకోవాలనే తపన ఉంటే వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వీరు కష్టపడి చదివి ఇంటర్లో ఉత్తీర్ణులయ్యారు. ఇపుడు డిగ్రీ పూర్తి చేయడమే తమ లక్ష్యమని, ఎలాగైనా పట్టుభద్రులం అవుతామని చెబుతున్నారు. బరేలి జిల్లా బిత్రి-చైన్పూర్ నుంచి 2017లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రాజేశ్ మిశ్రా. మంగళవారం ప్రకటించిన యూపీ ఇంటర్ ఫలితాల్లో ఈయన 500కు గానూ 263 మార్కులు తెచ్చుకుని ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల క్రితమే పదో తరగతి పాసయ్యారు. ఇప్పుడు ఇంటర్ కూడా పూర్తి చేసి చదువుపై తనకున్న మక్కువ చాటుకున్నారు. డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెబుతున్నారు. అయితే మార్కులుపై తాను సంతృప్తిగా లేనని మరోసారి తన ఆన్సర్ షీట్స్‌ను మూల్యంకనం చేయిస్తానని మిశ్రా చెప్పడం గమనార్హం. హస్తీన్పూర్ నుంచి ఎస్పీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభూదయాల్ వాల్మీకి కూడా ఇంటర్లో పాసయ్యారు. సెకండ్ క్లాస్‌లో ఆయన ఉత్తీర్ణులయ్యారు. చదవుకు వయసులో సంబంధం లేదని పేర్కొన్నారు. డా.బీఆర్ అంబేడ్కరే తనకు స్ఫూర్తి అని, డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెప్పారు. ఈయన 2002-2007 వరకు, 2012-2017వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. చదవండి: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి.. మూడు రోజులు సంతాప దినాలు.. -
CBSE: ఆగస్ట్ 15– సెప్టెంబర్ 15 మధ్య ఐచ్ఛిక పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: 12వ తరగతి ఐచ్ఛిక పరీక్షలు ఆగస్టు 15– సెప్టెంబరు 15 మధ్య నిర్వహిస్తామని సీబీఎస్ఈ పేర్కొంది. అదీ పరిస్థితులు అనుకూలిస్తేనే అని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఫలితాల వెల్లడికి కాలపరిమితి నిర్ణయిస్తామని తెలిపింది. ఫలితాల అనంతరం విద్యార్థుల కోసం వివాద పరిష్కార యంత్రాంగం ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొంది. అసెస్మెంట్ పాలసీ ప్రకారం జూలై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడిస్తామని, తమకు వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఐచ్ఛిక పరీక్షలకు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. వీరికి పరీక్షల్లో వచ్చి న మార్కులనే తుది ఫలితంగా ఖరారు చేస్తామని వివరించింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో మూడేళ్ల ప్రతిభను ఆధారంగా మూల్యాంకనం చేస్తామని, 30:30:40 ఫార్ములాను అనుసరిస్తామని సీబీఎస్ఈ ప్రతిపాదించగా సుప్రీంకోర్టు ఆమోదించడం తెలిసిందే. పదో తరగతి మార్కులను 30 శాతానికి, 11వ తరగతి మార్కులకు 30 శాతానికి, 12వ తరగతిలో యూనిట్ టెస్టులు, మిడ్‌టర్మ్ పరీక్షలు, ప్రీ ఫైనల్స్‌ను కలిపి 40 శాతానికి పరిగణనలోకి తీసుకొని మార్కులకు కేటాయిస్తామని సీబీఎస్ఈ వివరించింది. సెప్టెంబర్ ఒకటిలోపు పరీక్షలు నిర్వహిస్తామని సీఐఎస్సీఈ తెలిపింది. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ. 2 లక్షలు మీ సొంతం కోల్పోయిన ఆధార్ నెంబర్ తిరిగి పొందడం ఎలా..? -
ప్లస్‌టూ పరీక్షలపై త్వరలోనే నిర్ణయం
న్యూఢిల్లీ : పెండింగ్‌లో ఉన్న టెన్త్ పరీక్షలన్నింటిని రద్దు చేస్తూ సీబీఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సీబీఎస్ఈ పరిధిలోని ప్లస్‌టూ (12 వ తరగతి) పరీక్షలను రద్దుచేసే ఆలోచన ఇప్పుడు లేదని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి వెల్లడించారు. కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం పోరాడుతుందని, దానికి సీబీఎస్ఈ కూడా అతీతం కాదని అన్నారు. తల్లిదండ్రులు సంయమనం పాటించాలని కోరారు. పరిస్థితి మెరుగుపడ్డాక పరీక్షల గురించి వెల్లడిస్తామని, అప్పటివరకు ఓపికతో ఉండాల్సింగా పేర్కొన్నారు. (కోవిడ్-19 ఎఫెక్ట్ : టెన్త్ పెండింగ్ పరీక్షలు రద్దు) అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న టెన్త్ పరీక్షలు రద్దు చేసినందున, వారి ఇంటర్నల్ మార్కులు, మరికొన్ని అంశాల ఆధారంగా తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయబడతారని స్పష్టం చేశారు. అయితే కరోనా సంక్షోభ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కానందున విద్యార్థుల పనితీరు, ప్రీవియస్ మార్కులను దృష్టిలో ఉంచుకొని 10, 12వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సినోడియా సూచించారు. ఈ విషయంలో మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. 1. CBSE की 10 व 12वीं की बची हुई परीक्षाएँ कराना अभी सम्भव नहीं होगा अतः internal exams के आधार पर ही बच्चों को पास किया जाय जैसा कि 9 वीं और 11वीं के बच्चों को पास किया गया है. 2/4 — Manish Sisodia (@msisodia) April 28, 2020 -
సీబీఎస్ఈ ‘12’ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మేఘన శ్రీవాస్తవ ఈ పరీక్షలో 99.8 శాతం(500 మార్కులకు గానూ 499) మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 83.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది అబ్బాయిల కంటే అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించినట్లు సీబీఎస్ఈ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ పరీక్షలో అబ్బాయిలు 78.99 శాతం, అమ్మాయిలు 88.31 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇక యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన అనౌష్కా చంద్ర 498 మార్కులతో రెండోస్థానంలో నిలవగా, 497 మార్కులతో మరో ఏడుగురు విద్యార్థులు మూడోస్థానంలో నిలిచారన్నారు. కాగా, జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత షాబిర్ షా కుమార్తె సమా షాబిర్ ఈ పరీక్షల్లో 97.8 శాతం మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే విదేశాల్లోని పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 94.94 శాతానికి చేరుకుందన్నారు. కొన్నిరోజుల క్రితం 12వ తరగతి అర్థశాస్త్రం ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన సీబీఎస్ఈని కుదిపేసినప్పటికీ నిర్ణీత గడువులోగానే ఫలితాలను ప్రకటించడం గమనార్హం. కాగా పరీక్షా ఫలితాల అనంతరం టాపర్ మేఘన మీడియాతో మాట్లాడుతూ.. ‘టాపర్‌గా నిలుస్తానని అస్సలు ఊహించలేదు. ఏడాదంతా నిరంతరం కష్టపడి చదవడం వల్లే ఇది సాధ్యమైంది’ అని చెప్పారు. మరోవైపు విద్యార్థులు పరీక్షా ఫలితాల అనంతరం ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వీలుగా 1800–11–8004 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు సీబీఎస్ఈ ప్రజా సంబంధాల అధికారి రమా శర్మ తెలిపారు. ఇందులో భాగంగా 69 మంది కౌన్సెలర్లు, నిపుణులు(49 మంది భారత్‌లో, మిగతావారు విదేశాల్లో) ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తారని వెల్లడించారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకూ నిపుణులు అందుబాటులో ఉంటారని రమా శర్మ చెప్పారు. మేఘన శ్రీవాస్తవ -
హవ్వా.. వీళ్లా ఇంటర్ టాపర్లు!
పాట్నా: 'రాజనీతి శాస్త్రం వంటలు చేయడం గురించి నేర్పిస్తుందట. ఇక నీళ్లకు హెచ్2వోకు చాలా బేధాలున్నాయట' ఈ మాటలు మొన్న బిహార్‌లో వెల్లడించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ వచ్చిన విద్యార్థులు చెప్పిన సమాధానాలు. దీంతో వారికి మరోసారి పరీక్షలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బిహార్‌లో ఇటీవల పన్నెండో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో రూబీ రాయ్(17) అనే విద్యార్థి ఆర్ట్స్ విభాగంలో టాపర్. అలాగే మరో విద్యార్థి జూనియర్ లెవల్లో టాపర్. వీరిద్దరిని స్థానిక మీడియా ఒకటి ఇంటర్వ్యూ చేసింది. ఇందులో రూబీని పాలిటిక్స్ గురించి ప్రశ్నించగా.. వంట చేయడం గురించి చెబుతుందని, మరో జూనియర్ విద్యార్థి హెచ్ టూ వో, నీళ్లు గురించి అడిగితే తెలియదని చెప్పడంతో వాళ్లు అవాక్కయ్యారు. ఇలాంటి వారు మొత్తం పదిమంది టాపర్లను ప్రశ్నించినా ఇలాంటి సమాధానాలే చెప్పడంతో ఆ వివరాలు బయటకొచ్చాయి. దీంతో ఆ పదిమంది విద్యార్థులకు వచ్చే వారంలో మళ్లీ పరీక్ష పెట్టేందుకు బిహార్ అధికారులు సిద్ధమయ్యారు. కాగా, ఇక్కడ హాజీపూర్‌లోని వీన్ రాయ్ అనే కాలేజీకి చెందిన విద్యార్థులే అధికంగా చీటింగ్ పాల్పడ్డారని విద్యాశాఖ అధికారులు చెప్పారు. -
సీబీఎస్ఈ ప్లస్ 2 ఫలితాల విడుదల
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 12 తరగతి ఫలితాలను శనివారం విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 10.67 లక్షల మంది విద్యార్థులు (ప్లస్ 2) ఈ పరీక్షలకు హాజరయ్యారు. గత మార్చి 1 వ తేదీ నుంచి ఏప్రిల్ 22 వరకు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా జేఈఈతో పాటు ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ లకు హాజరైన విద్యార్థులు సీబీఎస్ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్టు ముందుగా సంకేతాలు ఇచ్చారు. ఫలితాలను www.cbseresults.nic.in లో చూసుకోవచ్చు. ఢిల్లీలోని మోంట్‌ఫోర్ట్ స్కూలుకు చెందిన సుక్రితీ గుప్తా 500మార్కులకుగానూ 497 మార్కులతో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. హర్యానాలోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన పాలక్ గోయల్ 496 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది. హర్యానాలోని సెయింట్ థెరిస్సా కాన్వెంట్ స్కూల్‌కు చెందిన సోమ్యా ఉప్పల్ 495 మార్కులతో మూడో ర్యాంకు సాధించింది. తమిళనాడులోని అజిత్ శేఖర్ 495 మార్కులతో నాలుగో స్థానంలో నిలిచాడు. -
పన్నేండేళ్లకే పన్నెండు పూర్తి చేశాడు
రాజస్థాన్: రాజస్థాన్‌లో ఓ పన్నేండేళ్ల పిల్లాడు రికార్డు సృష్టించాడు. పన్నేండేళ్లకే పన్నెండో తరగతి పాసయ్యాడు. సోమవారం సాయంత్రం రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఆర్బీఎస్ఈ) విడుదల చేసిన ఫలితాల్లో ఈ రికార్డు వెల్లడయింది. అబ్బాస్ శర్మ అనే పిల్లాడి వయసు 12 ఏళ్లు. ఇతడు ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడే తండ్రి సచిన్ శర్మ 2004లోనే స్కూల్ లో పేరు నమోదు చేశాడు. గతంలో పదేళ్లకే పదో తరగతి పాసై రికార్డు సృష్టించి చర్చల్లో నిలిచాడు. తాజాగా మరోసారి పన్నెండో తరగతిలో 600 మార్కులకు 325 మార్కులు తెచ్చుకొని దిగ్విజయంగా ఢిగ్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. -
సీబీఎస్ఈ పరీక్షల డేటాషీట్ విడుదల
ఈ ఏడాది సీనియర్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (12వ తరగతి), సెంకడరీ స్కూల్ ఎడ్యుకేషన్ (పదో తరగతి) పరీక్షలకు హాజరుకాబోయే విద్యార్థుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తాజాగా డేటాషీట్ విడుదల చేసింది. సీబీఎస్ఈ పరిధిలో పదో తరగతి పరీక్షలు మార్చ్ 1వ తేదీ నుంచి ప్రారంభమై.. మార్చి 28వ తేదీన ముగియనున్నాయి. 12వ తరగతి పరీక్షలు మార్చ్ 1న ప్రారంభమై.. ఏప్రిల్ 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ (www.cbse.nic.in.) లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.