సీబీఎస్ఈ ప్లస్ 2 ఫలితాల విడుదల
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 12 తరగతి ఫలితాలను శనివారం విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 10.67 లక్షల మంది విద్యార్థులు (ప్లస్ 2) ఈ పరీక్షలకు హాజరయ్యారు. గత మార్చి 1 వ తేదీ నుంచి ఏప్రిల్ 22 వరకు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా జేఈఈతో పాటు ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ లకు హాజరైన విద్యార్థులు సీబీఎస్ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
సీబీఎస్ఈ ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్టు ముందుగా సంకేతాలు ఇచ్చారు. ఫలితాలను www.cbseresults.nic.in లో చూసుకోవచ్చు.
- ఢిల్లీలోని మోంట్ఫోర్ట్ స్కూలుకు చెందిన సుక్రితీ గుప్తా 500మార్కులకుగానూ 497 మార్కులతో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది.
- హర్యానాలోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్కు చెందిన పాలక్ గోయల్ 496 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది.
- హర్యానాలోని సెయింట్ థెరిస్సా కాన్వెంట్ స్కూల్కు చెందిన సోమ్యా ఉప్పల్ 495 మార్కులతో మూడో ర్యాంకు సాధించింది.
-
తమిళనాడులోని అజిత్ శేఖర్ 495 మార్కులతో నాలుగో స్థానంలో నిలిచాడు.