
సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ
సాక్షి, న్యూఢిల్లీ : పెండింగ్‌లో ఉన్న పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) జులైలో నిర్వహిస్తుందని వెల్లడించింది. ఈ తరగతులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సబ్జెక్టుల పరీక్షలను సీబీఎస్‌ఈ జులై 1 నుంచి 15 వరకూ నిర్వహిస్తుందని మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా అంతకుమందు విద్యార్ధులతో లైవ్‌లో ముచ్చటించిన హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పది, పన్నెండో తరగతి పరీక్షలపై సీబీఎస్‌ఈ ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఇదే సమావేశంలో జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి ప్రకటించారు. ఈ ఎంట్రన్స్ పరీక్షలు జులై ద్వితీయార్ధంలో జరుగుతాయని తెలిపారు. కాగా పెండింగ్‌లో ఉన్న పది, పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేయలేదని, వాటిని నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ఇటీవల వివరణ ఇచ్చింది. పరీక్షల నిర్వహణకు ముందు విద్యార్ధులకు ప్రిపరేషన్ కోసం తగినంత సమయం ఇస్తామని స్పష్టం చేసింది.