రెండు ప్రత్యేక రైళ్లు రద్దు | special trains cancelled due to techinical problem | Sakshi
Sakshi News home page

రెండు ప్రత్యేక రైళ్లు రద్దు

Published Fri, Feb 24 2017 5:59 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

సాంకేతిక కారణాల దృష్ట్యా రెండు ప్రత్యేక రైళ్లను రద్దు చేశారు.

విజయవాడ: సాంకేతిక కారణాల దృష్ట్యా ముందుగా ప్రకటించిన కోచివేలి –గౌహతి –కోచివేలి ప్రత్యేక రైళ్లను ఈ నెల 26, మార్చి 1వ తేదీన రద్దు చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ ఇన్‌చార్జ్‌ పీఆర్వో జేవీఆర్‌కే రాజశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 వ తేదీన రావాల్సిన కోచివేలి–గువాహటి నంబరు 06336 ప్రత్యేక రైలును, అలాగే నంబర్‌ 06335 గౌహతి-కోచివేలి ప్రత్యేక రైలు (మార్చి1వ తేదీ)ను రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రాజశేఖర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement